TE/Prabhupada 0807 - బ్రహ్మాస్త్రాన్ని మంత్రంతో తయారు చేస్తారు. అది సూక్ష్మ మార్గం



Lecture on SB 1.7.26 -- Vrndavana, September 23, 1976


మనము బ్రహ్మాస్త్రం గురించి చర్చించాము. ఇది ఆధునిక అణు ఆయుధం లేదా బాంబును దాదాపు పోలి ఉంటుంది, కానీ... ఇది రసాయనాలతో చేయబడుతుంది, కానీ ఈ బ్రహ్మాస్త్రాన్ని మంత్రంతో తయారు చేస్తారు. అది సూక్ష్మ మార్గం. ఆధునిక శాస్త్రం నిగూఢమైన అతి సూక్ష్మమైన స్తితికి చేరుకోలేదు. అందువల్ల వారు ఆత్మ ఒక దేహాన్ని వదలి మరొక దేహానికి పోవుట ఎలా జరుగుతుందో అర్థం చేసుకోలేరు. ఆధునిక శాస్త్రమునకు అవగాహన లేదు. అపరిపక్వ జ్ఞానం. వారు స్థూల శరీరం చూస్తారు, కానీ వారికి సూక్ష్మ శరీరం గురించి ఎటువంటి జ్ఞానం అవగాహన లేదు. కానీ సూక్ష్మ శరీరం ఉంది. ఉదాహరణకు మనము మీ మనస్సుని చూడలేము, మీరు మనసుని కలిగి ఉన్నారని నాకు తెలుసు. మీరు నా మనస్సును చూడలేరు, కానీ నేను మనసు కలిగి ఉన్నానని మీకు తెలుసు. మనస్సు, బుద్ధి అహంకారం. నా తలంపు, గుర్తింపు, "నేను," అనే తలంపు ఉంది. అది అహంకారం. నా బుద్ధి మరియు నా మనస్సు, మీరు చూడలేరు, నేను చూడలేను. కాబట్టి మనస్సు, బుద్ధి వ్యక్తిగత గుర్తింపు, లేదా అహంకారముల ద్వారా ఆత్మ ఇతర శరీరానికి చేరవేస్తుంది, వారు దానిని చూడరు. వారు దానిని చూడలేరు. వారు చూస్తున్నారు స్థూల శరీరం నిలిపివేయబడింది, ప్రతిదీ నిలిపివేయబడుతుంది. స్థూల శరీరం బూడిదగా కాల్చబడుతుంది; కాబట్టి వారు ప్రతిదీ పూర్తయిందని వారు భావిస్తారు. Bhasmī-bhūtasya dehasya kutaḥ punar āgamano bhaved (చార్వాక ముని). నాస్తికుల వర్గం, వారు అలా అనుకుంటారు. జ్ఞానం లేకపోవడము వలన, వారు భావిస్తారు నేను ఇప్పుడు శరీరం కాలిపోయి బూడిద లోకి మారినది చూస్తున్నాను. అప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? కాబట్టి "ఆత్మ లేదు, భగవంతుడు లేదు, ఇవన్నీ కల్పన." కానీ అది వాస్తవం కాదు; అది సత్యము కాదు. నిజానికి, ఆ స్థూల శరీరం పూర్తి అయినప్పటికీ, సూక్ష్మ శరీరం ఉంది. Mano buddhir ahaṅkāraḥ. Bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir eva ca ( BG 7.4) Apareyam itas tu viddhi me prakṛtiṁ parām. కాబట్టి సూక్ష్మమైన విషయం యొక్క కర్మ ప్రతిక్రియ, సూక్ష్మమైన భౌతిక పదార్థం... మనస్సు కూడా భౌతిక పదార్థం, కానీ సూక్ష్మమైన భౌతిక పదార్థం, చాలా సూక్ష్మమైనది. ఉదాహరణకు ఆకాశం, ఆకాశం వలె. ఆకాశం కూడా భౌతిక పదార్థం, కానీ చాలా సూక్ష్మంగా ఉంది, సూక్ష్మమైనది. ఆకాశం కంటే సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి. బుద్ధి కంటే సూక్ష్మమైనది నా అహంకారం: "నేను," అనే ఈ భావన.

కాబట్టి వారికి జ్ఞానం లేదు. అందువలన ... వారు ఆయుధాలను లేదా బాంబులను స్థూల వస్తువులతో తయారు చేయగలరు. భూమిరాపో 'నలో - రసాయనాలు, అది స్థూలంగా ఉంటుంది. కానీ ఈ బ్రహ్మాస్త్రం స్థూలమైనది కాదు. ఇది కూడా భౌతికం, కానీ అది సూక్ష్మ విషయాల ద్వారా తయారౌతుంది: మనస్సు, బుద్ధి అహంకారం. అందువల్ల అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు, "అది ఎక్కడ నుండి వస్తున్నదో నాకు తెలియదు, అటువంటి అధిక ఉష్ణోగ్రత ఎక్కడ నుండి వస్తుంది." ఇది ఇక్కడ చెప్పబడింది, తేజః పరమ-దారుణం. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నది, భరించలేనిది. కాబట్టి మనము ప్రామాణికమును అడుగుతాము. కృష్ణుడు ఉత్తమ ప్రామాణికం. కాబట్టి అర్జునుడు ఆయన నుండి అడుగుతున్నాడు, kim idaṁ svit kuto veti: నా ప్రియమైన కృష్ణా, ఈ ఉష్ణోగ్రత ఎక్కడ నుండి వస్తున్నది? కిమ్ ఇదం. దేవ-దేవ. ఎందుకు ఆయన కృష్ణుని అడుగుతున్నాడు? ఎందుకంటే కృష్ణుడు దేవదేవుడు