TE/Prabhupada 0819 - ఆశ్రమము అంటే ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకునే స్థితి అని అర్థం



Lecture on SB 2.1.2-5 -- Montreal, October 23, 1968


ప్రభుపాద:

śrotavyādīni rājendra
nṛṇāṁ santi sahasraśaḥ
apaśyatām ātma-tattvaṁ
gṛheṣu gṛha-medhinām
(SB 2.1.2)

అదే విషయము,ఎవరైతే చాలా ఎక్కువగా అనుబంధము కలిగి ఉంటారో కుటుంబ వ్యవహారాలలో, గృహేషు గృహమేధినామ్. గృహమేధి అంటే ఇంటిని తన పని కేంద్రంగా చేసుకున్న వ్యక్తి. ఆయనను గృహమేధి అని పిలుస్తారు. రెండు పదాలు ఉన్నాయి. ఒక పదం గృహస్థ, మరొక పదం గృహమేధీ. ఈ రెండు పదాల ప్రాముఖ్యత ఏమిటి? గృహస్థ అంటే ఒకరు... గృహస్థ మాత్రమే కాదు. దీనిని గృహస్థ-ఆశ్రమముగా పిలుస్తారు. మనము ఆశ్రమము గురించి మాట్లాడినప్పుడల్లా అది ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి అన్ని నాలుగు సామాజిక ఆశ్రమములు బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థ-ఆశ్రమము, వానప్రస్థ-ఆశ్రమము, సన్యాస-ఆశ్రమము. ఆశ్రమము. ఆశ్రమము అంటే... ఎప్పుడైనా, ఈ పదం, మీ దేశంలో కూడా చాలా ప్రజాదరణ పొందింది. ఆశ్రమము అంటే ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకునే స్థితి అని అర్థం. సాధారణంగా, మనము అర్థం చేసుకుంటాము. ఇక్కడ కూడా, చాలా యోగ-ఆశ్రమములు ఉన్నాయి. నేను న్యూయార్క్లో కూడా చాలా ఆశ్రమాలను చూసాను. న్యూయార్క్ యోగ ఆశ్రమము, "యోగ సమాజము," ఆ విధముగా ఆశ్రమము అంటే ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంటుంది. ఇది పట్టింపు లేదు ఒక వ్యక్తి... గృహస్థ అంటే కుటుంబం, భార్య పిల్లలతో నివసించే వారు అని అర్థం.

కాబట్టి కుటుంబంతో పిల్లలతో ఉండటము ఆధ్యాత్మిక పురోగతికి అనర్హత కాదు. ఇది అనర్హత కాదు ఎందుకంటే ఏమైనప్పటికీ, ఒక తండ్రి మరియు తల్లి నుండి మనము జన్మ తీసుకోవాలని ఉంటుంది. అందువల్ల, గొప్ప ఆచార్యులు, గొప్ప ఆధ్యాత్మిక నాయకులు, ఏమైనప్పటికీ, వారు తండ్రి మరియు తల్లి నుండి వచ్చారు. కాబట్టి తండ్రి మరియు తల్లి కలయిక లేకుండా, ఒక గొప్ప వ్యక్తికి జన్మనివ్వటానికి అవకాశం లేదు. శంకరాచార్య, జీసస్ క్రైస్ట్, రామానుజాచార్య వలె గొప్ప వ్యక్తులు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వారు చాలా గొప్ప కుటుంబము చరిత్ర కలిగిన వారు కాదు, ఇప్పటికీ, వారు గృహస్థుల నుండి, తండ్రి మరియు తల్లి నుండి వస్తారు. కాబట్టి గృహస్థ, లేదా గృహస్థ జీవితం అనర్హత కాదు. మనము దాని గురించి ఆలోచించకూడదు, కేవలము బ్రహ్మచారులు లేదా సన్యాసులు మాత్రమే, వారు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగగలరు, ఎవరైతే భార్య పిల్లలతో జీవిస్తున్నారో వారు, వారు ఎదగలేరు. కాదు చైతన్య మహా ప్రభు స్పష్టంగా చైతన్య-చరితామృతంలో పేర్కొన్నారు

kibā vipra, kibā nyāsī, śūdra kene naya
yei kṛṣṇa-tattva-vettā sei 'guru' haya
(CC Madhya 8.128)

చైతన్య మహా ప్రభు చెప్పినారు, "ఒక వ్యక్తి గృహస్థుడా కాదా అని పట్టింపు లేదు, లేదా ఒక సన్యాసా లేదా ఒక బ్రాహ్మణుడా లేదా బ్రాహ్మణుడు కాదా. ఇది పట్టింపు లేదు. కేవలము కృష్ణ చైతన్య జ్ఞానం ఉన్నట్లయితే, ఆయన కృష్ణ చైతన్యంలో ఎదిగినట్లతే, అప్పుడు ఆయన కేవలం, నేను చెప్పిది ఏమిటంటే, ఆధ్యాత్మిక గురువు అవ్వటానికి అర్హత కలిగి ఉంటాడు. " Yei kṛṣṇa-tattva-vettā sei guru haya ( CC Madhya 8.128) తత్వవేత్త అంటే కృష్ణుడి శాస్త్రం గురించి తెలిసిన వ్యక్తి. అంటే పూర్తిగా కృష్ణ చైతన్యము. సేయ్ గురు హయ. సేయ్ అంటే "ఆయన." గురువు అంటే "ఆధ్యాత్మిక గురువు" అని అర్థం. ఆయన చెప్పలేదు "ఒక సన్యాసి లేదా బ్రహ్మచారి అవ్వవలసి ఉంటుంది, అప్పుడు ఆయన..." చెప్పలేదు. అయితే, ఇక్కడ పదము ఉపయోగించబడినది, గృహమేధి, గృహస్థ కాదు. గృహస్థుడిని ఖండించలేదు. ఒకరు భార్య మరియు పిల్లలతో క్రమబద్ధమైన సూత్రములతో జీవిస్తే, దానికి అనర్హత లేదు. అయితే గృహమేధి, గృహమేధి అంటే అతడికి ఉన్నతమైన ఆలోచనలు లేదా ఆధ్యాత్మిక జీవితము యొక్క అవగాహన కలిగి లేడు. కేవలం పిల్లులు మరియు కుక్కల వలె భార్యతో, పిల్లలతో నివసిస్తూ ఉంటాడు, ఆయనను గృహమేధీ అని పిలుస్తారు. ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసము అది, గృహమేధి మరియు గృహస్థుని మధ్య తేడా