TE/Prabhupada 0874 - ఆధ్యాత్మిక స్థితికి ఎదిగిన వారు ఎవరైనను, ఆయన ప్రసన్నాత్మ. ఆయన ఆనందముగా ఉంటాడు



750519 - Lecture SB - Melbourne


ఆధ్యాత్మిక స్థితికి ఎదిగిన వారు ఎవరైనను, ఆయన ప్రసన్నాత్మ. ఆయన ఆనందముగా ఉంటాడు కాబట్టి విద్య-వినయ, ఒక మర్యాదస్థుడైన వ్యక్తి, బాగా జ్ఞానవంతుడైన పండితుడు, vidyā-vinaya-sampanne brāhmaṇe గవి, ఒక ఆవు, హస్థి, ఒక ఏనుగు, vidyā-vinaya-sampanne brāhmaṇe gavi hastini, śuni - శుని అంటే కుక్క - Śvapāk... శ్వపాక ఒక కుక్కను తినేవాడు అని అర్థం. అనేకమంది వ్యక్తులు ఉన్నారు, వారు వివిధ రకాల మాంసం తినడానికి ఇష్టపడతారు. కానీ కుక్క మాంసం తింటున్న వ్యక్తి ఎవరైనా, ఆయన చాలా అధమ తరగతికి చెందినవాడుగా పరిగణించబడతాడు. కాబట్టి śuni caiva śva-pāke ca paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) ఒక పండితుడు, జ్ఞానము కలిగిన వాడు ఆయన ప్రతి ఒక్కరిని, ఒకే స్థాయిలో చూస్తాడు అ స్థాయి ఏమిటి? ఆత్మ. ఆయన బాహ్య శరీరాన్ని చూడడు. దీనిని బ్రహ్మ- దర్శినా అని పిలుస్తారు. పండితాః సమా-దర్శినా. ఒకవేళ ఆ స్థానములో ఒకరు ఉంటే,

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām
(BG 18.54)

తాను ఈ శరీరము కాదు అని సాక్షాత్కారము పొందినవారు, ఆయన ఆత్మ, బ్రహ్మ-భూతః, అయితే లక్షణాలు ఏమిటి? ఇప్పుడు, ప్రసన్నాత్మ : ఆయన వెంటనే చాలా ఆనందముగా ఉంటాడు.

ఎంత కాలము మనము భౌతికంగా నిమగ్నము అవుతామో, శరీర భావనలో, ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. ఇది పరీక్ష. ఆందోళనలో ఉన్న ఎవరైనా, ఆయన భౌతిక స్థితిలో ఉంటాడు. ఎవరైనా ఆధ్యాత్మిక స్థితికి ఎదిగితే ఆయన ప్రసన్నాత్మ. ఆయన ఆనందముగా ఉంటాడు. ప్రసన్నాత్మ అంటే అర్థం ఏమిటి? న శోచతి న కాంక్ష్యతి ఆయనకు ఏది అవసరం లేదు, ఆయన దగ్గర ఏదైనా ఉంటే ఆయన కోల్పోతే, ఆయన దాని కోసం ఏడవడు. అంతే. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనము మన దగ్గర లేని దాని కోసము ఆశ పడుతూ ఉంటాము. మనము ఏదైనా కలిగి ఉంటే అది పోయినట్లయితే,అప్పుడు మనము బాధపడతాము. ప్రతి ఒక్కరూ చాలా గొప్ప వ్యక్తి అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. అది అకించన అని పిలువబడుతుంది. ఆయన తన వాటిని కోల్పోతే, అతడు బాధపడతాడు. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే ఈ రెండు విషయముల గురించి మీరు బాధపడరు.

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu....
(BG 18.54)

ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా సాక్షాత్కారము పొందకపోతే, ఆయన ప్రతి ఒక్కరినీ సమానముగా చూడలేడు. అప్పుడు,samaḥ sarveṣu bhūteṣu mad-bhaktiṁ labhate parām. అప్పుడు బ్రహ్మ-భూత స్థితిని అధిగమించిన తరువాత భగవంతుని యొక్క నిజమైన భక్తుడు అవుతాడు.

కాబట్టి ఈ భక్తి మార్గము అంత సులభం కాదు. కానీ, చైతన్య మహా ప్రభు యొక్క దయతో మనము మీ దేశంలో అర్చామూర్తిని ప్రతిష్టించాము చైతన్య మహా ప్రభు మీ దేశంలోకి వచ్చినందుకు మీరు చాలా అదృష్టంతులు మీరు అన్ని ఆందోళనల నుండి ఎలా ముక్తి పొందాలో మీకు బోధించుటకు ఇది చైతన్య మహా ప్రభు యొక్క లక్ష్యము. ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళనలతో ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ ఆందోళనల నుండి విముక్తి పొందగలరు, ఆయన శ్రీ చైతన్య మహా ప్రభు చేత ఇవ్వబడిన మార్గం అనుసరించినట్లయితే. శ్రీ చైతన్య మహా ప్రభు యొక్క ఆదేశం ఏమిటి? చాలా సులభం.

harer nāma harer nāma harer nāma eva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఇది చైతన్య మహా ప్రభు యొక్క వ్యక్తిగత కథనము కాదు. ఇది వేద గ్రంథములలో ఉన్నది, బృహన్నారదీయ పురాణ గ్రంథంలో ఉంది. ఈ సూచన ఉంది. ఈ యుగంలో ప్రజలు పతితులైనందున, ఇవ్వబడిన పద్ధతి కూడా చాలా సులభమైనది. వారు ఏ కష్టమైనా లేదా తీవ్రమైన తపస్సులను అనుసరించలేరు. ఇది సాధ్యం కాదు. భగవంతుడు పవిత్ర నామాన్ని కీర్తించమని వారికి సిఫారసు చేయబడినది. అంతే. ఎవరైనా చెయ్యవచ్చు. ఇది ఎంత మాత్రము కష్టం కాదు. అప్పుడు మీరు చెప్పవచ్చు "మీరు భారతదేశం నుండి వచ్చారు. మీ చైతన్య భారతీయుడు, ఆయన హరే కృష్ణ మంత్రమును సిఫార్సు చేస్తున్నాడు. ఎందుకు నేను కీర్తన చేయాలి? నాకు నా స్వంత భగవంతుడు ఉన్నాడు." సరే మీరు మీ స్వంత భగవంతుడిని కలిగి ఉంటే, మీరు ఆయన నామాన్ని కీర్తించండి. చైతన్య మహా ప్రభు మీరు కేవలము కృష్ణుడి పేరును కీర్తించమని చెప్పలేదు. మీరు భగవంతునితో ఏమైనా సంబంధం కలిగి ఉంటే, మీకు ఆయన పేరు మరియు చిరునామా తెలిసి ఉంటే, (నవ్వు) అప్పుడు మీరు ఆయన నామము కీర్తించండి. దురదృష్టవశాత్తూ, మీకు భగవంతుడు ఎవరో తెలియదు; మీకు ఆయన చిరునామా లేదా ఆయన కార్యక్రమాలు కూడా ఏమి తెలియవు. కాబట్టి ఈ కృష్ణుడిని తీసుకోండి. ఇక్కడ మహోన్నతమైన పేరు ఉంది. మేము ఆయన చిరునామా, ఆయన తండ్రి పేరు, ఆయన తల్లి పేరు, ప్రతిదీ మీకు ఇస్తాము. మీరు మీ సొంత భగవంతుని నామము కలిగి ఉంటే, చైతన్య మహాప్రభు చెప్పారు మీరు ఆ పేరును కీర్తన చేయవచ్చు. మీలో ఎవరికైనా ఏ నామము అయినా ఉందా? భగవంతుడు పేరు? ఎవరికీ తెలియదు?

భక్తుడు: యెహోవ.

ప్రభుపాద: యెహోవ. సరే, మీరు యెహోవను కీర్తించండి. కాబట్టి ఇది చైతన్య మహా ప్రభు యొక్క సిఫారసు, ఇది భగవంతుని నామము అని మీరు అనుకుంటే, మీరు కీర్తన చేయండి Nāmnām akāri bahudhā nija-sarva-śaktiḥ tatrārpitā niyamitaḥ smaraṇe na kālaḥ ( CC Antya 20.16 Śikṣāṣṭaka 2) ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఆదేశం, భగవంతుని నామము భగవంతుడితో సమానము.