TE/Prabhupada 0857 - కృత్రిమముగా కప్పి ఉన్న పొర తీసివేయబడాలి. అప్పుడు మనము కృష్ణ చైతన్య వంతులము అవుతాము



740327 - Conversation - Bombay


కృత్రిమముగా కప్పి ఉన్న పొర తీసివేయబడాలి. అప్పుడు మనము కృష్ణ చైతన్య వంతులము అవుతాము

ప్రభుపాద: కావున ఉదాహరణకు, నాలాగే... నేను నా చైతన్యమును కలిగి ఉన్నాను, నేను నా నొప్పులు మరియు ఆనందమును అనుభూతి చెందుతున్నాను, మీరు మీ నొప్పులు ఆనందం అనుభూతి చెందుతున్నారు. (విరామం) కానీ దురదృష్టవశాత్తు నేను ఇవి అమెరికన్ నొప్పులు మరియు ఆనందం అని ఆలోచిస్తున్నాను, ఇవి భారతీయ నొప్పులు ... నొప్పి మరియు ఆనందం ఒకటే. ఇది అమెరికన్ లేదా ఆఫ్రికన్ కాదు. నొప్పులు ఆనందం ఒకటే. కాబట్టి ఈ చైతన్యమును కలిగిన వెంటనే, నేను అమెరికన్ నొప్పి మరియు అమెరికన్ ఆనందం అనుభూతి చెందుతున్నాను, ఇది ముగిసిన వెంటనే, అప్పుడు మనము వాస్తవ చైతన్యమునకు వస్తాము. ఎందుకంటే చైతన్యము అమెరికన్ లేదా ఆఫ్రికన్ అవ్వదు. నేను మిమ్మల్ని గిచ్చితే, నేను ఆఫ్రికన్ ను గిచ్చినా అదే నొప్పిని అనుభూతి చెందుతాడు. కాబట్టి చైతన్యము అదే ఉంది. కృత్రిమంగా మనం అమెరికన్ చైతన్యము, ఆఫ్రికన్ చైతన్యము అని ఆలోచిస్తున్నాం. వాస్తవానికి ఇది పరిస్థితి కాదు. కేవలం ఈ అపార్థమును తప్పకుండా తొలిగించాలి అది ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) అని పిలుస్తారు. ఇది సత్యమా కాదా?

భవ-భూతి: అవును, శ్రీల ప్రభుపాద, ఇది వాస్తవం.

ప్రభుపాద: నొప్పి మరియు ఆనందం యొక్క అనుభూతి చెందే చైతన్యము, అది అమెరికన్ లేదా భారతీయునిది కావచ్చు?

భవ-భూతి: లేదు

ప్రభుపాద: ఇది ఒకటే. కృత్రిమంగా మనం అమెరికన్ నొప్పిగా లేదా భారతీయ నొప్పిగా భావిస్తున్నాం ఇది కృత్రిమమైనది. ఈ కృత్రిమ పొరను తొలిగించాలి. అప్పుడు మనము కృష్ణ చైతన్యమునకు వస్తాము. భావాలు, చైతన్యం అమెరికన్, ఆఫ్రికన్ లేదా ఇండియన్ అని కాదు. చైతన్యము అదే ఉంది. మీరు ఆకలితో ఉన్నపుడు, అమెరికన్లు ఆకలిని భిన్నమైన రీతిలో అనుభూతి చెందుతున్నారు ఆఫ్రికన్ భిన్నమైన రీతిలో భావిస్తారా? కాబట్టి ఆకలి, ఆకలి అదే ఉంటుంది. ఇప్పుడు, మీరు అమెరికన్ ఆకలి ఉంది అది భారతీయ ఆకలి అని చెప్తే, అది కృత్రిమమైనది కావున మీరు కృత్రిమ పరిస్థితికి వెళ్ళక పోతే, అది కృష్ణ చైతన్యము. ఇది నారద పంచరాత్రంలో వివరించబడింది, Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam hṛṣīkeṇa hṛṣīkeśa- sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) ఈ కృత్రిమ కోరికల నుండి మనము స్వేచ్ఛను పొందినప్పుడు... అమెరికన్ చైతన్యం, భారతీయ చైతన్యం, ఆఫ్రికన్ చైతన్యము, అటువంటి విషయము లేదు, ఇది కృత్రిమమైనది. పక్షి లేదా మృగం అయినా కూడా , వారు కూడా చైతన్యము అనుభూతి చెందుతారు, నొప్పులను మరియు ఆనందమును ఉదాహరణకు కాలుతున్న వేడి ఉంటే, మీరు కొంత నొప్పిని అనుభవిస్తారు. ఆది అమెరికన్, భారతీయుడా లేదా ఆఫ్రికన్? కాలే వేడి ఉంది (నవ్వుతున్నారు ), భావన... మీరు కాలే వేడి అమెరికన్ విధముగా అనుభూతిని చెందుతున్నారు అని చెప్పితే...

(హిందీ లో) ప్రభుపాద: మీకు అది సాధ్యమా? ఇది సాధ్యమా?

భారతీయ మహిళ: కాదు, అది సాధ్యం కాదు.

ప్రభుపాద: కేవలం ఇవి కృత్రిమమైనవి. ప్రతిదీ చైతన్యము మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ చైతన్యము మీద ఆధారపడి ఉంటుంది. అందువలన, కృష్ణ చైతన్యము వాస్తవ ప్రామాణిక చైతన్యము.