TE/Prabhupada 0854 - గొప్ప వారి కంటే గొప్పవాడు, చిన్న వారి కంటే చిన్న వాడు. అది భగవంతుడు



750306 - Lecture SB 02.02.06 - New York


గొప్ప వారి కంటే గొప్పవాడు, చిన్న వారి కంటే చిన్న వాడు. అది భగవంతుడు కృష్ణుడిని తెలుసుకోవాలనుకున్నప్పుడు... అర్జునుడు కృష్ణుడి నుండి తెలుసుకోవాలనుకున్నాడు, మీ శక్తి ఎంత వరకు విస్తరించింది? మీరు ఎలా పని చేస్తున్నారు? నేను తెలుసుకోవాలనుకున్నాను. "ఎందుకంటే అతడు జిజ్ఞాస కలిగి ఉన్నాడు, బ్రహ్మ- జిజ్ఞాసా. ఆయన భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భగవంతుడు స్వయముగా జవాబిస్తున్నాడు. ఆ అధ్యాయంలో ఆయన ఇలా పేర్కొన్నాడు, "నేను వీటిలో ఉన్నాను, నేను వీటిలో ఉన్నాను, నేను ఈ..." అప్పుడు, ఆయన సారంశముగా చెబుతున్నారు "నేను ఎంత చెప్తాను? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నా శక్తి, ఆ... ఈ భౌతిక ప్రపంచంలో అసంఖ్యాకమైన విశ్వాలు ఉన్నాయి, ప్రతి విశ్వంలో అనేక గ్రహాలూ ఉన్నాయి. అందువల్ల నేను వాటిలో ప్రతి ఒక్కదానిలోకి వెళ్ళాను, idaṁ kṛtsnam" అన్నిటిలోకి, నేను వాటిని నిర్వహిస్తాను." ఉదాహరణకు కృష్ణుడు అందరి హృదయంలో ఉన్నట్లుగా, ఆ తరువాత... అదే విధముగా, కృష్ణుడు ప్రతీ దాని లోపల కూడా ఉన్నాడు, అణువు లోపల కూడా. అది కృష్ణుడు అంటే. మనము కృష్ణుడిని అనుకరించాలని కోరుకుంటున్నాము, మనల్ని అడిగితే... "మీరు అణువులోకి ప్రవేశించండి" నేను చేయలేను. కాదు

కృష్ణుడు, భగవంతుడు, అంటే ఆయన..., ఆయన కావచ్చు, గొప్ప దాని కంటే గొప్పవాడు. మనము గొప్ప దానిని ఊహించుకోవచ్చు, విశ్వమును. కాబట్టి, ఈ విశ్వం మాత్రమే కాదు, అనేక కోట్ల విశ్వములను అవి ఆయన శరీరం యొక్క వెంట్రుకల యొక్క రంధ్రాల నుండి సృష్టించబడుతున్నాయి. Yasyaika-niśvasita-kālam athāvalambya jīvanti loma-vila-jā jagad-aṇḍa-nāthāḥ (Bs 5.48). అది భగవంతుడు. బహుశా మన శరీరంలో అనేక రంధ్రాలు ఉన్నాయి. భగవంతుడు, మహా విష్ణువు కలిగి ఉన్నాడు, ఆ రంధ్రం నుండి విశ్వములు నిరంతరంగా వస్తున్నాయి, శ్వాసను తీసుకోవడము ద్వారా. Yasyaika-niśvasita-kālam. కాబట్టి మీరు భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకొని ఉండాలి: గొప్ప దాని కంటే గొప్పవాడు, చిన్నదాని కంటే చిన్నవాడు. అది భగవంతుడు. ఆయన ఈ గొప్ప, గొప్ప విశ్వములను కేవలం శ్వాస ద్వారా ఉత్పత్తి చేయును, మళ్ళీ-మనకు ప్రతి విశ్వములో ఎన్ని అణువులు ఉన్నాయో తెలియదు- ఆయన ప్రతి పరమాణువులో ప్రవేశించగలడు.

eko 'py asau racayituṁ jagad-aṇḍa-koṭiṁ
yac-chaktir asti jagad-aṇḍa-cayā yad-antaḥ
aṇḍāntara-stha-paramāṇu-cayāntara-sthaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.35)

ఇది భగవంతుని యొక్క భావన.

ఇక్కడ ఈ ప్రతిపాదన మనము ఈ భౌతిక ప్రపంచంలో బాధపడుతున్నాము. నేను ఇలా చేస్తే భవిష్యత్తులో మనము సంతోషంగా ఉంటామని మనము ఆలోచిస్తున్నాం. కానీ ఆ భవిష్యత్తు రాకముందే మనము మరణిస్తాము ఇది మన పరిస్థితి. ఒక్కసారి మాత్రమే కాదు, కానీ చాలా సార్లు. ఇంకా నేను, మీరు, అభిప్రాయం కలిగి ఉన్నాము. ఉదాహరణకు శాస్త్రవేత్త అని పిలువబడే వాని వలె : లక్షల సంవత్సరాల తరువాత, ఆపై ఇది జరగుతుంది, ఇది జరుగుతుంది. కాదు. ఇది అంతా అర్థము లేనివి. అప్పుడు ఎలా మీ వయస్సు యాభై లేదా అరవై సంవత్సరాలు - ఎలా మీరు లక్షలాది సంవత్సరాలు గురించి ఆలోచిస్తున్నారు? మీ యాబై, అరవై సంవత్సరాల వయస్సు మీరు సత్యాన్ని గ్రహించే ముందు మిలియన్ల సార్లు పూర్తి అవుతుంది. కానీ శాస్త్రజ్ఞులు అని పిలవబడే వారు, వారు ఆలోచిస్తున్నారు, "కాదు. ఈ యాభై, అరవై సంవత్సరాలు పెద్ద మొత్తము, జీవిత కాలములో." ఆ విధముగా మనము అర్థం చేసుకోలేము. అది సాధ్యం కాదు. Ciraṁ vicinvan. మీరు ఈ వెర్రి మార్గంలో కల్పన చేస్తే, చిరం గురించి,శాశ్వతంగా, అయినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు. Ciraṁ vicinvan.

athāpi te deva padāmbuja-dvaya-
prasāda-leśānugṛhīta eva hi
jānāti tattvaṁ bhagavan-mahimno
na cānya eko 'pi ciraṁ vicinvan
(SB 10.14.29)

చిరం అంటే మీరు భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి కల్పన చేస్తుంటే, మీ అతి చిన్న బుర్ర ద్వార మరియు పరిమిత ఇంద్రియాల అవగాహన ద్వారా, అది కుదరదు... శాస్త్రం యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకోవటానికి, మీకు కావాలంటే, మొదటగా మీరు భౌతిక ఆసక్తిని విడచి పెట్టాలి. Nivṛtta… (పక్కన, అస్పష్టముగా ఉంది) భౌతిక ఆసక్తి, ఎంత కాలం నేను భౌతిక విషయాలు పట్ల ఆకర్షించబడి ఉంటానో, కృష్ణుడు నాకు ఒక సాపేక్ష శరీరమును ఇస్తాడు. Tathā dehāntara-prāptir ( BG 2.13) మనకు ఈ తాత్కాలిక భౌతిక ఆనందం కావాలంటే, అప్పుడు శరీరం ప్రకారం ఆనందం ఉంటుంది. చీమ జీవితంలో కూడా అదే విషయము ఉంది: తినడం, నిద్రపోవడము, లైంగిక సుఖము, మరియు రక్షించుకోవడము. స్వర్గము యొక్క రాజు ఇంద్రునిలో కూడా, ఆయన కూడా అదే ప్రవృత్తులను కలిగి ఉన్నాడు- తినడం, నిద్రపోవడము, మైథున సుఖము, మరియు రక్షించుకోవడము. మీరు చంద్రుని లోకమునకు లేదా సూర్య లోకమునకు లేదా అత్యున్నతమైన లోకములకు వెళ్లినట్లయితే, మీరు ఎక్కడికి వెళ్లినా, నాలుగు విషయాలు అనుసరించబడతాయి: తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము, రక్షించుకోవడము; జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి