TE/Prabhupada 0892 - మీరు అదేశములను పాటించక పోతే, మీరు ఏ విధముగా శాశ్వత సేవకునిగా ఉంటారు



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


మీరు అదేశములను పాటించక పోతే, మీరు ఏ విధముగా శాశ్వత సేవకునిగా ఉంటారు?

ప్రభుపాద: ...మ్ మ్

భక్తుడు: మీరు ఎందుకంటే (అస్పష్టంగా) ఇక్కడ ఉన్న భక్తులు అందరు మీ శిష్యులు, శ్రీల ప్రభుపాద, శాశ్వత శిష్యులు, శాశ్వత సేవకులు. కానీ మనo తర్వాతి జన్మలో భౌతిక ప్రపoచoలో జన్మిoచాలoటే ఏమి చేయాలి? ఎలా మేము మీకు ప్రత్యక్ష సేవలను అందించగలము?

ప్రభుపాద: అవును. మీరు ఈ భౌతిక... ఉండిపోతే.. మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తి చేయకపోయినా, అయినప్పటికీ మీరు మంచి జన్మను పొందుతారు. Śucīnāṁ śrīmatāṁ gehe yoga-bhraṣṭoḥ sanjāyate ( BG 6.41) కృష్ణ చైతన్యమున్ని పూర్తిచేయడంలో వైఫల్యము చెందిన వ్యక్తి, తర్వాత ఆయనకు తదుపరి అవకాశం ఇవ్వబడుతుంది చాలా ధనవంతుల కుటుంబములో లేదా చక్కని, పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబములో, అందువల్ల ఆయన మరోసారి కృష్ణ చైతన్యమును పెంపొందించుకోవడానికి మరొక అవకాశము పొందగలడు "

భక్తుడు: అయితే ఇది మరొక గురువు నుండి దీక్ష తీసుకోవడమ? లేదా అతడు మీకు శాశ్వత సేవకుడుగా ఉంటాడా?

మధుద్విస: ఆయన ప్రశ్న మేము మీ నుండి దీక్ష తీసుకున్నప్పుడు మేము మీ శాశ్వత సేవకులము అయ్యాము అని మేము అర్థం చేసుకున్నాము.

ప్రభుపాద: అవును.మధుద్విసా:మేము మరొక జన్మను తీసుకోవలసి వచ్చినట్లయితే...

ప్రభుపాద: మీరు ఆదేశములను శాశ్వతంగా పాటిస్తూ ఉంటే... మీరు ఉపదేశమును పాటించకపోతే, మీరు శాశ్వతంగా ఎలా ఉంటారు? మీరు ఈ స్థితిలో ఉండవలసి ఉంది. అప్పుడు శాశ్వతముగా మీరు సురక్షితంగా ఉంటారు మీరు ఈ స్థితి నుండి పతనము అయితే, అది మీ తప్పు. ఉదాహరణకు మనము అందరము వైకుంఠా లోకము లో ఉన్నాము. ఇప్పుడు, మనము ఈ భౌతిక ప్రపంచమును ఆనందించాలని కోరుకున్నాను. మనము జయ-విజాయల లాగానే పతనము అయినాము ఇప్పుడు మనం తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం చెప్తున్నాము, "భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళండి."

కాబట్టి ప్రతిదీ ఉంది... పద్ధతి ఉంది. మీరు పద్ధతిని అనుసరిస్తే, మీరు తిరిగి వెళ్తారు. మీరు పతనము అయితే, అది మన తప్పు. అందువల్ల జీవితం తపస్యా కోసం ఉద్దేశించబడింది, అది ఋషభ దేవునియొక్క ఆదేశం, మన జీవితం కుక్కలు పందులు వలె వ్యర్థము చేయడానికి కాదు. ఇది తపస్యా కోసం ఉపయోగించాలి, మన స్థితిని అర్ధము చేసుకోవడానికి. Tapo putrakā yena śuddhyed sattva ( SB 5.5.1) ఈ జీవితం యొక్క లక్ష్యం. మన జీవితముని పవిత్రము చేసుకోవాలి ప్రస్తుత క్షణం లోమన జీవితము అపవిత్రముగా ఉంది. అందువలన మనం జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధికి గురి అవుతున్నాము మనము పవిత్రమైన వెంటనే, ఈ నాలుగు భౌతిక చట్టాలకు గురి కాము

చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.

భక్తులు: హరే కృష్ణ, జయ!