TE/Prabhupada 0859 - అది పాశ్చాత్య నాగరికత యొక్క లోపము. వోక్స్ పాపులి, ప్రజల యొక్క అభిప్రాయమును తీసుకొనడము



Room Conversation with Director of Research of the Dept. of Social Welfare


అది పాశ్చాత్య నాగరికత యొక్క లోపము. వోక్స్ పాపులి, ప్రజల యొక్క అభిప్రాయమును తీసుకొనడము

దర్శకుడు: అయినప్పటికీ జనాభాలో చాలా కొద్ది శాతం మాత్రమే ఉంటారు అని ప్రజలు అంటారు.

ప్రభుపాద: కాదు. ఎక్కువ శాతం అనే ప్రశ్న లేదు. నేను చిన్న శాతం అయినా కూడా, కొందరు ఆదర్శ వ్యక్తులు ఉండాలి అని చెప్పాను. కనీసం ప్రజలు దానిని చూస్తారు "ఇక్కడ ఆదర్శవంతమైన వ్యక్తి ఉన్నాడు." మనము కలిగి ఉన్నట్లుగానే. ఎందుకంటే వారు కీర్తన మరియు జపము చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, చాలామంది బయటివారు వస్తున్నారు, వారు కూడా నేర్చుకుంటున్నారు, వారు కూడా ప్రణామములు చేస్తున్నారు. క్రమముగా వారు తమ సేవలను చేస్తున్నారు: "దయచేసి నన్ను అంగీకరించండి." ప్రచారము కన్నా ఉదాహరణ ఉత్తమము. మీరు ఆదర్శవంతమైన వ్యక్తులను కలిగి ఉంటే, అప్పుడు ప్రజలు సహజముగా నేర్చుకుంటారు. అది కావలసినది. కానీ పట్టించుకోవలసిన అవసరము లేదు... నేను కనుగొనలేకపోతున్నాను, నేను చెప్పేది ఏమిటంటే ఆదర్శవంతులైన వ్యక్తులను. ప్రీస్ట్ లు కూడా, వారు వారి తాగే అలవాటు వలన ఆసుపత్రికి వెళ్తున్నారు. నేను ఇంతకు ముందు కొన్నిసార్లు ఆసుపత్రిలో, ఐదు వేలమంది రోగులు, ఆల్కాహాలిక్ రోగులను చూసాను, ప్రీస్ట్ ను కూడా. ఆ ప్రీస్ట్ ఆదర్శ గుణాలను కలిగి ఉండాలి. వారు స్వలింగ సంపర్కమును ప్రోత్సహిస్తున్నారు. ఆదర్శ లక్షణములు కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ప్రీస్ట్ తరగతి వారు తాగుడు అలవాటు వలన ఆసుపత్రికి వెళ్ళితే, మరియు వారు పురుషునితో పురుషునికి వివాహమును స్వలింగ సంపర్కం అనుమతిస్తే, అప్పుడు ఆదర్శ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు?

దర్శకుడు: కానీ స్వలింగ సంపర్కం మాలో ఒక అనారోగ్యం...

ప్రభుపాద: అహ్?

దర్శకుడు: స్వలింగ సంపర్కం ఒక అనారోగ్యం. ఎందుకు మీరు...?

భక్తుడు: ఆయన ఒక అనారోగ్యం అని చెప్పాడు.

దర్శకుడు: ఇది అనారోగ్యం. ఇది ఒక వ్యక్తి గుడ్డి వాడి వలె, మీరు చూపు లేకపోవడము వలన అతడిని శిక్షిస్తారా. స్వలింగ సంపర్కి అయినందుకు మీరు ఒక వ్యక్తిని శిక్షించలేరు. అని మన సమాజం చెప్తుంది.

ప్రభుపాద: ఏమైనప్పటికీ, ప్రీస్ట్ తరగతి వారు, స్వలింగ సంపర్కమును అనుమతించడము.

దర్శకుడు: క్షమించండి?

ప్రభుపాద: అనుమతించడము. వారు స్వలింగ సంపర్కమును అనుమతిస్తున్నారు.

దర్శకుడు: అవును, మేము చెప్తాము...

ప్రభుపాద: పురుషునితో పురుషునికి ఒక పూజారి వివాహం చేసాడని ఒక నివేదిక వచ్చింది. న్యూయార్క్లో వాచ్ టవర్ అనే పత్రికలో. అది ఒక క్రైస్తవ పత్రిక. ఆ పత్రికలో నేను చూశాను. వారు ఖండిస్తున్నారు, ఆ ప్రీస్ట్ పురుషునితో పురుషునికి వివాహం అనుమతిస్తున్నాడు అని. వారు చట్టము చేస్తున్నారు, స్వలింగ సంపర్కము, "అది సరి అయినది అని" మీరు చెప్పారు పెర్త్ లో విద్యార్ధులు స్వలింగ సంపర్కుము గురించి మాట్లాడుతున్నారు, స్వలింగ సంపర్కమునకు అనుకూలముగా. కాబట్టి ఆదర్శ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? మీరు ఏదైనా స్పష్టముగా కనబడేది కావాలను కుంటే, కొందరు ఆదర్శ వ్యక్తులకు శిక్షణ ఇవ్వండి. అది ఈ కృష్ణ చైతన్య ఉద్యమం.

దర్శకుడు: మీరు ఏమి చెప్తారు.. మీకు ఆదర్శవంతము అయినది ఇతరులకు ఆదర్శవంతము కాదని ప్రజలు చెప్తారు.

ప్రభుపాద: నేను ఆదర్శ వ్యక్తి యొక్క లక్షణములను ఉదాహరణగా ఇస్తున్నాను.

దర్శకుడు: అవును, కానీ అది ఒకరి అభిప్రాయం.

ప్రభుపాద: కాదు. ఇది అభిప్రాయంపై ఆధారపడదు. అభిప్రాయం, ప్రజలు అందరు గాడిదలు అయితే వారి అభిప్రాయమునకు విలువ ఏమిటి? అభిప్రాయం లేదు. ఒకరు శాస్త్రములో చెప్పినది తీసుకోవాలి. అభిప్రాయం లేదు. ఒక గాడిద యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం వలన ఉపయోగము ఏమిటి? కాబట్టి కుక్కలు, గాడిదల వలె ప్రజలు శిక్షణ పొందుతున్నారు, అప్పుడు వారి అభిప్రాయము వలన ఉపయోగము ఏమిటి? మీరు అమలు చేస్తే, మీరు ఇలా చేయాలి. మనము ప్రవేశ పెట్టినట్లుగా "అక్రమ లైంగిక సంబంధము వద్దు." నేను వారి అభిప్రాయం గురించి ఆలోచించ లేదు. అభిప్రాయము అంటే... తక్షణమే చర్చ ఉంటుంది. వారి అభిప్రాయం తీసుకోవడము వలన ఉపయోగం ఏమిటి? ఇది తప్పక పాటించాలి. అది పాశ్చాత్య నాగరికత యొక్క లోపం. ప్రజల అభిప్రాయమును తీసుకొవడము, వాక్స్ పొపులి. కానీ ఈ ప్రజల అభిప్రాయమునకు విలువ ఏమిటి? తాగుబోతులు, ధూమపానం చేసే వారు, మాంసం తినేవాళ్ళు, స్త్రీ-వేటగాళ్ళు. దాని వలన... వారు ఉన్నతమైన వ్యక్తులు కాదు. కాబట్టి అలాంటి మూడవ-తరగతి, నాలుగవ తరగతి వ్యక్తుల అభిప్రాయం వలన ఉపయోగము ఏమిటి? మనము అలాంటి అభిప్రాయాన్ని సమర్ధించము. కృష్ణుడు చెప్పినది, అది ప్రామాణికమైనది, అది అంతే. కృష్ణుడు మహోన్నతమైన వాడు, ఆయన చెప్పినదే అంతిమంగా పాటించాలి. అభిప్రాయము లేదు, ప్రజాస్వామ్యం లేదు. మీరు చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లితే, వైద్యుడు ఇతర రోగుల అభిప్రాయము కొరకు తన ప్రిస్క్రిప్షన్ను ఉంచడు: ఇప్పుడు నేను ఈ ఔషధాన్ని ఈ పెద్ద మనిషికి సూచించాను. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని నాకు ఇవ్వండి. "ఆయన అలా చేస్తాడా? అందరు రోగులు, వారు ఏమి ఇస్తారు, వారి అభిప్రాయమును? వైద్యుడు పరిపూర్ణ వ్యక్తి. ఆయన ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాస్తాడో, అంతే. కానీ ఇక్కడ పాశ్చాత్య... ప్రతిదీ, ప్రజల అభిప్రాయం