TE/Prabhupada 0797 - కృష్ణుడి తరపున ప్రచారము చేస్తున్నవారు కృష్ణ చైతన్యముని తీసుకోమని వారు గొప్ప సైనికులు



Arrival Address -- Vrndavana, September 3, 1976


ప్రభుపాద: వేదముల జ్ఞానం వెల్లడి అవుతుంది వేదముల జ్ఞానము లౌకిక పాండిత్యము అని పిలువబడే దాని ద్వారా,వ్యాకరణము నేర్చుకొనుట వలన అర్థము కాదు. కాదు వేదముల జ్ఞానం ఒక వ్యక్తి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎవరికైతే ప్రామాణికమైన గురువు మీద స్థిరమైన నమ్మకం ఉంటుందో. గురువు అంటే కృష్ణుడి ప్రతినిధి. కృష్ణుడు మరియు ఆయన ప్రతినిధి. గురువు అంటే కృష్ణుడి యొక్క ప్రామాణికమైన సేవకుడు అని పదేపదే మనము చర్చించాము. గురువు అంటే ఒక ఇంద్రజాలకుడు లేదా మాటల గారడి చేసే వాడు కాదు. ఇది గురువు కాదు. గురువు అంటే... శ్రీ చైతన్య మహాప్రభువుచే గురువుగా మారడం ఎలా? చాలా సులభము అని వివరించబడినది. ఆయన ప్రతి ఒక్కరినీ అడిగినారు, ప్రత్యేకించి భారతదేశంలో జన్మించిన వారిని, bhārata bhūmite manuṣya-janma haila yāra ( CC Adi 9.41) ముఖ్యంగా. ఎందుకంటే మనము భారతీయులము, భారతీయ, మనకు మొత్తం ప్రపంచానికి గురువుగా మారడానికి సౌకర్యము ఉన్నది. మనకు సదుపాయం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సాహిత్యాలు, వేదముల సాహిత్యములు ఉన్నాయి, ముఖ్యంగా భగవద్గీత, ఇది కృష్ణుడు చేతనే మాట్లాడబడింది. మనము జీవితం యొక్క లక్ష్యము ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తే, అప్పుడు మీరు గురువు అవుతారు. మనము ఇతరులను మోసం చేయాలని అనుకుంటే, యోగి, స్వామి, పండితుడు అని పిలవబడే వారిగా, అది మిమ్మల్ని గురువు చేయదు. గురువు... చైతన్య మహాప్రభు చెప్తారు. మీరు భారతీయులందరూ, గురువు అవ్వండి. Āmāra ājñāya guru hañā tāra ei deśa ( CC Madhya 7.128) నేను ఎక్కడ ఉన్నా. నేను ఎలా గురువు అవుతాను? యారే దేఖ తారే కహ కృష్ణ ఉపదేశ. అంతే.

కాబట్టి ఈ కృష్ణ చైతన్యము ఉద్యమం అంటే చైతన్య మహాప్రభు ఉపదేశమును అనుసరించడము. చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశము ఇది, కృష్ణ-ఉపదేశమును ప్రచారము చేయడము. ఇది కృష్ణుడి ఉపదేశము upadeśa: na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ ( BG 7.15) ఇది మనము తయారు చేసిన ఉపదేశాలు కాదు; ఇది కృష్ణుడి -ఉపదేశము ఆ "నాకు శరణాగతి పొందని వారు ఎవరైనా, దుష్కుృతిన అతను వెంటనే నాలుగు వర్గములలో వర్గీకరించబడినాడు." అవి ఏమిటి? Duṣkṛtina, mūḍhāḥ, narādhamāḥ, māyayāpahṛta-jñānā, āsuraṁ bhāvam āśritāḥ. ఇది చాలా సులభమైన విషయము. ఒక మూర్ఖుడు ఎవరు? ఒకరు కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఉంటే, కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోతే, ఆయన దుష్కుృతిన, అంటే పాపములు చేయువాడు అని అర్థం; మూఢా, మూర్ఖుడు; నరాధమా, మానవజాతిలో అత్యల్పుడు; మాయయాపహృత- జ్ఞాన , మరియు ఆయన యొక్క గొప్పగా పిలవబడే విద్య మరియు డిగ్రీలు పనికిరానివి ఎందుకంటే వాస్తవమైన జ్ఞానం ఆయన నుండి తీసివేయబడింది. మాయయాపహృత -జ్ఞాన. కాబట్టి పోరాటము చేయవలసిన అవసరము లేదు... కానీ సాధారణంగా ఈ వ్యక్తులు ఏమిటో మనము అర్థం చేసుకోవచ్చు. వారు ఈ నాలుగు వర్గములలోనే ఉన్నారు.

కావున మనం వారిని ఎదుర్కోవాలి. మన కృష్ణ చైతన్యము ఉద్యమము ఈ మూర్ఖులను ఎదుర్కొంటోంది, ఈ దుష్కుృతిన, ఈ నరాధములు, వారిని కృష్ణ చైతన్య వంతులు కమ్మని కోరండి. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము. మీరు ఒంటరిగా కూర్చోలేరు మీ గొప్పతనమును చూపించుకోవడానికి ఏకాంత ప్రదేశములో, హరిదాసా ఠాకురాను అనుకరించడము ద్వారా: హరే కృష్ణ, హరే కృష్ణ. కాదు మీరు ప్రచారము చేయాలి. అది చైతన్య మహా ప్రభు యొక్క ఆజ్ఞ. Āmāra ājñāya guru hañā tāra ei deśa ( CC Madhya 7.128) అది వాస్తవముగా చైతన్య మహాప్రభువును అనుసరించడము. హరిదాసా ఠాకురాని అనుకరించకూడదు. అది సాధ్యం కాదు. మీరు చెయ్యవచ్చు... మీరు చాలా చక్కగా చేయవచ్చు, అది మీ భద్రత కోసం. మీరు చక్కగా చేస్తున్నారని అనుకుందాం, కానీ అది మీ భద్రత కోసం. కానీ ఇతరుల ప్రయోజనము కొరకు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదురుకొంటున్న వ్యక్తి, వారు చాలా త్వరగా కృష్ణుడి చేత గుర్తించబడతారు.

na ca tasmān manuṣyeṣu
kaścin me priya-kṛttamaḥ
(BG 18.69)
ya idaṁ paramaṁ guhyaṁ
mad-bhakteṣv abhidhāsyati
(BG 18.68)


మీరు ఎదుర్కుంటే... ఉదాహరణకు పోరాటము చేస్తున్న సైనికుల వలె, వారు దేశం కొరకు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వారు గుర్తించబడుతున్నారు. అదేవిధముగా, ఎవరైతే ప్రచారము చేస్తారో-కృష్ణుడి తరపున, ప్రచారము చేస్తున్నవారు, ప్రజలకు, కృష్ణ చైతన్యముని తీసుకోమని, వారు గొప్ప సైనికులు.

ఐతే నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఐరోపావాసులు అమెరికన్లు, ముఖ్యంగా, మీరు నాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతి కొనసాగించండి, ఇది కృష్ణుడిచే గుర్తించబడటానికి చాలా సులభమైన మార్గం. ఆయన చెప్పినందున, na ca tasman manusyesu kaścin me priya-krttamaḥ ( BG 18.69) ఎవరు? ఈ కృష్ణ చైతన్యమును ప్రచారము చేస్తున్నారో. కాబట్టి మీరు ఇక్కడ వృందావనమునకు వచ్చినారు, చాలా కృతజ్ఞతలు, మీరు ప్రయాణిస్తున్నారు, మీరు ప్రచారము చేస్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యమును ప్రచారము చేయడానికి ఈ జీవితాన్ని అంకితం చేద్దాము. మనం ప్రచారము చేస్తూ చనిపోయినా పట్టించుకోవలసిన అవసరము లేదు. అయినప్పటికీ, అది చాలా కీర్తిని కలిగినది. చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ