TE/Prabhupada 0814 - భగవంతుడు ఏమీ చేయనవసరం లేదు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆయనకు ఎటువంటి ఆశ లేదు



741012 - Lecture SB 01.08.32 - Mayapur


నితాయ్: "కొందరు చెప్తారు జన్మించని వారు జన్మించారు పుణ్య రాజులను స్తుతించుటకు, ఇతరులు మీ ప్రియ భక్తులలో ఒకడైన యదురాజును సంతోషింప చేయడానికి జన్మించినట్లు చెప్తారు. మలయ పర్వతములలో గంధపు చెట్టు కనిపించినట్లు మీరు ఆయన కుటుంబంలో అవతరిస్తారు. "

ప్రభుపాద:

kecid āhur ajaṁ jātaṁ
puṇya-ślokasya kīrtaye
yadoḥ priyasyānvavāye
malayasyeva candanam
(SB 1.8.32)

కాబట్టి కృష్ణుడికి చేయడానికి ఏమీ లేదు. ఆయన మహోన్నతమైన వాడు. ఎందుకు ఆయనకు చేయాటానికి ఏమైనా ఉంటుంది? Na tasya kāryaṁ karaṇam. ఇది వేదాలలో నిర్వచనం: భగవంతుడు ఏమీ చేయనవసరం లేదు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆయనకు ఎటువంటి ఆశ లేదు. ఉదాహరణకు మనము ఈ భూమిని ఆ భూమిని కొనుగోలు చేయాలని మనము ఆలోచిస్తున్నట్లుగా. ఎందుకంటె కృష్ణుడు అలా భావిస్తాడా? ఎందుకంటే ప్రతి భూమి ఆయనకు చెందుతుంది. అందువలన ఆయనకు కొనుగోలు చేయడానికి ఏమీ లేదు. అంతా ఉంది. కావున ఎందుకు ఆయన వస్తాడు? అదే విధముగా, కృష్ణుడు వ్యక్తిగతంగా చెప్పారు. ఆయన paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām ( BG 4.8) కొరకు వస్తాడు. భక్తులకు రక్షణ కల్పించాలని, భక్తులను కీర్తించాలని ఆయన కోరుకుంటాడు. అది ఆయన కర్తవ్యము. లేకపోతే ఆయనకు ఏ పని లేదు. ఆయనకు చేయడానికి ఏమీ లేదు. ఉదాహరణకు ఒక భక్తునికి కృష్ణుడికి సేవ చేయడమే కాకుండా, కృష్ణుడికి సంతోషం కలిగించడము తప్ప వేరే పని లేదు, అదేవిధముగా, కృష్ణునికి చేయడానికి ఏమీ లేదు, కానీ ఆయన తన భక్తుడిని కీర్తించాలని ఆయన కోరుకుంటారు. ఇది పరస్పరము ఇచ్చిపుచ్చుకొనుట. Ye yathā māṁ prapadyante ( BG 4.8) మీరు అయితే... భగవంతుని కీర్తించడానికి మీ జీవితాన్ని అంకితం చేస్తే, భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన కర్తవ్యము మిమ్మల్ని కీర్తించడము. లేకపోతే, ఆయనకి వేరే పని లేదు.

అందువల్ల ఇక్కడ చెప్పబడినది priyasya, yadoḥ priyasya. కృష్ణుడికి యదురాజు సేవ చేయడము ద్వారా ఎంతో ప్రియమైనవాడు అయినాడు. ప్రియస్య.... కృష్ణుడు భక్తునికి చాలా ప్రియమైనవాడు అయినట్లుగా, అదేవిధముగా, భక్తులు కూడా కృష్ణుడికి చాలా చాలా ప్రియమైనవారు. మరొక శ్లోకము ఉంది, sva-pāda-mūlaṁ bhajataḥ priyasya. Sva-pāda-mūlaṁ bhajataḥ priyasya: "ఒకరు కృష్ణుడు యొక్క కమల పాదముల దగ్గర నిమగ్నమై ఉంటే, ఆయన చాలా చాలా ప్రియమైనవాడు అవుతాడు. " Sva-pāda-mūlaṁ bhajataḥ priyasya. భజతాః, కేవలం ఒకరు సేవ కోసం నిమగ్నమై ఉన్నవారు కృష్ణుడి యొక్క కమల పాదాలకు ఆయనకు ఏ ఇతర పని లేదు - ఆయన ప్రియము అవుతాడు. మీరు ప్రియముగా లేదా కృష్ణుడికి ప్రియమయిన వెంటనే, మీ అన్ని సమస్యలూ పరిష్కరించబడతాయి. మీరు చాలా గొప్ప, ధనవంతునికి, ప్రియమైన బిడ్డ అయినట్లయితే, మీకు సమస్య ఎక్కడ ఉంది? సహజముగా ఆయన జాగ్రత్త తీసుకోబడతాడు. ఎందుకంటే ఆయన గొప్ప మనిషికి ప్రియమైన బిడ్డ అయినాడు, కాబట్టి ఆయన సమస్య ఏమిటి? ఏ సమస్య లేదు. అదేవిధముగా, మనము కృష్ణుడికి చాలా ప్రియమవ్వాలి. అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

ఈ మూర్ఖులు, కర్మిలు, వారికి తెలియదు. వారు తమ ప్రయత్నం ద్వారా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అది కర్మి అని పిలువబడుతుంది. వారు చాలా కష్టపడి పని చేస్తున్నారు- అదే విషయము-చాలా ఆనందంగా ఉండటానికి, భక్తుడు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అందరూ ప్రయత్నిస్తున్నారు. Sukham ātyantikaṁ yat tad atīndriya-grāhyam BG 6.21. సంతోషంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే సంతోషంగా ఉండటము,మన సహజ ధోరణి. Ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). అందరూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కర్మిలు, జ్ఞానులు, యోగులు, వారు సంపూర్ణంగా ఎలా సంతోషంగా ఉండాలో వారికి తెలియదు. వారు తమ సొంత ప్రయత్నాలను చేస్తున్నారు. కర్మిలు డబ్బు సంపాదించడానికి చాలా కష్ట పడుతున్నారు, పగలు మరియు రాత్రి పని చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక్క మార్గము ద్వార, నలుపా లేదా తెలుపా అని పట్టించుకోవడము లేదు. డబ్బు తెచ్చుకోవడము. నేను చక్కని కారు, చక్కని ఇల్లు, చక్కని బ్యాంకు బ్యాలన్స్ కలిగి ఉండాలి. " ఇది కర్మి అంటే. మరియు జ్ఞాని అంటే, ఆయన పని చేయడముతో విసుగు చెందినప్పుడు, ఆయన అర్థం చేసుకున్నప్పుడు "ఈ కష్టపడి పని చేసి బ్యాంకు బ్యాలన్స్ కలిగి ఉన్నప్పటికీ ఇది నన్ను సంతోష పెట్టడము లేదు, కాబట్టి ఇది మిథ్య , ఈ కార్యక్రమాలు అన్ని, ఏమైతే నేను చేస్తున్నానో... " బ్రహ్మ సత్యమ్ జగమ్ మిథ్య. అందువల్ల వారు విసుగు చెంది, బ్రహ్మ... బ్రహ్మ సత్యంకు వెళ్ళుతారు