TE/Prabhupada 0829 - నాలుగు గోడలు మీరు చెప్పేది వింటాయి. అది చాలు.నిరాశ చెందవద్దు



The Nectar of Devotion -- Vrndavana, November 7, 1972


ప్రద్యుమ్న: "శ్రీల రూపగోస్వామి పవిత్రతకు ఒక నిర్వచనం ఇచ్చారు. అతడు చెప్పాడు వాస్తవంగా పవిత్రత అంటే ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలని చెప్పాడు.

ప్రభుపాద: అవును. ఈ కృష్ణచైతన్య ఉద్యమము లాగానే: ఇది ప్రపంచ ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు. ఇది ఒక వర్గపు ఉద్యమం కాదు, ఇది మానవాళికి మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, చెట్లు అందరికీ కూడా. ఈ చర్చ హరిదాస ఠాకూర చైతన్య మహాప్రభువు మధ్య జరిగింది. ఆ ప్రకటనలో, హరిదాస ఠాకూర ధృవపరిచారు హరేకృష్ణ మహామంత్రము బిగ్గరగా కీర్తించడము వలన చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ ప్రయోజనం పొందుతాయి. ఇది నామాచార్య హరిదాస ఠాకూర యొక్క ప్రకటన. కాబట్టి మనం హరేకృష్ణ మహామంత్రం బిగ్గరగా కీర్తన చేస్తున్నప్పుడు, అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మెల్బోర్న్ ఉన్నత న్యాయస్థానంలో ఈ ప్రకటన ఉంచారు. కోర్టు ఇలా ప్రశ్నించింది, "ఎందుకు మీరు వీధిలో బిగ్గరగా హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తూన్నారు?" మేము జవాబు ఇచ్చాము "జనులందరి ప్రయోజనము కొరకు" వాస్తవమునకు ఇది నిజం. అయినా, ఇప్పుడు ప్రభుత్వము నుంచి ఎటువంటి ఫిర్యాదు లేదు. మేము వీధుల్లో చాలా స్వేచ్ఛగా కీర్తన చేస్తూన్నాము. అది ప్రయోజనము. మనం హరేకృష్ణ మహా మంత్రం కీర్తన చేసినట్లయితే, అది మానవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. నా గురు మహారాజు చెప్పేవారు, ఇలా ఎవరైనా ఫిర్యాదు చేస్తే "మనం వెళ్లి కీర్తన చేస్తాము, కానీ సమావేశానికి ఎవరూ హాజరు కారు", అందుకు గురు మహారాజు ప్రత్యుత్తరం ఇచ్చేవారు, "ఎందుకు? నాలుగు గోడలు మీరు చెప్పేది వింటాయి. అది చాలు. నిరాశ చెందవద్దు. కీర్తన చేస్తూ ఉండండి. నాలుగు గోడలు ఉంటే అవి వింటాయి. అంతే. కాబట్టి కీర్తన ఎంత ఉపయోగకరము అంటే జంతువులు, పక్షులు, కీటకాలు, ప్రతి ఒక్కరికీ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కొనసాగించండి. ఇది ఉత్తమ సంక్షేమ కార్యక్రమము. మానవ సమాజంలో కొన్ని సమాజానికి లేదా దేశానికి లేదా వర్గానికి లేదా మానవులకు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఈ సంక్షేమ కార్యక్రమం మానవ సమాజానికి మాత్రమే కాదు పక్షులకు, జంతువులకు, వృక్షానికి, జంతువుకు, ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమైనవి. ఇది అత్యుత్తమమైనది, ప్రపంచంలో ఉత్తమ సంక్షేమ కార్యక్రమం, కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చెయ్యండి