TE/Prabhupada 0870 - రక్షించడం ఇది క్షత్రియుల యొక్క కర్తవ్యం



750519 - Lecture SB - Melbourne


రక్షించడం ఇది క్షత్రియుల యొక్క కర్తవ్యం, రక్షించడానికి ఇది మహారాజ పరీక్షిత్ శుకదేవ గోస్వామి మధ్య సంభాషణ. మహారాజ పరీక్షిత్, ఐదు వేల సంవత్సరాల క్రితం ఆయన మొత్తం ప్రపంచానికి చక్రవర్తి. గతంలో, ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు, మొత్తం ప్రపంచం రాజుల నియంత్రణలో ఉంది మరియు రాజులచే పాలించబడింది దీని రాజధాని హస్తినాపురం, న్యూఢిల్లీ. ఒకే ఒక్క జెండా మాత్రమే ఉండేది, ఒకే ఒక్క పాలకుడు, ఒకే గ్రంథము, వేదముల గ్రంథము, ఆర్యన్లు. ఆర్య, వారు నాగరిక వ్యక్తులు. మీరు ఐరోపావాసులు, అమెరికన్లు, మీరు కూడా ఆర్యన్లు ఇండో యూరోపియన్ గుంపు. మహారాజ పరీక్షిత్ యొక్క మనవడు మహారాజ యయాతి, ఆయన ఇద్దరు కుమారులకు ఇచ్చారు తూర్పు ఐరోపా యొక్క భాగమును గ్రీకు మరియు రోమన్ . ఇది మహాభారత చరిత్ర. మహాభారతం అంటే గొప్ప భారతదేశం. కాబట్టి వేరే ధర్మము లేదు. ఒకే ధర్మము: వేదముల ధర్మము. వేదముల ధర్మము అంటే దేవాదిదేవుడు సర్వజ్ఞుడు, సంపూర్ణ సత్యంగా అంగీకరించడము. ఇది వేదముల ధర్మము. ఎవరైతే భగవద్గీత చదివినారో... ఇది పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది, vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15) వేదముల జ్ఞానం అంటే భగవంతుని అర్థం చేసుకోవడం అని అర్థం. ఇది వేదముల ధర్మము.

తరువాత, కలి-యుగం పురోగతితో... కలి-యుగం అంటే చీకటి యుగం, పాపపు యుగం, లేదా వాదన కోసం ఉన్న యుగం, అనవసరమైన మాటలు మరియు కలహం, పోరాటం. దీనిని కలి యుగం అని పిలుస్తారు. అది జరుగుతోంది. గత ఐదు వేల సంవత్సరాల నుండి, కలి యుగం ప్రారంభమైంది, కలి యుగం ప్రారంభంలో ఆవును - చంపబోవుట ఉంది. మహారాజ పరీక్షిత్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పుడు, ఆయన చూసాడు ఒక నల్ల మనిషి ఒక ఆవుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మహారాజ పరీక్షిత్ దీనిని చూసి వెంటనే... ఆవు వధించబడ బోతున్నందుకు వణుకుతున్నది. మహారాజ పరీక్షిత్, "ఈ వ్యక్తి ఎవరు, నా రాజ్యంలో ఒక ఆవు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు?" కాబట్టి వెంటనే తన ఖడ్గాన్ని తీసుకున్నాడు. అది క్షత్రియుడు. క్షత్రియ అంటే ... క్షత్ అంటే అర్థం గాయం, త్రాయతే- ఇది క్షత్రియ అని పిలుస్తారు. ఇతరులకు హాని చేయాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అది ఇప్పుడు పెరిగిపోయింది. కానీ మహారాజ పరీక్షిత్ కాలంలో సమయంలో, అది అనుమతించబడలేదు. రాజు బాధ్యత వహించాలి. ప్రభుత్వం తన బాధ్యత వహించాలి అది తన వారు ఎవరైనా, జంతువు లేదా మనిషి గాని, ఆయన కలత చెందడు; ఆయన తన ఆస్తి, తాను సురక్షితము అని భావిస్తాడు. రక్షించడము, కాపాడడము ఇది క్షత్రియుని కర్తవ్యము. ఇది ప్రభుత్వ పద్ధతి. కాబట్టి అది ఎంతో పెద్ద కథ. పరీక్షిత్ మహారాజు చాలా పవిత్రమైనవారు. ఇది పద్ధతి