TE/Prabhupada 0784 - దైవిక పరిస్థితిలో మనం పనిచేయకపోతే, మనం మాయ యొక్క కోరలలో పని చేస్తుండాలి



Lecture on SB 6.1.44 -- Los Angeles, July 25, 1975


కాబట్టి ఈ భౌతిక శరీరం తీసుకున్న ఎవరైనా ఆయన ఒక క్షణం కూడా ఉండలేడు. ఏదో ఒక పని చేయకుండా . నా హి అకర్మ - కృత్. ఇది స్వభావం. ఆయన తప్పనిసరిగా... ఉదాహరణకు పిల్లల వలె. పిల్లవాడు ఎల్లప్పుడూ విరామం లేకుండా ఉంటాడు. అదేవిధముగా... " పిల్లవాడు పురుషుని యొక్క తండ్రి." తండ్రి అయినవాడు, అదే విశ్రాంతి లేకపోవడం, ఎందుకంటే అది స్వభావం. న హి దేహవాన్ అకర్మ - కృత్. కాబట్టి మీరు మంచి పనిలో పాల్గొనకపోతే, మీరు చెడ్డ పనులను చేస్తుండాలి. అది సహజమైనది. మీరు పని చేయాలి. కాబట్టి పనిలేకుండా ఉన్న మనస్సు దెయ్యాల కార్ఖానా. డెవిల్స్ వర్క్ షాప్. మీరు వూరికే కూర్చుని ఉంటే, అప్పుడు కూడా మెదడు పని చేస్తుంది, మనస్సు కూడా పని చేస్తుంది. శరీర పనితీరు కొనసాగుతుంది. కాబట్టి మీరు మంచి పనిలో పాల్గొనకపోతే, అప్పుడు మీరు తప్పక చెడు పనిలో వినియోగింప బడతారు. మీరు మంచి పనులలో నియుక్తం కానప్పుడు మీరు నియుక్తమయివుంటే దానిలో... అక్కడ రెండు విషయాలు ఉన్నాయి మంచి లేదా చెడు.కాబట్టి వాటిలో ఒకదానిలో మనము నియుక్తమై ఉండాలి.

కాబట్టి మనం మంచి పనులను చేయమని సూచించబడకపోయినా లేదా శిక్షణ పొందకపోయినా, అప్పుడు మనం తప్పక దుర్మార్గపు పని చేస్తుంటాము. చెడు పని అంటే మాయ మరియు మంచి పని అంటే భగవంతుడు. రెండు విషయాలు ఉన్నాయి: భగవంతుడు మరియు మాయ. దైవిక పరిస్థితిలో మనం పనిచేయకపోతే, మనం మాయ యొక్క కోరలలో పని చేస్తుండాలి. ఇది చాలా సులభమైన శ్లోకము లో చైతన్య చరితామృతములో వివరించారు, haiyā māyāra dāsa, kari nāna abhilāṣa: "నేను మాయా సేవకునిగా అయిన వెంటనే, అప్పుడు నేను తత్వము మరియు విజ్ఞాన శాస్త్రము పేరుతో చాలా మూర్ఖత్వమును దుష్టత్వమును సృష్టిస్తాను. " ఇది జరుగుతోంది. తత్వము మరియు విజ్ఞానం అని పిలవబడేవి అంటే అంతా దుష్టత్వము మూర్ఖత్వము, చెడు పని. ఇది చాలా సవాలు చేసే పదం, కానీ ఇది సత్యము. మనము చేయకపోతే..., ఉదాహరణకు, అక్కడ చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది తత్వవేత్తలు మరియు చాలా మంది హిప్పీలు కూడా ఉన్నారు, LSD వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఇది జరిగింది? ఎందుకంటే మంచి నిమగ్నత లేదు. కొంతమంది శాస్త్రవేత్త మరియు తత్వవేత్త అనే పేరుతో గడుపుతున్నారు, వారిలో కొందరు హిప్పీలు, కానీ వీరందరూ చెడులో నియుక్తమై ఉన్నారు. అసత్. అసత్ మరియు సత్. సత్ అంటే శాశ్వతం, మరియు అసత్ తాత్కాలికంగా అని అర్థం.

కాబట్టి మన స్వరూప స్థితి ఏమిటి అని తెలుసుకోవాలి. అది మనకు తెలియదు. మనము సత్ నిత్యము శాశ్వతము అని ; అందువల్ల మనం ఎటువంటి మార్గంలో పనిచేస్తే నా శాశ్వత జీవితమునకు ప్రయోజనము చేకూరుతుందో ఆ విధముగా వ్యవహరించాలి. అది సత్. అందువలన వేదాలు ఆదేశించుతున్నాయి, అసతోమా సద్గమయః తాత్కాలిక కార్యక్రమాలలో నిమగ్నమవ్వవద్దు, శరీర... శరీర అవసరాలు అంటే తాత్కాలికమే. నేను చిన్నపిల్లవాడినైతే, నా శరీరం ఒక పిల్లల శరీరం, అప్పుడు నా అవసరాలు నా తండ్రి అవసరాలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి అందరూ శరీర అవసరాలలో నియుక్తమై ఉన్నారు. అందువల్ల దీనిని దేహవాన్ న హై అకర్మా-కృత్ అంటారు. కారణం గుణ సంగోస్తి. అంటురోగం దీని గురించి మాకు ఆచరణాత్మక అవగాహన ఉంది. మీ శరీరం కొంత వ్యాధి బారిన పడినట్లయితే, మీరు బాధపడతారు. మీ శరీరము ప్రభావితం కాకపోతే, ఏ విషపూరితమైనా వాటి వలన ప్రభావితం కాకుండా ఉంటే, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల దీనిని సంభవంతి హి భధ్రని విపరీతానీ చ అనఘః అంటారు. విపరీతాని. విపరీ అంటే వ్యతిరేకంగా ఉంటుంది. సంభవంతి భధ్రాని. విపరీతాని ఒకరు శుభము కలిగే విధముగా వ్యవహరిస్తున్నారు, ఒకరు వ్యవహరిస్తున్నారు విపరీతాని, కేవలం వ్యతిరేకంగా, అశుభము కలిగించే విధముగా. ఈ విధముగా మనం చిక్కుకుపోతున్నాము, జన్మ జన్మలకి