TE/Prabhupada 0801 - సాంకేతిక అనేది ఒక బ్రాహ్మణుల,క్షత్రియుల, లేదా వైశ్యుల యొక్క కర్తవ్యము కాదు



Lecture on SB 1.7.16 -- Vrndavana, September 14, 1976


కావున ఇక్కడ,ఒక బ్రాహ్మ బంధు... అశ్వత్థామ ఒక బ్రాహ్మణ , ద్రోణాచార్య నుండి జన్మించాడు. కానీ ఆయన నిద్రిస్తున్నప్పుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులను అసహ్యముగా హత్య చేశాడు. కాబట్టి ఆయనను బ్రాహ్మణుడు అని ఎలా చెప్తాము, ఆయన ఒక క్షత్రియుడి కన్నా అసహ్యముగా ఉన్నాడు. ఎందుకంటే ఒక క్షత్రియుడి కూడా, ఎవరైనా ఒకరు నిద్రిస్తున్నప్పుడు చంపడు. ఒక క్షత్రియుడి సవాలు చేస్తాడు, ఆయనకి ఆయుధం ఇస్తాడు, పోరాటము చేస్తాడు, ఆపై వారిలో ఒకరు చంపబడతారు. అది... ఇక్కడ ఇది చెప్పబడినది brahma-bandhoḥ ātatāyinaḥ. Ātatāyinaḥ, దురాక్రమణదారు. ఒకరి భార్యను అపహరిస్తున్నా వారు ఎవరైనా దురాక్రమణదారుడు అని పిలుస్తారు. మీ ఇంటికి మంట పెట్టేవాడు, ఆయన దురాక్రమణదారుడు. మిమ్మల్ని ఆయుధాలతో చంపడానికి వస్తున్న వ్యక్తి, ఆయన దురాక్రమణదారు. ఈ విధముగా దురాక్రమణదారుల జాబితా ఉంది. కాబట్టి దురాక్రమణదారుడిని వెంటనే చంపవచ్చు. కొంత మంది దురాక్రమణదారునిగా ఉంటే, దురాక్రమణదారుని హతమార్చడములో పాపం లేదు. ఇంటికి మంట పెట్టె వాడు, విషాన్ని ఇచ్చేవాడు, ఘోరమైన ఆయుధాలతో అకస్మాత్తుగా దాడి చేసేవాడు శత్రువు. సంపదను కొల్లగొట్టడం లేదా వ్యవసాయ భూములను అక్రమించుకోవటము లేదా ఇతరుల భార్యను లోబర్చుకోవడము చేసేవారిని ఒక దురాక్రమణదారుడు అని పిలుస్తారు. ... ఇది అంతా వేదముల జ్ఞానం. ప్రతి దానికి ఒక నిర్వచనం ఉన్నది.

అందువల్ల ఈ అశ్వత్థామ ఒక దురాక్రమణదారుడు. అందువలన అర్జునుడు ఆయనని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అయినప్పటికీ ... సహజంగానే ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి యోగ్యత ద్వారా ఒక బ్రాహ్మణుడు అవుతాడు అని భావిస్తాము అది శిక్షణ. బ్రహ్మచారి ... సాధారణంగా బ్రాహ్మణ కుమారులు, క్షత్రియులు, ముఖ్యంగా ఈ రెండు విభాగాలు, వైశ్యుని వరకు, వారు బ్రహ్మచారులుగా శిక్షణ పొందారు. శూద్రులకు ఆసక్తి లేదు. అవకాశము ప్రతి ఒక్కరికీ తెరిచి ఉంటుంది, కానీ దిగువ తరగతి, బ్రాహ్మణులు, క్షత్రియులు కానీ వారు, బ్రహ్మచారిగా మారడానికి వారికి ఆసక్తి ఉండదు, లేదా వారి తల్లిదండ్రులకు ఆసక్తి లేదు. ఉదాహరణకు ఈ బ్రహ్మచారి పాఠశాలను లేదా ఆశ్రమమును ప్రారంభిస్తున్నాము, కానీ చాలామంది పిల్లలు చేరుతారు అనే దానిపై మేము సందేహిస్తున్నాము. ఈ యుగములో ప్రజలు శూద్రులు కావాలని ఆసక్తి కలిగి ఉన్నారు. ఎవరికి బ్రాహ్మణుడు కావాలని ఆసక్తి లేదు. సాంకేతిక. సాంకేతిక అంటే శూద్ర . సాంకేతిక అనేది ఒక బ్రాహ్మణుల,క్షత్రియుల, లేదా వైశ్యుల యొక్క కర్తవ్యము కాదు. కాదు ఉదాహరణకు కమ్మరి, బంగారము చేసేవాడు, వడ్రంగి, వృత్తి పనివాడు. ఈ సాంకేతికత. అవి శూద్రుల కోసం ఉద్దేశించినవి. బ్రాహ్మణులు, వారు నిజాయితీగా ఎలా ఉండాలి అనే దానిపై శిక్షణ తీసుకుంటారు, ఇంద్రియాలను నియంత్రించే వ్యక్తిగా ఎలా మారాలి, ఎలా సాధారణముగా ఉండాలి, సహనముగా ఎలా ఉండాలి. ఈ విధముగా. క్షత్రియుడు- ఎలా బలంగా, దృఢముగా, ధైర్యంగా ఉండాలి, సవాలు ఉన్నప్పుడు దూరంగా వెళ్ళడం కాదు, పోరాటము నుండి దూరంగా వెళ్ళి పోవటము కాదు, భూమిని కలిగి ఉండటము, పాలించడము īśvara-bhāvaś ca, దానము చేయుట. ఇవి క్షత్రియుని అర్హతలు. దానములు క్షత్రియునిచే ఇవ్వబడినవి ఈ దేశంలో మహమ్మదీయ పాలకులు చేసిన సందర్భాలున్నాయి, వారు కూడా వృందావనములో స్వచ్ఛందముగా, భూమి మరియు దేవాలయము ఇచ్చారు. అనేక సందర్భాలు ఉన్నాయి. ఔరంగజేబు కొంత భూమిని ఇచ్చాడు, జహంగీర్ కొంత భూమి ఇచ్చాడు. ఇప్పటికీ ఒక ఆలయం ఉంది, దీనిని జహంగీర్ నిర్మించారు, యమునకు ఆవలివైపు జహంగీర్-పురా అనే గ్రామం ఉంది. ఈ గ్రామ ఆలయం నిర్వహించడానికి బ్రాహ్మణులకు ఇవ్వబడింది. కాబట్టి దాతృత్వం, అది క్షత్రియుల యొక్క కర్తవ్యము, యజ్ఞములు చేయటము, దానము చేయుట, పోరాటము, సవాలు నుండి పారిపోవటము కాదు, చాలా బలంగా, ధృడముగా వుండేవారు - ఇవి క్షత్రియుని యోగ్యతలు. వైశ్యుని అర్హత - వ్యవసాయం. Kṛṣi. కృషి-గోరక్ష, ఆవు యొక్క రక్షణ. Kṛṣi-gorakṣya-vāṇijyam. అదనముగా ఉంటే, అప్పుడు vāṇijya, వాణిజ్యం. లేకపోతే వాణిజ్యం గురించి ప్రశ్నే లేదు. మరియు వైశ్య...మరియు శూద్రులు, paricaryātmakam ( BG 18.44) - కొంత వేతనమునకు పని చేయటము. ఈ కమ్మరి, బంగారము పని చేసేవాడు, వస్త్రము, నేతపనివాడు. మీరు ఆయన చేత కొంత పనిని చేయించుకొని ఆయనకి కొంత వేతనము చెల్లించాలి, ఆయనని చూసుకోవాలి. అది శూద్రుడు. కాబట్టి శాస్త్రములో అది చెప్పబడింది, kalau śūdra-sambhavaḥ. కలి-యుగములో దాదాపు ప్రతి ఒక్కరూ ఒక శుద్రుడు. వారు సేవలను చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు అని మీరు కనుగొంటారు. ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన వారు కూడా, ఆయన ఏదో ఒక మంచి ఉద్యోగం కోసము చూస్తున్నాడు. అంటే శూద్రుని మనస్తత్వం. అది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము కాదు. బ్రాహ్మణుడు ఎవరి దగ్గర పని చేయడానికి అంగీకరించడు, క్షత్రియులు కూడా, వైశ్యులు కూడా. కేవలం శూద్రులు మాత్రమే