TE/Prabhupada 0863 - మీరు మాంసం తినవచ్చు, కానీ నీ తండ్రి మరియు తల్లిని చంపి మాంసం తినకూడదు



750521 - Conversation - Melbourne


మీరు మాంసం తినవచ్చు, కానీ మీ తండ్రిని తల్లిని చంపడము ద్వారా మీరు మాంసం తిన కూడదు

దర్శకుడు: మీ సమాధానం ఏమిటంటే ఇప్పటికీ చాలా తక్కువ శాతం జనాభా, జనాభాలో కొద్ది శాతం, తత్వమును అంగీకరించారు ...

ప్రభుపాద: తక్కువ శాతం కాదు, ఉదాహరణకు ... ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, ఒక చంద్రుడు ఉన్నాడు. శాతములో చూస్తే చంద్రుడు శూన్యము. మనము నక్షత్రాల శాతం తీసుకుంటే, చంద్రుడు శూన్యము. కానీ చంద్రుడు అన్ని అర్థంలేని నక్షత్రాల కన్నా ముఖ్యమైనది. (నవ్వు) కానీ మీరు శాతాన్ని తీసుకుంటే, అతడికి ఓటు శాతం లేదు. కానీ ఆయన చంద్రుడు , ఆయన అన్ని ఈ మూర్ఖపు నక్షత్రాలు కంటే ముఖ్యం. ఇది ఉదాహరణ. చంద్రుని సమక్షంలో నక్షత్రాల శాతం తీసుకుంటే ఉపయోగము ఏమిటి? ఒక్క చంద్రుడిని ఉండనివ్వండి, అది సరిపోతుంది. శాతం యొక్క ప్రశ్న అవసరము లేదు. ఒక ఆదర్శ వ్యక్తి చాలు ఉదాహరణకు క్రిస్టియన్ ప్రపంచంలో, ఒక ఆదర్శ ప్రభువైన యేసు క్రీస్తు లాగానే.

దర్శకుడు: మీరు మావో సే-తుంగ్ గురించి ఏమి అనుకుంటారు?

ప్రభుపాద: హుహ్? అది ఏమిటి?

అమోఘ: మావో సే-తుంగ్ గురించి మీరు ఏమి అనుకుంటారు?

దర్శకుడు: చైనాలో ఆయన ఆదర్శవంతమైన వ్యక్తి.

అమోఘ: ఆయన ఒక కమ్యూనిస్ట్.

ప్రభుపాద: ఆయన ఆదర్శము సరైనది.

దర్శకుడు: చైనాలో, ఆయన ...

ప్రభుపాద: తన ఆదర్శము, కమ్యూనిస్ట్ ఆలోచన, ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలి, అది మంచి ఆలోచన. కానీ వారెవరికీ ఎలా చేయాలో తెలియదు... ఉదాహరణకు వారు రాష్ట్రములో మానవుని మీద శ్రద్ధ వహిస్తున్నట్లుగానే, కానీ వారు నిస్సహాయమైన జంతువులను కబేళాకు పంపుతున్నారు. వారు నాస్తికులు కనుక, జంతువు కూడా జీవి మరియు మానవుడు కూడా జీవి అని వారికి తెలియదు. కాబట్టి మనిషి యొక్క నాలుక సంతృప్తి కోసం జంతువు గొంతును నరకాలి. అది లోపము. Paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) జ్ఞానవంతుడైన వ్యక్తికి, అతడికి అందరూ సమానము. ఇది జ్ఞానము కలిగి ఉండుట అంటే. "నేను నా సోదరుడిని జాగ్రత్తగా చూసుకుంటాను నేను నిన్ను చంపేస్తాను," ఇది సరిగ్గా లేదు. ఇది ప్రతిచోటా జరుగుతోంది. నేషనలిజం. నేషన్ ... జాతీయత అంటే ఆ దేశంలో జన్మించిన వ్యక్తి. కానీ జంతువు, నిస్సహాయమైన జంతువు, అవి నిరసన చేయవు కనుక , వాటిని కబేళాకు పంపించండి. ఆదర్శవంతమైన మనుషులు ఉన్నట్లయితే, వారు నిరసన వ్యక్తం చేస్తారు, ఓ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? వాటిని కూడా జీవించనివ్వండి. మీరు కూడా నివసించండి. ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయండి. జంతువులు కూడా తీసుకోవచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. మీరు ఎందుకు జంతువును తీసుకోవాలి?" అది భగవద్గీతలో ఇది సిఫార్సు చేయబడింది.

దర్శకుడు: అయితే చలి కాలము చాలా పెద్దదిగా ఉండే ప్రదేశములో, ప్రజలు జంతువులను చంపాలి ఏదైనా తినడానికి.

ప్రభుపాద: సరే, కానీ మీరు కలిగి ఉండాలి ... నేను భారతదేశం లేదా యూరోప్ గురించి మాట్లాడటం లేదు. నేను మొత్తం మానవ సమాజం గురించి మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

దర్శకుడు: ప్రజలు మాంసం తినడం ప్రారంభించారు ఎందుకంటే శీతాకాలంలో వారికి తినడానికి ఏమీ దొరకదు.

ప్రభుపాద: లేదు, మీరు మాంసం తినవచ్చు, కానీ నీ తండ్రి మరియు తల్లిని చంపి మాంసం తినకూడదు. అది మానవ ధర్మము. మీరు ఆవు నుండి పాలు తీసుకుంటున్నారు; ఇది మీ తల్లి. మీరు పాలు తీసుకుని, ఆస్ట్రేలియాలో వారు చాలా పాలు, వెన్న మరియు ప్రతిదీ ఉత్పత్తి చేస్తారు. అది ముగిసిన తర్వాత, గొంతు నరికి వ్యాపారము చేస్తారు, ఇతర దేశాలకు పంపుతారు. ఈ అర్థం లేనిది ఏమిటి? ఇది మానవత్వమా? మీరు భావిస్తున్నారా?

దర్శకుడు: సరే, రెండు వందల సంవత్సరాల క్రితం ప్రజలు, శీతాకాలంలో మనుగడకు, చంపవలసి వచ్చింది ...

ప్రభుపాద: లేదు, లేదు. మీరు మీ తల్లి పాలు తీసుకుంటారు. మీరు మీ తల్లి పాలు తీసుకుని, తల్లి పాలు సరఫరా చేయలేకపోతే, మీరు ఆమెను చంపుతారు. ఇది ఏమిటి? అది మానవత్వమా? ప్రకృతి చాలా బలంగా ఉంది, ఈ అన్యాయానికి, పాపమునకు, మీరు బాధపడాలి. మీరు బాధపడటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి యుద్ధం ఉంటుంది, ఒక్కసారిగా మొత్తము హత్య చేయబడుతారు ప్రకృతి దీనిని సహించదు. వారికి అన్నీ తెలియదు, ప్రకృతి ఎలా పని చేస్తుందో, ఎలా నిర్వహించబడుతోంది. వారు భగవంతుణ్ణి ఎరుగరు. ఇది సమాజంలోని లోపం. వారు భగవంతుడు అంటే ఏమిటో పట్టించుకోరు. మనము శాస్త్రవేత్తలము. మనము ప్రతిదీ చేయవచ్చు. మీరు ఏమి చేయగలరు? మీరు మరణాన్ని ఆపగలరా? ప్రకృతి చెప్తుంది, "మీరు చనిపోవాలి, మీరు ప్రొఫెసర్ ఐన్ స్టీన్, అది సరే, మీరు చనిపోవాలి." ఎందుకు ఐన్ స్టీన్ మరియు ఇతర శాస్త్రవేత్తలు, వారు ఒక ఔషధం లేదా పద్ధతిని కనుగొనలేదు, లేదు, లేదు, మనం చనిపోవద్దు? కాబట్టి ఇది సమాజంలోని లోపం. వారు పూర్తిగా ప్రకృతి నియంత్రణలో ఉన్నారు, వారు స్వాతంత్ర్యం ప్రకటించుకుంటున్నారు. అజ్ఞానం. అజ్ఞానం. కాబట్టి మనము దీన్ని సంస్కరించాలని కోరుకుంటున్నాము.

దర్శకుడు: సరే, నేను తప్పకుండా మీకు అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను .

ప్రభుపాద: హమ్? దర్శకుడు: అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. ప్రభుపాద:హమ్.., ధన్యవాదాలు.

దర్శకుడు: ఒక ప్రజా సేవకుడుగా మీరు సమాజమును సంస్కరించడాన్ని మీ జీవితముగా తీసుకున్నారు. సమాజమునకు సేవ చేసేందుకు.

ప్రభుపాద: మాతో సహకరించండి. ఈ... తత్వము నేర్చుకోవడానికి ప్రయత్నించండి, మీరు తత్వము ఎంత చక్కగా ఉందో చూసి ఆశ్చర్య పోతారు

దర్శకుడు: నేను నమ్ముతాను.

ప్రభుపాద: అవును. కాబట్టి మనము శాతం లెక్కించము. వ్యక్తిగతంగా ఉత్తమ వ్యక్తిగా మారండి. అదే ఉదాహరణ: నక్షత్రాలతో ఒక చంద్రుడిని పోలిస్తే సంఖ్య శాతం లేదు శాతం ఎంత? లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. ఇది... ఎంత శాతం మిలియన్లో ఒకరు? ఇది ఆచరణాత్మకంగా సున్నా శాతం. అయినప్పటికీ, అది చంద్రుడు కనుక, ఈ చిన్న నక్షత్రాల కంటే ఇది సరిపోతుంది. కాబట్టి చంద్రుడిని ఉత్పత్తి చేయండి.

దర్శకుడు: అవును, కానీ ఆ చంద్రుడు గొప్పది, మీరు దానిని గుర్తించగలరు, కానీ మరొక వ్యక్తి, మరో నక్షత్రం ...

ప్రభుపాద: లేదు, అది సరియైనది. మీరు చంద్రునితో సమానముగా చేయలేక పోతే...

దర్శకుడు: క్షమించండి మరల చెప్పండి?

ప్రభుపాద: మీరు చేయలేరు, కానీ వారు ఆదర్శ వ్యక్తులే అయితే అది సాధ్యమే.

దర్శకుడు: సారూప్యము ఆసక్తికరముగా ఉన్నది, కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అడుగుతాడు, మీరు నా లాంటి వ్యక్తి మాత్రమే, ఎలా, మీకు తెలుసు ... ఇది కేవలము ఒక నక్షత్రం కాదు, అది మీ అభిప్రాయం, ఉదాహరణకు నా లాగా...

ప్రభుపాద: లేదు, మీరు ఈ పద్ధతిని ఆమోదించినట్లయితే మీరు చాలా విధాలుగా సహకరించవచ్చు. మొదట మీరు ఈ పద్ధతి, కృష్ణ చైతన్య ఉద్యమం ఏమిటో చూడవలసి ఉంటుంది. మీకు సేవ చేయటానికి, మిమ్మల్ని ఇది మొదటి-తరగతి స్వభావము కలిగిన ఉద్యమము అని ఒప్పించటానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీరు నమ్మితే, సహకరించడానికి ప్రయత్నించండి. ఇతర నాయకులను ప్రేరేపించండి. మీరు కూడా నాయకులలో ఒకరు. Yad yad ācarati śreṣṭhas tat tad evetaro janaḥ ( BG 3.21) సమాజంలోని నాయకులు ఈ ఉద్యమం మీద విశ్వాసము కలిగి ఉంటే, ఇతరులు సహజముగా, "ఓ, మన నాయకులు, మన మంత్రి దీనికి మద్దతు ఇస్తున్నారు.