TE/Prabhupada 0895 - భక్తుడు చాలా ప్రమాదకరమైన స్థితిని దుఃఖకరమైన పరిస్థితిగా తీసుకోడు. ఆయన స్వాగతిస్తాడు



730417 - Lecture SB 01.08.25 - Los Angeles


భక్తుడు చాలా ప్రమాదకరమైన స్థితిని దుఃఖకరమైన పరిస్థితిగా తీసుకోడు. ఆయన స్వాగతిస్తాడు కావున మీరు ఈ నాలుక కలిగి ఉన్నారు. మీరు కీర్తన చేయవచ్చు కృష్ణ, హరే కృష్ణ కీర్తన చేయవచ్చు వెంటనే మీరు కృష్ణునితో సన్నిహిత సంబంధము కలిగి ఉంటారు. తక్షణమే. ఎందుకంటే కృష్ణుని నామము , కృష్ణుడు అనే వ్యక్తి భిన్నమైన వాడు కాదు. ఒకటే. కావున కృష్ణుడు దూరముగా ఉన్నాడు , దూరముగా... కృష్ణుడు చాలా దూరం కాదు. కృష్ణుడు మీలో ఉన్నాడు. ఆయన దూరముగా లేడు. ఆయన దూరంగా ఉన్నాడు, అదే సమయంలో అత్యంత దగ్గరగా ఉన్నాడు. కావున కృష్ణుడు చాలా దూరంలో ఉన్నాడని అనుకుంటే, ఆయన నామము కూడా ఉంది. మీరు హరే కృష్ణ కీర్తన చేస్తే, కృష్ణుడు వెంటనే అందుబాటులోకి వస్తాడు. Aniyamitaḥ. సత్వర మార్గంలో కృష్ణుడిని అందుబాటులో ఉంచడానికి, కఠినమైన నియమములు లేవు. మీరు ఎప్పుడైనా కీర్తన చేయవచ్చు. వెంటనే మీరు కృష్ణుడిని పొందుతారు. కృష్ణుడి యొక్క దయను చూడండి.

అందువల్ల చైతన్య మహా ప్రభు చెప్పినారు: etādṛśī tava kṛpā. నా ప్రియమైన ప్రభు, నాకు మిమ్మల్ని సంప్రదించడానికి చాలా మంచి సౌకర్యాలు ఇచ్చారు, కానీ durdaiva, కానీ నా, నేను దురదృష్టవంతుడవుతున్నాను, ఈ విషయాల కోసం నాకు ఎటువంటి అనుబంధం లేదు. నాకు ఆసక్తి లేదు. నేను ఇతర విషయాల కోసం చాలా ఆసక్తిని కలిగి వున్నాను. కానీ నేను హరే కృష్ణ కీర్తన చేయడానికి నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఇది నా దురదృష్టం. " కృష్ణుడు చాలా సౌకర్యాలను ఇచ్చాడు, ఆయన మీ ముందు ఉన్నాడు, ఆయన నామము యొక్క ఆధ్యాత్మిక తరంగముల ద్వారా కృష్ణుడి నామము అన్ని శక్తులు కలిగి ఉన్నాయి. మీరు నామముతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీరు కృష్ణుడి వరము యొక్క ప్రయోజనమును పొందుతారు, కానీ ఇప్పటికీ, నేను హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయడానికి ఇష్టపడటము లేదు. ఇది దురదృష్టం.

కాబట్టి ఒక భక్తుడు చాలా కష్టముగా ఉన్న పరిస్థితిని లేదా చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ప్రమాదకరమైన పరిస్థితిగా తీసుకోడు. ఆయన స్వాగతిస్తాడు. ఎందుకంటే శరణాగతి పొందినవాడు, ఆయనకు తెలుసు ప్రమాదం లేదా పండుగ, ఇవి అన్ని కృష్ణుని యొక్క విభిన్నమైన ప్రదర్శన. కృష్ణుడు సంపూర్ణుడు. శాస్త్రంలో, రెండు రకాలు ఉన్నాయి, రెండు వైపులా, ధార్మికము మరియు అధార్మికము, కేవలం వ్యతిరేకం. కానీ శాస్త్రములో ధర్మము కేవలం భగవంతుని యొక్క ముందు భాగం అని చెప్పబడింది, అధార్మికత భగవంతుని యొక్క వెనుక భాగము అని చెప్పబడినది. కాబట్టి భగవంతుని ముందు భాగం లేదా వెనుక భాగం, ఏమైన తేడా ఉందా? భగవంతుడు సంపూర్ణుడు. అందువలన ఒక భక్తుడు, సంపదలో ఉన్నా లేదా ప్రమాదంలో ఉన్నా, ఆయన కలత చెందడు. ఆయనకు తెలుసు ఇద్దరు కృష్ణుడే అని. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ... "ఇప్పుడు కృష్ణుడు నా ముందు ప్రమాద రూపంలో ఆవిర్భవించారు."

ఉదాహరణకు హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాద మహారాజు మరియు నరసింహ స్వామి వలె. నరసింహ స్వామి హిరణ్య కశిపునికి ప్రమాదము అదే వ్యక్తి ప్రహ్లాద మహారాజుకు, ఆయన మహోన్నతమైన మిత్రుడు. అదేవిధముగా భగవంతుడు, ఎన్నడూ భక్తునికి ప్రమాదకరం కాడు. భక్తుడు ప్రమాదాలకు భయపడడు. ఆయన ప్రమాదం, అది భగవంతుడు మరొక లక్షణం అని ధైర్యముగా ఉంటాడు. నేను ఎందుకు భయపడాలి? నేను ఆయనకు శరణాగతి పొందాను. కాబట్టి కుంతీదేవి చెప్తుంది: vipadaḥ santu. Vipadaḥ santu tāḥ śaśvat. ఎందుకనగా, ఆయన లేదా ఆమెకు తెలుసు ప్రమాదము ఉన్నప్పుడు కృష్ణుని ఎలా గుర్తుకు తెచ్చుకోవాలో వారికి తెలుసు. అందువలన ఆయన, ఆమె ప్రమాదాన్ని స్వాగతిస్తున్నారు . నా ప్రియమైన ప్రభు, నేను మిమ్మల్ని గుర్తుంచుకోగలిగినప్పుడు అలాంటి ప్రమాదాలను నేను స్వాగతిస్తాను. ఉదాహరణకు ప్రహ్లాద మహా రాజు లాగానే , ఆయన ఎప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన తండ్రి ఆయనని ప్రమాదకరమైన స్థితిలో ఉంచుతున్నప్పుడు. కాబట్టి మిమ్మల్ని ప్రమాదకరమైన స్థానములో పెట్టి ఉంటే, ఆ ప్రమాదకరమైన పరిస్థితి కృష్ణుడిని గుర్తుంచుకోవడానికి ప్రేరణను ఇస్తుంది, అది స్వాగతం . అది స్వాగతం. ఓ, నేను కృష్ణుని జ్ఞాపకం తెచ్చుకునే అవకాశాన్ని పొందుతున్నాను. కాబట్టి ఎలా స్వాగతం అవుతుంది? ఇది స్వాగతము అవుతుంది ఎందుకంటే కృష్ణుడిని చూడటము అంటే నేను ఈ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతున్నాను, ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల వలన నేను ఇంక ఏ మాత్రము బాధపడను