TE/Prabhupada 0790 - ఇతరుల భార్యతో ఎలా స్నేహాము చేయాలి, కుయుక్తుల ద్వారా ఇతరుల డబ్బును ఎలా తీసుకోవాలి



Lecture on SB 6.1.56-57 -- Bombay, August 14, 1975


విద్య అంటే మానవుడిగా అవ్వటము. చాణక్యుడు పండితుడు, ఆయన ఒక రాజకీయవేత్త అయినప్పటికీ, ఆయన కూడా, కానీ బ్రాహ్మణుడు, ఆయన విద్యావంతుడు అంటే ఎవరో కూడా చెప్పారు. పండిత. బ్రాహ్మణులను పండితుడు అని పిలుస్తారు. కాబట్టి పండితుడు అంటే సంకేతం ఏమిటి? ఆయన సారాంశము చెప్పారు:

mātṛ-vat para-dāreṣu
para-dravyeṣu loṣṭra-vat
ātma-vat sarva-bhūteṣu
yaḥ paśyati sa paṇḍitaḥ

పండితుడు అంటే మాతృవత్ పర దారేషు. స్త్రీలను అందరినీ తల్లిగా అంగీకరించటము, పర దారేషు. దార అంటే భార్య, పర అంటే ఇతరుల అని అర్థం. తన సొంత భార్యను తప్ప, ఆయన అందరు మహిళలను బయట వారిని, వారిని తల్లిలా భావించాలి అందువల్ల, హిందూ సమాజములో ఇప్పటికీ ప్రతి స్త్రీని ఒక తెలియని పురుషుడు, "తల్లి" అని సంభోదిస్తారు. ఒక వ్యక్తి తెలియకపోయినా ఇది పట్టింపు లేదు. ఆయన మరొక స్త్రీతో మాట్లాడవచ్చు, మొదట అతనిని సంభోదిస్తూ ఆమెను మొట్టమొదట, "తల్లి," మాతాజీ అని సంభోదిస్తారు. అప్పుడు ఎవరూ అవమానముగా తీసుకోరు. ఈ మర్యాద ఉంది. అది చాణక్య పండితుడు ద్వారా భోదించబడినది. మాతృవత్ పర దారేషు. స్త్రీని "తల్లి" అని పిలవాలి. para-dravyeṣu loṣṭra-vat: మరియు ఇతరుల ఆస్తిని వీధిలో కొన్ని గులకరాళ్ళు గా అంగీకరించబడాలి- ఎవరూ వాటిని పట్టించుకోరు. కొన్ని గులకరాళ్ళు, కొన్ని రాళ్ళు, వీధిలో పడివేస్తే, ఎవరూ వాటిని పట్టించుకోరు. చెత్త. కాబట్టి ఎవరూ ఇతరుల ఆస్తిని తాకకూడదు.

ఈ రోజుల్లో విద్య ఇతరుల భార్యతో ఎలా స్నేహాము చేయాలి, కుయుక్తుల ద్వారా ఇతరుల డబ్బును ఎలా తీసుకోవాలి. ఇది విద్య కాదు. విద్య ఇక్కడ ఉంది: mātṛ-vat para-dāreṣu para-dravyeṣu loṣṭra-vat, ātma-vat sarva-bhūteṣu. సర్వ భూతేషు: అన్ని జీవులలో... 84,00,000 వేర్వేరు జీవ జాతులు ఉన్నాయి. ఈ గడ్డి కూడా జీవి, బ్రహ్మ కూడా ఒక జీవి. కాబట్టి ఒక పండితుడు ప్రతి ఒక్కరినీ జీవి గా అంగీకరిస్తాడు, ఆయన వారితో వ్యవహరిస్తాడు, ఆత్మవత్: నేను బాధ మరియు ఆనందమును ఎలా అనుభవిస్తున్నానో, నేను అదే భావంతో ఇతరులతో వ్యవహరించాలి. అందువలన... ఆధునిక రోజులలో 'జాతీయత అంటే మానవుడు. కానీ నిజానికి జంతువులు, అవి కూడా జాతీయతలోనే ఉన్నాయి. జాతీయత అంటే అర్థం వారి నిర్వచనం ప్రకారం ఒకే దేశంలో జన్మించినవి. వేదముల సాహిత్యంలో "జాతీయ" పదం ఎప్పుడూ కనుగొనబడలేదు. ఇది ఆధునిక ఆవిష్కరణ. కాబట్టి ఇక్కడ, ఆత్మవత్ సర్వ భూతేషు. ఒక జాతీయత లేదా జాతీయత వెలుపల అనేది పట్టింపు లేదు. సర్వ భూతేషు. . ఇక్కడ కూడా ఉంది ... ఇది సర్వ భూత-సుహృత్ చెప్పబడింది. సుహృత్, స్నేహితుడు, శ్రేయోభిలాషి, సర్వ భూత. నా బంధువులు లేదా నా కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మాత్రమే నేను ఎందుకు ఆలోచించాలి? ఇది కృపణ, లోభి. ఒక విస్తృత-ఆలోచన గల బ్రాహ్మణుడు అందరికీ అందరికీ మంచి చేయడం కోసం నిమగ్నమై ఉండాలి.

అందువల్ల చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము, pṛthivīte āche yata nagarādi-grāma (CB Antya-khaṇḍa 4.126). చైతన్య మహాప్రభు ఎన్నడూ ఆజ్ఞాపించలేదు "మీ ప్రచారమును పరిమితం చేయండి మీ సమాజంలో లేదా మీ దేశంలోనే." ఆయన అడుగుతున్నాడు, pṛthīvite āche yata nagarādi-grāma: భూమిపైన ఉన్న అన్ని గ్రామాలు పట్టణాలలో... (పక్కన ) అది సరియైనది. కలత చెందవద్దు. Sarvatra pracāra haibe mora nāma. ఇది లక్ష్యము. ఇది వేదముల జ్ఞానం. సర్వ-భూత-సుహృత్