TE/Prabhupada 0803 - నా ప్రభు, దయచేసి నీ సేవలో నన్ను నిమగ్నము చేయండి. అది జీవిత పరిపూర్ణము



Lecture on SB 1.7.19 -- Vrndavana, September 16, 1976


హరే కృష్ణ అంటే దేవాదిదేవుడు మరియు ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి. కావున మనం చెప్తాము: హరే, "ఓ శక్తి, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి, మరియు కృష్ణా, "ఓ దేవాదిదేవుడా." హరే రామా, అదే విషయము. పరబ్రహ్మణ్ . రామా అంటే పరబ్రహ్మణ్, కృష్ణ అంటే పరబ్రహ్మణ్... అందువల్ల ఆయనను ఉద్దేశించి చెప్పడము అంటే అర్థం ఏమిటి, "హే కృష్ణా, హే రాధే, హే రామా, హే..." ఎందుకు? ఎవరో ఉండాలి... ఎందుకు అడుగుతున్నావు? అది "కేవలము మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి."

ఇది శ్రీ చైతన్య మహాప్రభుచే ప్రచారము చేయబడింది:

ayi nanda-tanuja kiṅkaraṁ
patitaṁ māṁ viṣame bhavāmbudhau
kṛpayā tava pāda-paṅkaja-
sthita-dhūlī-sadṛśaṁ vicintaya
(CC Antya 20.32, Śikṣāṣṭaka 5)

ఇది మన ప్రార్థన. "ఓ కృష్ణా, ఓ రామ, నాకు కొంత డబ్బు ఇవ్వండి, నాకు ఎవరో ఒక స్త్రీని ఇవ్వండి." మన ప్రార్థన ఇది కాదు, లేదు. ఇది ప్రార్థన కాదు. అయితే, ప్రారంభ దశలో వారు అలా ప్రార్థన చేయవచ్చు, కానీ అది కాదు, నా ఉద్దేశ్యం,

శుద్ధ- భక్తి, అంటే స్వచ్చమైన భక్తి. పవిత్ర భక్తి, అంటే భగవంతునికి ప్రార్థనలను చేయడము ఏదైనా సేవ కోసము ప్రార్థిస్తూ, నా ప్రభు, దయచేసి నీ సేవలో నన్ను నిమగ్నము చేయండి. అది జీవిత పరిపూర్ణము, భగవంతుని ప్రేమలో ఒకరు వినియోగించబడినప్పుడు. మీరు చాలా గొప్ప సాధువు అయి, ఏకాంత ప్రదేశంలో నివసిస్తారు మీరు చాలా గొప్ప వ్యక్తి అయ్యారు అని మీరు గర్విస్తారు , ప్రజలు ఆయనని చూడడానికి రావచ్చు, "ఆయన కనబడడు, ఆయన జపము చేస్తున్నాడు ." నా గురు మహారాజు దీనిని ఖండించారు. ఆయన చెప్పారు mana tumi kisera vaiṣṇava. నా ప్రియమైన మనస్సా, నీ మానసిక కల్పనల వలన, నీవు చాలా గొప్ప వైష్ణవుడివి అయ్యవని నీవు ఆలోచిస్తున్నావు. నీవు ఏమీ చేయడము లేదు, ఏకాంత ప్రదేశంలో కూర్చోని హరిదాస ఠాకురాను అనుకరిస్తున్నావు, జపము చేస్తూ. కావున నీవు ఒక అర్థంలేని వాడివి. " Mana tumi kisera vaiṣṇava ఎందుకు? Nirjanera ghare, pratiṣṭhāra tare: గొప్పగా జపము చేస్తున్నానని కొంత చౌకైన గౌరవమును పొందేందుకు. ఎందుకంటే ఎవరైనా నిజానికి జపము చేస్తూ ఉంటే, ఎందుకు ఆయన స్త్రీ మరియు బీడికి ఆకర్షించబడాలి? ఆయన నిజానికి హరిదాస ఠాకురా లాంటి స్థితిలో ఉంటే, అప్పుడు ఎందుకు ఆయన భౌతిక విషయాల పట్ల ఆకర్షణ కలిగి ఉండాలి? ఇది ఒక తప్పుడు ప్రదర్శన మాత్రమే. ఇది సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు.

అందువలన సాధారణ వ్యక్తి భౌతికంగా నిమగ్నమవ్వాలి. ఇది భౌతిక విషయము కాదు; అది కూడా ఆధ్యాత్మికము. కృష్ణ చైతన్యములో ఏదైనా పనిలో ఎల్లప్పుడూ తీరిక లేకుండా ఉండటము. అది కావలసినది. అంతే కాని ఓ, నేను ఒక గొప్ప విద్వాంసుడిని ఆయ్యాను, ఇప్పుడు గొప్ప వైష్ణవుడిని ఎలా కావాలో నేను నేర్చుకున్నాను. నేను అరవై నాలుగు మాలలు జపము చేస్తాను, ఎక్కడో ఉన్న నా భార్య గురించి ఆలోచిస్తాను తరువాత గోవిందజీకి సెలవు చెప్పి, వృందావనమును విడిచిపెడతాను." ఈ మూర్ఖత్వమును అనుసరించ వద్దు. గోవిందజీ అటువంటి మూర్ఖులను వృందావనము నుండి తరిమేస్తాడు. కాబట్టి వృందావన, వృందావనములో నివసిస్తున్న వ్యక్తి ఎవరైనా, ఆయన వృందావణ-చంద్రుని యొక్క మహిమలను ప్రపంచం అంతటా ఎలా విస్తరించాలో అని చాలా ఆత్రుత కలిగి ఉండాలి. అది కావలసినది. అంతే కాని "వృందావణ-చంద్రుడు నా వ్యక్తిగత ఆస్తి, నేను ఒక ప్రదేశములో కూర్చుని, ఆనందిస్తూ ఉంటాను." లేదు, అది కాదు కావలసినది. అది కావాల్సిన అవసరం లేదు. ఇది నా గురు మహారాజచే ఖండించబడింది