TE/Prabhupada 0867 - మనము శాశ్వతంగా ఉన్నాము మన కార్యక్రమాలకు బాధ్యత వహిస్తున్నాము. అది జ్ఞానం



750520 - Morning Walk - Melbourne


మనము శాశ్వతంగా ఉన్నాము మన కార్యక్రమాలకు బాధ్యత వహిస్తున్నాము. అది జ్ఞానం

హరి-సౌరి: వాతావరణంలో అసమానత ...

ప్రభుపాద: ఇది పాపభరితమైన జీవితం, అసమానత కారణంగా ఉంది.

హరి-సౌరి: మనము కృష్ణ చైతన్యము ఉద్యమమును పెంచుతూపోతే...

ప్రభుపాద: అప్పుడు అది క్రమంగా ఉంటుంది. ఇది ప్రకృతి శిక్ష. పాపభరితమైన జీవితాన్ని మీరు పట్టించుకోకపోవచ్చు కానీ అది నమోదు చేయబడుతుంది. అది మూర్ఖత్వం. "నేను భగవంతుని పట్టించుకోను, ఏమి జరుగుతుందో పట్టించుకోను," ఇది మూర్ఖత్వం. ప్రజలు... దిగువ లోకములలో, వారు అలా ఉన్నారు. ఈ లోకము లో కూడా. పాశ్చాత్య దేశాల్లో అనేక ప్రదేశాలు ఉన్నాయి: "దేనినైనా పట్టించుకోకండి, పాపభరితమైన జీవితము ఏమిటి , ఏమి జరుగబోతుంది. మనము ఆస్వాదిద్దాము , మనము ఆనందించుదాము, అంతే. " ఇది వారి తత్వము. "మనము ఆనందిద్దాము. అంతే." భౌతికవాద అభిప్రాయము ఇలా ఉంటుంది. మనము శాశ్వతమైనవారమని మన కార్యక్రమాలకు బాధ్యత వహించాలని వారికి తెలియదు. అది జ్ఞానం. కానీ వారికి జ్ఞానం లేదు. వారు కేవలం ఆనందించాలని అనుకుంటున్నారు. వారు మరణం కోసం కూడా పట్టించుకోరు. కేవలం ఇంద్రియ తృప్తి. అంతే. దీనిని దానవా, దానవ జీవితం అని పిలుస్తారు. శాస్త్రవేత్త చాలా రకాలుగా వివరిస్తారు. వారు చాలా రకాలు ఉన్నాయి అని అంగీకరించారు. ఎన్నో రకాల జీవితాలు ఎందుకు ఉన్నాయి?

హరి-సౌరి: వారు కేవలం సుమారుగా చెప్తున్నారు. ఇటీవలి ఆవిష్కరణలు మరియు శిలాజాల పరీక్షల నుండి వారు చెప్పారు, ఇలాంటి...

ప్రభుపాద: అది సరే.

హరి-సౌరి:... వారు వారి గణన తయారు చేశారు.

ప్రభుపాద: ఎందుకు రకాలు ఉన్నాయి?

అమోఘ: వాస్తవానికి కేవలం ఒక కణం మాత్రమే ఉందని కొన్ని పరిస్థితులలో అనుగుణంగా, ఒక రకమైనది జీవిస్తుంది అని మరొకటి చనిపోతుందని అని వారు అంటున్నారు.కాబట్టి ఈ రకాలు అన్ని, వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ప్రభుపాద: ఎవరు అనుగుణముగా తీసుకున్నారు? ఎవరు నిర్వహించారు?

అమోఘ: సరే , వారు కేవలం... అనుకోకుండా.

ప్రభుపాద: ఆహ్, అది అర్థంలేనిది. ఏమీ అనుకోకుండా జరుగదు. అది అర్థంలేనిది. కొంత ఏర్పాటు ఉండాలి. అనుకోకుండా ఏమి జరుగుతోంది? మీరు ఈ చెట్ల సంరక్షణ ఎందుకు చేస్తున్నారు? చాలా విషయాలు. అనుకోకుండా ఏమీ జరుగదు. మీరు ఆ కారణం చూడలేరు. అనుకోకుండా ఒక వ్యక్తి ధనవంతురాలైనట్లయితే, ఎందుకు మీరు ధనవంతులయ్యేందుకు కష్టపడి పోరాడుతున్నారు? ఎందుకు వారి మోటారు కార్లు పగలు రాత్రి తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ అక్కడ? మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనుకోకుండా డబ్బు ను రానివ్వండి. ఎందుకు వారు అలా చేయరు? ప్రమాదం ఉంటే, ప్రమాదంలో వచ్చి, నన్ను ధనవంతుడిని చేయనివ్వండి. వారు ఎందుకు ప్రయత్నించాలి? ఎందుకు వారు కళాశాలకు వెళ్ళాలి? అనుకోకుండా మీరు M.A., Ph.D. అవ్వండి ఇది అంతా మూర్ఖత్వము, కేవలం బలము లేని ఆలోచన. బలము లేని ఆలోచన. విషయాలు అనుకోకుండా జరిగితే, ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు? జవాబు ఏమిటి?

అమోఘ: సరే, మనము ప్రయత్నించాము, కానీ-మనము ప్రయత్నించాలి - కానీ ఏమి జరగబోతుందో మనము చెప్పలేము. కాబట్టి మనము ప్రయత్నిస్తున్నప్పుడు అది అనుకోకుండా జరుగుతుంది. ఉదాహరణకు పాఠశాలలో వలె మనం ప్రయత్నించాలి, అప్పుడు కానీ మనము ప్రమోట్ చేయబడతాము.

ప్రభుపాద: లేదు, మీరు ప్రమాదమును నమ్మితే, అప్పుడు మీరు ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. ఏదీ అనుకోకుండా జరుగదు.

హరి-సౌరి: మనం, అప్పుడు మనిషి యొక్క కర్మ ద్వారా, విషయాలు జరుగుతున్నాయి అని మనము చెప్ప కూడదా? నాకు తెలిసిన ఒక వ్యక్తి నుండి ఒక లేఖ వచ్చింది, ...

ప్రభుపాద: భగవంతుని అనుమతి మరియు కర్మ చేయడము-రెండు విషయాలు. ఐదు కారణాలు ఉన్నాయి: కర్మ, ప్రదేశము, శక్తి యొక్క నిష్పత్తి, చివరికి, భగవంతుని అనుమతి అప్పుడు విషయాలు జరుగుతాయి. లేకపోతే ప్రమాదము అనే ప్రశ్నే లేదు