TE/Prabhupada 0910 - ఎల్లప్పుడూ కృష్ణుని నిర్దేశమును పాటించడానికి ప్రయత్నించవలెను. అది విజయవంతమైన జీవితం



730419 - Lecture SB 01.08.27 - Los Angeles


మనము ఎల్లప్పుడూ కృష్ణుని నిర్దేశమును పాటించడానికి ప్రయత్నించవలెను. అది విజయవంతమైన జీవితం ప్రభుపాద: కృష్ణుని శరీరము మరియు ఆత్మకు మధ్య ఎటువంటి తేడా లేదు. ఆయన కేవలం ఆత్మ, ఆత్మ. మనం ఈ శరీరము మరియు ఆత్మ కలిగి ఉన్నాము. నేను ఆత్మను, కానీ నేను ఈ శరీరం కలిగి ఉన్నాను. ఎప్పుడైతే మనము కృష్ణునిపై ఆధారపడతామో , కృష్ణుడు స్వయముగా సంతృప్తి చెందుతాడో, అదేవిధముగా మనము కృష్ణుడితో కూడా తృప్తి చెందగలము. Kaivalya, kaivalya-pataye namaḥ ( SB 1.8.27) మాయావాది తత్వవేత్తలు, వారు, అద్వైతవాదులు, వారు మహోన్నతమైన వానితో ఒకటి కావాలని అనుకుంటారు. భగవంతుడు ఆత్మ సంతృప్తిని చెందినట్లుగా, వారు కూడా ఆత్మ సంతృప్తిని చెందుటకు భగవంతునితో ఒకటి కావాలని కోరుకుంటున్నారు. మన తత్వము కూడా అదే, కైవల్య. కానీ మనము కృష్ణుడిపై ఆధారపడతాము. మనము కృష్ణుడితో ఒకటి కాము ఒకటి కాము. అది ఒకటి. మనము కృష్ణుడి యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటే, ఏకాభిప్రాయం లేదు, అది ఏకత్వం.

ఈ మాయావాది తత్వవేత్తలు, వారు ఇలా భావిస్తారు: ఎందుకు నేను నా వ్యక్తిగత, ప్రత్యేక ఉనికిని ఎందుకు ఉంచుకోవాలి? నేను విలీనం అవుతాను... "అది సాధ్యం కాదు. మనము సృష్టించబడినందున... సృష్టించబడలేదు, ప్రారంభం నుండి మనము వేరే భాగం. మనము వేరే భాగము. అందువల్ల కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు: నా ప్రియమైన అర్జునా, నీవు, నేను, ఈ యుద్ధరంగంలో సమావేశమయిన ఈ వ్యక్తులందరూ, మనము గతములో వ్యక్తులుగా ఉన్నాము. మనము, ప్రస్తుతం, వ్యక్తులము, భవిష్యత్తులో, మనము వ్యక్తులగానే ఉంటాము. మనము అందరము వ్యక్తులము. " Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఆయన మహోన్నతమైన నిత్య, అనేకమంది అసంఖ్యాక జీవ శక్తులలో మహోన్నతమైన జీవశక్తి. మనము, జీవులము, అసంఖ్యా, అనంతం. మనము ఎంతమందో లెక్క లేదు. Sa anantyāya kalpate. ఈ అనంత, అసంఖ్యాక జీవులు, కృష్ణుడు కూడా జీవి, కానీ ఆయన ప్రధానుడు. అది తేడా. నిత్య నిత్యానం...

ఉదాహరణకు నాయకుడు ఉన్నట్లుగానే. నాయకుడు ఒక్కడే, అనుచరులు, అనేక మంది ఉంటారు. అదేవిధముగా కృష్ణుడు మహోన్నతమైన జీవశక్తి, మనము సేవకులము, ఆధారపడి ఉన్న జీవులము . అది తేడా. ఆధారపడి ఉన్నాము. కృష్ణుడు మనకు ఆహారాన్ని సరఫరా చేయకపోతే, మనము ఆకలితో ఉంటాము. అది సత్యము. మనము దేనిని ఉత్పత్తి చేయలేము. Eko yo bahūnāṁ vidadhāti kāmān. కావున కృష్ణుడు నిర్వహిస్తున్నాడు, మనము నిర్వహించబడుతున్నాము. అందువల్ల కృష్ణుడు నిర్దేశము చేసేవాడు, మనం నిర్దేశింపబడుతున్నాము ఇది మన సహజ స్వరూప స్థితి. కాబట్టి మనము ఈ భౌతిక ప్రపంచంలో తప్పుగా, నిర్దేశించే వారిగా కావాలని కోరుకుంటే, అది భ్రాంతి, దానిని మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాలి. మనము ఎల్లప్పుడు కృష్ణుడు చేత నిర్దేశింపబడే విధముగా ఉండాలి. ఇది విజయవంతమైన జీవితం. చాలా ధన్యవాదాలు. భక్తులు: హరిబోల్, కీర్తి అంతా ప్రభుపాదుల వారికి