TE/Prabhupada 0903 - ఆ మత్తు వదలగానే, మీరు మత్తులో కన్న కలలు అన్ని ముగిసిపోతాయి



730418 - Lecture SB 01.08.26 - Los Angeles


ఆ మత్తు వదలగానే, మీరు మత్తులో కన్న కలలు అన్ని ముగిసిపోతాయి అనువాదం: "నా ప్రభు, మిమ్మల్ని చాలా సులభంగా చేరుకోవచ్చు, కానీ భౌతికముగా విసిగిపోయిన వారు మాత్రమే. భౌతిక పురోగతి మార్గంలో ఉన్నవాడు తనను మెరుగు పర్చడానికి ప్రయత్నిస్తాడు గౌరవనీయమైన తల్లిదండ్రులతో, గొప్ప ఐశ్వర్యముతో, ఉన్నత విద్య మరియు శారీరక అందంతో, యథార్థ భావనలతో మిమ్మల్ని చేరుకోలేరు."

ప్రభుపాద: కాబట్టి ఈ అనర్హతకు ప్రశ్నలు. భౌతిక ఐశ్వర్యములు, ఈ విషయాలు... జన్మ, చాలా కులీన కుటుంబం లేదా దేశంలో పుట్టుక. మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు, బాలికలు, మీరు గొప్ప తండ్రి, తల్లి, జాతి లో జన్మించారు. కాబట్టి ఇది, ఒక విధంగా, అది భగవంతుని కృప. అది కూడా... మంచి కుటుంబంలో లేదా చక్కని దేశంలో జన్మించడము, చాలా సంపన్నులము అవ్వటము, చాలా ధనము కలిగి ఉండటము, విజ్ఞానం, విద్య, అన్ని, అన్ని అంశాలలో అధునాతనము అవ్వటము. అందం, ఇవి పవిత్ర కార్యక్రమాల యొక్క బహుమతులు. లేకపోతే, ఎందుకు ఒక పేద మనిషి, ఆయన ఎవరి దృష్టిని ఆకర్షించ లేడు? కానీ ధనవంతుడు ఆకర్షిస్తాడు. చదువుకున్న వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఒక దుష్టుడు, మూర్ఖుడు, ఎవరి దృష్టిని ఆకర్షించడు. అదే విధముగా అందంతో, ఐశ్వర్యముతో, ఈ విషయాలు భౌతికముగా చాలా లాభదాయకంగా ఉంటాయి. Janmaiśvarya-śruta ( SB 1.8.26)

కానీ ఒక వ్యక్తి ఈ విధముగా సంపన్నంగా ఉన్నప్పుడు, ఆయన మత్తులో ఉంటాడు. నేను గొప్ప వ్యక్తి. నేను చదువుకున్న వ్యక్తిని. నాకు డబ్బు ఉంది. మత్తుగా మారుతాడు. అందువలన మనం సలహా ఇస్తున్నాము... ఎందుకంటే వారు ఇప్పటికే ఈ ఆస్తుల మత్తులో ఉన్నారు. మరలా మత్తుమందు? అప్పుడు, ప్రకృతి ద్వారా, ఈ ప్రజలు ఇప్పటికే మత్తులో ఉన్నారు. ఈ కోణంలో మత్తులో ఉండటము... ఉదాహరణకు మీరు వైన్ త్రాగితే, మీరు మత్తులో ఉంటారు. మీరు ఆకాశంలో ఎగురుతున్నారు. మీరు ఇలా ఆలోచిస్తున్నారు. మీరు స్వర్గమునకు వెళ్ళారు. అవును. కావున ఇవి మత్తు యొక్క ప్రభావాలు. కానీ ఈ మత్తులో ఉన్న వ్యక్తికి, ఈ మత్తు వదలిపోతుందని ఆ వ్యక్తికి తెలియదు. ఇది సమయ పరిధిలో ఉంది. ఇది కొనసాగుతుందని కాదు. ఇది భ్రాంతి అంటారు. ఒకటి మత్తు, "నేను చాలా ధనవంతుడను. అని నేను చాలా చదువుకున్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా కలిగి ఉన్నాను... నేను ఉన్నత కుటుంబములో, ఉన్నత దేశములో జన్మించాను. " పర్వాలేదు. కానీ ఈ మత్తు, ఎంతకాలం ఉంటుంది?

మీరు అమెరికన్ అని అనుకుందాం. మీరు ధనవంతులు, మీరు అందమైనవారు. మీరు జ్ఞానములో ఉన్నత స్థానములో ఉన్నారు, మీరు, మీరు అమెరికన్ అయ్యరని గర్వపడవచ్చు. కానీ ఎంతకాలం ఈ మత్తు ఉంటుంది? ఈ శరీరం పూర్తయిన వెంటనే, ప్రతిదీ ముగుస్తుంది. అన్నీ , మత్తు అంతా. ఉదాహరణకు... అదే విషయము. మీరు ఏదో త్రాగుతారు, మత్తులో ఉంటారు. కానీ ఆ మత్తు ముగిసిన వెంటనే, మీరు మత్తులో ఉన్నప్పుడు కన్న కలలన్నీ ముగిసిపోతాయి. ముగిసిపోతాయి కావున ఈ మత్తు, మీరు మత్తులో ఉన్నట్లయితే, ఆకాశంలో తిరుగుతూ మరియు మానసిక స్థితిలో... ఈ మానసిక స్థితి, అహంభావ స్థితి. శరీర స్థితి.

కానీ మీరు ఈ శరీరం కాదు, ఈ స్థూల శరీరం కాదు మరియు సూక్ష్మ శరీరం కాదు. ఈ స్థూల శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, ద్వారా తయారు చేయబడినది సూక్ష్మ శరీరము మనస్సు, బుద్ధి మరియు అహంతో చేయబడింది. కానీ మీరు ఈ ఎనిమిది మూలకాలకు చెందినవారు కాదు, అపరేయం. భగవద్గీతలో. ఇది భగవంతుని యొక్క న్యూనశక్తి. ఎవరైనా మానసికంగా చాలా ఉన్నత స్థానములో ఉన్నప్పటికీ, ఆయన న్యూనశక్తి యొక్క ప్రభావములో ఉన్నాడు అని తెలియదు. ఆయనకి తెలియదు. అది మత్తు. ఉదాహరణకు మత్తులో ఉన్న వ్యక్తికి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆయనకు తెలియదు. ఈ సంపన్న స్థితి మత్తును కలిగిస్తుంది. మీరు మీ మత్తుని పెంచుకుంటూ ఉంటే... ఆధునిక నాగరికత మనం ఇప్పటికే మత్తులో ఉన్నాము మరియు ఇంకా మత్తుని పెంచుతున్నాం. మనము మత్తు పరిస్థితి నుండి బయటపడాలి, కానీ ఆధునిక నాగరికత పెరుగుతోంది, "మీరు మరింత మత్తులోకి వెళ్ళుతున్నారు, మరింత మత్తులోకి వెళ్ళుతున్నారు, నరకానికి వెళ్ళుతున్నారు." ఇది ఆధునిక నాగరికత యొక్క పరిస్థితి.