TE/Prabhupada 0839 - పిల్లలుగా ఉన్నప్పుడు మనము కలుషితం కాలేదు మనము భాగవత-ధర్మములో శిక్షణ పొంది యుండాలి



751203 - Lecture SB 07.06.02 - Vrndavana


ప్రభుపాద: కాబట్టి ఏకత్వం అనే ప్రశ్నే లేదు. ఈ ఏకత్వం తప్పు. ప్రత్యేక ఉనికి ఉండాలి. అప్పుడు సంతృప్తి ఉంటుంది. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని ప్రేమిస్తాడు, ఆ స్నేహితుడు తిరిగి ప్రేమ చూపుతాడు. ఇది సంతృప్తి అంటే, అంతే కానీ "నీవు నా స్నేహితుడు, నేను నీ స్నేహితుడను, మనము ఒక్కరిగా అవుదాము." అని కాదు అది సాధ్యం కాదు, అది సంతృప్తి కాదు. ఎవరైతే మాయవాదులో వారు భగవంతునితో ఒకటవుదము అని అనుకుంటారు వారికి వాస్తవమునకు సంతృప్తి అంటే ఏమిటో తెలియదు. కృత్రిమంగా వారు ఒకటి కావాలని ప్రయత్నిస్తారు. ఇది సంతృప్తి కాదు. Ye 'nye 'ravindākṣa vimukta-māninas tvayy asta-bhāvād aviśuddha-buddhayaḥ ( SB 10.2.32) మాయవాదులు ఆలోచిస్తారు "ఇప్పుడు నేను బ్రహ్మణ్ ను గ్రహించాను, నేను బ్రహ్మణ్, ఆత్మ ను. కావున నేను ఈ శరీరం పూర్తయిన వెంటనే భగవంతునితో ఏకమవుతాను." Gatākāśa potakāśa, ఇది చెప్పబడింది. కానీ ఇది నిజమైన సంతృప్తి కాదు. Ye 'nye 'ravindākṣa vimukta-māninaḥ. వారు ఆలోచిస్తారు "నేను ఇప్పుడు విముక్తి పొందాను, నేను భగవంతునితో ఒకటి అయ్యాను" నిజానికి ఆయన కృత్రిమముగా ఆలోచిస్తున్నాడు. Ye 'nye 'ravindākṣa vimukta-māninas tvayy asta-bhāvād aviśuddha-buddhayaḥ. ఎందుకంటే వారికి పూర్తిగా సంతృప్తి చెందడానికి సరైన సమాచారం లేదు కాబట్టి, అందువల్ల వారు అవిశుద్ధ- బుద్ధయాః. వారి బుద్ధి ఇంకా పవిత్రము కాలేదు. ఇది అపవిత్రమైనది, మళ్లీ భౌతికము. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adho anādṛta-yuṣmad-aṅghrayaḥ ( SB 10.2.32)

అందువల్ల మీరు మాయావాది సన్యాసులను చూస్తారు, వారు తిరిగి మానవులకు సేవ చేయడము కొరకు వస్తారు, జంతువులకు సేవ చేయడానికి, వీటికి, వాటికి సేవ చేయడానికి, దేశమునకు, సమాజమునకు. ఇది మాయవాద అంటే. అవిశుద్ధ- బుద్ధయాః. ఆయన సేవకునిగా ఉన్నతమైన పదవులలో ఉండలేకపోయాడు. సేవ చేయడానికి భగవంతుడు సేవ చేయబడుతున్నాడు. మనము సేవకులము. కానీ మనము ఆ పరిస్థితిని చేరుకోలేకపోయాము, అందువలన... నా పరిస్థితి సేవ చేయడము. నేను కృష్ణుడికి సేవ చేయటానికి ఇష్టపడలేదు. నేను ఆయనతో ఒకటి కావాలి అని అనుకున్నాను. అందువలన నా పరిస్థితి స్పష్టంగా లేదు. అందువల్ల, కృష్ణుడికి సేవ చేయడానికి బదులుగా, నేను తిరిగి మానవులకు సేవ చేయడానికి తిరిగి వచ్చాను, సమాజమునకు, దేశమునకు, మరియు ఇంకా ఇంకా... సేవను తిరస్కరించలేము. కానీ అవిశుద్ధ- బుద్ధయాః కనుక, సరిగా శిక్షణ తీసుకోలేదు,అతడు అపవిత్రమైన స్థితిలో ఉన్నాడు, కృష్ణుడికి సేవ చేయడానికి బదులుగా, ఎందుకంటే ఆయన సేవను చేయడానికి ఆరాటపడుతున్నాడు, కానీ నిరాకారా, నిర్విశేష కృష్ణుడు లేకుండా, అప్పుడు ఆయన ఎక్కడ సేవ చేస్తాడు? సేవా స్పూర్తి, ఎలా ఉపయోగించబడుతుంది? అందువల్ల వారు మరలా దేశము, సమాజము కొరకు తిరిగి వస్తారు... ఒకసారి వారు విడిచిపెట్టిన తర్వాత, బ్రహ్మ సత్యం జగం మిథ్య "ఇవి అన్నీ మిథ్య అని." కానీ వాస్తవానికి సేవ చేయడము ఆనందకరమైన జీవితము అని వారికి తెలియదు. అది వారికి తెలియదు. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adhaḥ ( SB 10.2.32) అందువల్ల వారు తిరిగి పతనము అవుతారు, మళ్ళీ భౌతిక కార్యక్రమాలలో పాల్గొంటూ.

కాబట్టి ఈ విషయాలు జీవితం యొక్క స్పష్టమైన ఇంద్రియ అవగాహన లేకపోవుట వలన జరుగుతున్నాయి. ఇది ప్రహ్లాద మహారాజా అంటే, అందువలన జీవితం యొక్క స్పష్టమైన భావన ఏమిటంటే, భాగవత -ధర్మం అని పిలువబడేది ఏమిటంటే భగవంతుడిని, కృష్ణుడిని ఎలా సేవించాలి. దీనిని పిల్లలకు నేర్పించాలి. లేకపోతే, ఆయన చాలా అర్థంలేని సేవ లో వినియోగించ బడినప్పుడు, అది చాలా కష్టము అవుతుంది ఈ తప్పుడు నిమగ్నత నుండి ఆయనని బయటకు లాగి మళ్ళీ కృష్ణుడి సేవలో అతన్ని ఉంచడానికి. కాబట్టి మనం పిల్లలుగా ఉన్నప్పుడు - మనము కలుషితం కాలేదు - మనము భాగవత-ధర్మములో శిక్షణ పొంది యుండాలి. దీనిని ప్రహ్లాద మహా రాజు చర్చించారు. Kaumāra ācaret prājño dharmān bhāgavatān iha durlabhaṁ mānuṣa ( SB 7.6.1) మనము సేవ చేస్తున్నాము. పక్షులు సేవ చేస్తున్నాయి. వాటికీ చిన్న కిడ్డీ, పిల్లలు ఉన్నాయి అవి ఆహారం తీసుకొని చాలా కష్టపడి, నోటిలో తీసుకువస్తాయి, చిన్న పిల్లలు అవి, "అమ్మా, అమ్మా, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు", అని అంటూ ఆహారం తింటాయి సేవ ఉంది. సేవ ఉంది. ఎవ్వరూ సేవ లేకుండా ఉన్నారని అనుకోవద్దు. అందరూ సేవ చేస్తున్నారు... ఒక వ్యక్తి పగలు మరియు రాత్రి కష్టపడి పని చేస్తున్నాడు. ఎందుకు? కుటుంబానికి, పిల్లలకు, భార్యకు సేవలను చేయడానికి. సేవ కొనసాగుతోంది, కానీ సేవ ఎక్కడ చేయాలో ఆయనకు తెలియదు. అందువల్ల కృష్ణుడు చెప్తారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ ( BG 18.66) "నాకు సేవ చేయండి, మీరు సంతోషంగా ఉంటారు." ఇది ఈ తత్వము, భాగవత-ధర్మము.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద