TE/Prabhupada 0852 - మీ హృదయం యొక్క అంతరంగం లోపల, అక్కడ భగవంతుడు ఉన్నాడు



750306 - Lecture SB 02.02.06 - New York


మీ హృదయం యొక్క అంతరంగం లోపల, అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి భౌతిక జీవితం అంటే ఈ నాలుగు విషయాలలో మాత్రమే తీరిక లేకుండా ఉండటము: తినడము ఎలా, నిద్ర ఎలా, ఎలా చక్కని మైథున జీవితం కలిగి ఉండాలి, ఎలా రక్షించుకోవాలి. Āhāra-nidrā-bhaya-maithunaṁ ca sāmānyam etat paśubhir narāṇām (Hitopadeśa). కానీ ఈ విషయాలు మన సమస్యలను పరిష్కరించలేవు. అది మనము అర్థం చేసుకోలేదు. సమస్యలు ఉన్నాయి. అమెరికాకు వచ్చిన మన భారతీయులు చాలా గొప్ప ధనిక దేశం చూడటానికి వచ్చినారని కాదు, వారు తమ సమస్యలను పరిష్కరించుకున్నారో లేదో అని. లేదు, సమస్యలు ఉన్నాయి. భారతదేశం కన్నా ఎక్కువ సమస్యలు. భారతదేశం కేవలం ఒక సమస్య కలిగి ఉండవచ్చు, అది అక్కడ ఉంది ... వాస్తవానికి అక్కడ లేదు, కానీ భారతీయులు ఆకలితో ఉన్నారని మనము ప్రచారం చేస్తున్నాము. కానీ నేను ఆకలితో ఉన్న ఎవ్వరినీ చూడలేదు. ఏమైనా, కావున సమస్య ఉంది. భౌతిక జీవితం అంటే సమస్య, మీరు సమస్యలను పరిష్కరించాలని అనుకుంటే, ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడినది : taṁ nirvṛto niyatārto bhajeta. Taṁ అంటే దేవాదిదేవుడు

అప్పుడు ప్రశ్న ఉండవచ్చు, "ఇప్పుడు మీరు నన్ను వదిలివేయమని అడిగారు మీరే మిమల్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, శుకదేవ గోస్వామి. మీ ఆహారం కొరకు మీరు చెట్టు క్రింద వేచి వుండాలని సూచించారు, చెట్టు మీకు కొన్ని పండ్లు ఇస్తుంది. మీరు తినవచ్చు. నీటి కొరకు నీవు నదికి వెళ్లి, మీకు కావాల్సినన్ని నీటిని త్రాగావచ్చు." తరువాత, ఈ శ్లోకము ముందు, ఆయన చెప్పాడు, "నిద్ర కోసం, గడ్డి లో చాలా మంచి పరుపు ఉంది. నాకు ఏ దిండు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ సహజ దిండు పొందారు; మీకు మీ చేయి ఉంది. దాని మీద నిద్ర పొండి. కాబట్టి, āhāra-nidrā-bhaya-maithuna ca. కానీ మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థానములోకి సాగాలని కోరుకుంటే, మీరు ఈ ఇంద్రియతృప్తిని వదిలివేయాలి. ఇంద్రియ తృప్తి యొక్క సారాంశం మైథునజీవితం. లేకపోతే, మీ తినడం, నిద్ర, కంపార్ట్మెంట్, అపార్ట్మెంట్ కోసం పూర్తి అమరిక ఉంది. అంతా ఉంది. ఆలయం కూడా, అక్కడ మీకు ఉంది. ఈ ఆలయం ఎక్కడ ఉంది? నేను దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాను. చర్చి ఎక్కడ ఉంది? దేవాలయం ఎక్కడ ఉంది? నేను ఆ గుహలో నివసిస్తుంటే, అప్పుడు దేవాలయానికి వెళ్ళటానికి నేను మరొక మార్గాన్ని వెతకాలి." అందువలన శుకదేవ గోస్వామి సూచన ఇస్తారు, "లేదు", Evaṁ sva-citte svata eva siddha. మీ యొక్క హృదయములో, భగవంతుడు ఉన్నారు మీరు ఎక్కడైనా కూర్చోండి. గుహలో, అడవిలో లేదా ఎక్కడైనా మీకు నచ్చితే , మీరు కనుగొనవచ్చు భగవంతుడు మీ హృదయములో ఉన్నాడు īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61)

కృష్ణుడు చెప్పారు అంటే దేవాదిదేవుడు - అంటే ఆయన- ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. మనము నిజాయితీగా ఉంటే... మనము అంటే ఈ జీవులని అర్థం. మనము కూడా ఈ శరీరంలోనే జీవిస్తున్నాము. Asmin dehe, dehino ‘smin, dehino ‘smin dehe ( BG 2.13) మనము ఈ శరీరం కాదు. నేను, మీరు, మనము కూడా ఈ శరీరం లోపల ఉన్నాము, కృష్ణుడు ఈ శరీరంలోనే ఉంటాడు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ( BG 18.61) ఆయన హిందువుల హృదయంలో ఉన్నాడని కాదు, ఇతరులలో లేడని కాదు. లేదు ప్రతి ఒక్కరి. సర్వ-భూతానాం. ఆయన పిల్లులు, కుక్కలు, పులులు ఇతరుల హృదయము లోపల కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరి. అది ఈశ్వరః. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe. మనము పదేపదే చర్చించాము ఈ శ్లోకము - ఇది చాలా చాలా ముఖ్యమైనది - అది ఈ శరీరం ఒక మోటారు కారు, యంత్రం వంటిది. మాయయా… Bhrāmayan sarva-bhūtāni yantrā rūḍhāni māyayā ( BG 18.61) మాయయా . మాయ యొక్క ఏజెన్సీ ద్వారా, భౌతిక శక్తి, ఈ వాహనం, యంత్రం, నాకు ఇవ్వబడింది. ఎందుకు? ఎందుకంటే నేను విశ్వం అంతటా తిరుగుతూ ఉండాలని కోరుకున్నాను, ఉదాహరణకు వారు చంద్రుని గ్రహానికి వెళుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని పొందారు. దీనిని తాత్విక ఆలోచనలు అంటారు. అందరూ, ప్రతి ఒక్క మనిషి, ఆయన మానవుడై ఉంటే, ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. అది తాత్విక మనస్సు. ఆయన పరిశీలిస్తారు, "ఓ.., చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఏమైనా... అక్కడ వారు ఏమి చేస్తున్నారు? అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? అక్కడ మోటారు కారు ఉందా? అక్కడ కొండ, మహాసముద్రం ఉందా? " ఈ ప్రశ్నలు సహజముగా తెలివైన మనిషికి వస్తాయి. ఇది తత్వము యొక్క ఆరంభం. సహజమైనది