TE/Prabhupada 0914 - కృష్ణుడి శక్తులలో ఒకటి పదార్థము, ఆత్మ మరొక శక్తి



730420 - Lecture SB 01.08.28 - Los Angeles


కృష్ణుడి శక్తులలో ఒకటి పదార్థము, ఆత్మ మరొక శక్తి

ప్రభుపాద: విభు అంటే మహోన్నతమైనది, గొప్పవాడు. విభు . మనము అణు, కృష్ణుడు, మనము చిన్నవారిమి , కృష్ణుడు గొప్పవాడు. కృష్ణుడు కూడా, ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగము. అందువలన కృష్ణుడు చిన్నవాడు మరియు అతి గొప్పవాడు కూడా. మనము కేవలం చిన్నవారిమి. కానీ కృష్ణుడు రెండూ. కృష్ణుడు, విభు, అందరికంటే గొప్పవాడు అంటే అన్ని కలిపి అని అర్థం. గొప్ప లో... మీ దగ్గర ఒక పెద్ద సంచి ఉంటే, మీరు చాలా వస్తువులను పెట్టుకోగలరు.చిన్న సంచిలో మీరు అలా చేయలేరు.

కాబట్టి కృష్ణుడు విభు . ఆయన సమయం, గతము, ప్రస్తుతము మరియు భవిష్యత్తు కలిగి ఉంటాడు. ఆయన ప్రతిదీ కలిగి ఉంటాడు, ఆయన ప్రతిచోటా ఉంటాడు అది విభు అంటే. విభు అంతా వ్యాప్తి చెంది ఉంటాడు. కృష్ణుడు అన్నిచోట్లా ఉన్నాడు. Aṇḍāntara-stha-paramāṇu-cayāntara-stham (BS 5.35). బ్రహ్మ-సంహితలో చెప్పబడింది. కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు లేకుండా, ఈ భౌతిక పదార్థము అభివృద్ధి చెందదు శాస్త్రవేత్తలు, నాస్తిక శాస్త్రవేత్తలు, వారు జీవితము భౌతిక పదార్థము నుండి బయటకు వస్తుంది అని చెప్తారు. అది అర్థంలేనిది. కాదు భౌతిక పదార్థము కృష్ణుని యొక్క శక్తి ఒక శక్తి, ఆత్మ మరొక శక్తి. ఆత్మ ఉన్నత శక్తి, భౌతిక పదార్థము అధమ శక్తి. ఉన్నత శక్తి ఉన్నప్పుడు భౌతిక పదార్థము అభివృద్ధి చెందుతుంది.

ఉదాహరణకు ఈ దేశం లాగానే, అమెరికా. అదే అమెరికా రెండు వందల సంవత్సరాల క్రితం, మూడు వందల సంవత్సరాల క్రితం, భూమి, కానీ అది అభివృద్ధి కాలేదు. కానీ ఐరోపా నుండి వచ్చిన కొందరు ఉన్నత జీవులు ఇక్కడకు వచ్చినారు, ఇప్పుడు అమెరికా ఎంతో అభివృద్ధి చెందింది. అందువల్ల అభివృద్ధికి కారణం ఉన్నత శక్తి. అధమ శక్తి, ఇప్పటికీ చాలా ఖాళీగా ఉన్న భూమి ఉంది. ఉదాహరణకు ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో వలె. అవి "అభివృద్ధి చెందనివి" అని పిలుస్తారు. ఎందుకు అభివృద్ధి చెందనివి? ఎందుకంటే ఉన్నత జీవ శక్తి, జీవి, అది తాకినందున. ఉన్నత శక్తి ఉన్న వెంటనే, జీవి వెంటనే తాకుతుంది, అదే భూమి చాలా కర్మాగారాలు, ఇళ్ళు, నగరాలు, రోడ్లు, కార్లు, ప్రతిదీ అభివృద్ధి చేస్తుంది, మనము అభివృద్ధి చేయవచ్చు.

అందువల్ల సారంశము ఏమిటంటే పదార్థము స్వయంగా అభివృద్ధి చేయలేదు. లేదు. అది సాధ్యం కాదు. ఉన్నత శక్తి దానిని తాకాలి. అప్పుడు, అది చురుకుగా ఉంటుంది. చాలా యంత్రాలు ఉన్నాయి. అంటే పదార్థము . అధమ శక్తి. ఒక యంత్రమును ఆపరేటర్ తాకనట్లయితే, అది పనిచేయదు. మొదటి తరగతి మోటార్ కారు, చాలా ఖరీదైన మోటారు కారు యంత్రం, కానీ ఒక డ్రైవర్ రాకపోతే, అది అక్కడ మిలియన్ల సంవత్సరాలు అక్కడే ఉంటుంది. ఉపయోగం లేదు. ఈ సాధారణ లౌకిక జ్ఞానము లోపించినది. ఉన్నత శక్తి, జీవి తాకనప్పుడు, భౌతిక పదార్థము స్వతంత్రంగా పనిచేయలేదు. ఇది సాధారణ లౌకిక జ్ఞానము. కాబట్టి ఈ మూర్ఖపు శాస్త్రవేత్తలు జీవితము భౌతికము పదార్థము నుండి అభివృద్ధి చెందుతుంది ఎలా చెబుతారు? లేదు ఎలా ముగించగలము? అలాంటి సంఘటనలు లేవు. వారు తప్పుగా చెప్తారు... వారికి తగినంత జ్ఞానం లేదు.

కాబట్టి ఈ విశ్వములు, అవి కూడా కృష్ణుడి యొక్క జీవితముని బట్టి వృద్ధి చెందాయి. అందుచే బ్రహ్మ-సంహిత చెప్పుతుంది: aṇḍāntara-stha-paramāṇu-cayāntara-s... వారు ఇప్పుడు అణువులను చదువుతున్నారు. చాలా విషయాలు జరుగుతున్నాయి, ఎలాక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఇది వాస్తవమునకు శాస్త్రము. కాబట్టి కృష్ణునికి గతము, వర్తమానము భవిష్యత్తు లేదు. ఆయన శాశ్వతమైన సమయం. ఆయనకు ప్రారంభము లేదు. ఆయనకు ముగింపు లేదు. ఆయన అందరికీ సమానం. Samaṁ carantam ( SB 1.8.28) కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి, కృష్ణుడిని చూడటానికి మనము సిద్ధపడ్డాము కనుక. అది కృష్ణ చైతన్యము యొక్క కర్తవ్యము.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ, కీర్తి అంతా శ్రీల ప్రభుపాదల వారికి