TE/Prabhupada 0918 - కృష్ణుడికి శత్రువు అవ్వడము చాలా లాభదాయకం కాదు. మంచి స్నేహితుడు అవ్వడము మంచిది



730421 - Lecture SB 01.08.29 - Los Angeles


కృష్ణుడికి శత్రువు అవ్వడము చాలా లాభదాయకం కాదు. మంచి స్నేహితుడు అవ్వడము మంచిది కాబట్టి, ఇక్కడ చెప్పబడింది: na veda kaścid bhagavaṁś cikīrṣitam ( SB 1.8.29) ఎవరికీ మీ అవతారము మరియు అంతర్థానము యొక్క ప్రయోజనము ఏమిటో తెలియదు. ఎవరికీ తెలియదు. కావున tava, tava īhamānasya nṛṇāṁ viḍambanam ( SB 1.8.29) ఇది ఆశ్చర్యముగా ఉంది. వాస్తవమైన ప్రయోజనము ఏమిటో ఎవరూ అర్థం చేసుకోలేరు. వాస్తవమైన ప్రయోజనము ఆయన స్వేచ్ఛా సంకల్పం. "నేను వెళ్లి చూస్తాను." ఆయన రాక్షసులను చంపడానికి రావలసిన అవసరం లేదు. చాలా మంది ప్రతినిధులు ఉన్నారు, ఒక బలమైన గాలి ఉంటే, వేలాది మంది రాక్షసులను ఒక క్షణములో చంపవచ్చు. కాబట్టి కృష్ణుడు రాక్షసులను చంపడానికి రావలసిన అవసరం లేదు. భక్తులకు రక్షణ కల్పించటానికి కూడా ఆయన రావలసిన అవసరం లేదు. కేవలం ఆయన సంకల్పము వలన, ప్రతిదీ ఉంది. కానీ ఆయన ఒక ఆనందం లీల చేస్తాడు, "నేను వెళ్ళి చూస్తాను."

కొన్నిసార్లు ఆయన పోరాడాలనుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడిలో పోరాట స్పూర్తి కూడా ఉంది. లేకపోతే, మనకు ఎక్కడ నుంది వస్తుంది? ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగం కనుక, కృష్ణుడి యొక్క అన్ని లక్షణాలు కొద్దిగా ఉంటాయి, అవి మన లోపల ఉన్నాయి. మనము కృష్ణుడి యొక్క నమూనా, కానీ, ఈ పోరాట స్పూర్తి ఎక్కడ నుండి మనకు లభిస్తుంది? కృష్ణుడిలో పోరాట స్పూర్తి ఉంది. అందువలన, ఉదాహరణకు కొన్నిసార్లు ఒక గొప్ప మనిషి లేదా రాజులు, వారు పోరాడటానికి కొందరు మల్లయోధులను ఉపయోగిస్తారు. వారు, వారు రాజుతో పోరాడటానికి మల్లయోధునికి చెల్లిస్తారు. కానీ ఆయన శత్రువు కాదు. అతడు పోరాడటం ద్వారా, రాజుకు ఆనందం ఇస్తాడు. నకిలీ పోట్లాడటము

అదేవిధముగా, కృష్ణుడు పోరాడాలని కోరుకున్నప్పుడు, ఎవరు ఆయనతో పోరాడతారు? ఆయన భక్తులలో కొందరు, గొప్ప భక్తుడు ఆయనతో పోరాడుతాడు. సాధారణ భక్తుడు కాదు. ఉదాహరణకు ఒక రాజు వలె, ఆయన సాధన చేయాలనుకుంటే, నకలీ పోరాటము ఎవరో ఎంతో ఉన్నతమైన యోధుడు, మల్లయోధుడును నిమగ్నము చేస్తాడు అదేవిధముగా... ఇది కూడా సేవ. ఎందుకంటే కృష్ణుడు పోరాడాలని కోరుకుంటున్నాడు, అందువలన ఆయన భక్తులలో కొందరు ఇక్కడకు వస్తారు, ఆయనకు శత్రువుగా ఉండడానికి. ఉదాహరణకు జయ-విజయులు లాగానే. ఈ హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుని వలె. వారు సాధారణ జీవులని మీరు భావిస్తున్నారా? ఆ... ఆ... నరసింహ స్వామి, భగవంతుడు తనకు తానుగా చంపడానికి వచ్చాడు. వారు సాధారణమని మీరు అనుకుంటున్నారా? లేదు, వారు సాధారణమైన వారు కాదు. వారు భక్తులు. కానీ కృష్ణుడు పోరాడాలని కోరుకున్నాడు. వైకుంఠ లోకములో పోరాడుటకు అవకాశం లేదు, ఎందుకంటే ప్రతీ చోట అక్కడ అక్కడ అందరూ కృష్ణుడి సేవలో వినియోగించబడి ఉన్నారు. ఎవరితో ఆయన పోరాడతాడు? (నవ్వు) అందువలన కొందరి భక్తులను శత్రువు రూపములో పంపిస్తాడు కృష్ణుడు ఆయనతో పోరాడటానికి ఇక్కడకు వస్తాడు.

అదే సమయంలో, మనకు నేర్పడానికి, శత్రువుగా మారడము కృష్ణుడికి శత్రువుగా మారడము చాలా లాభదాయకం కాదు. స్నేహితుడు అవ్వడము మెరుగైనది. అది లాభదాయకంగా ఉంటుంది. (నవ్వు) అందువలన చెప్పబడింది: na veda kaścid bhagavaṁś cikīrṣitam ( SB 1.8.29) ఎవరికీ మీ అవతారము మరియు అంతర్థానము యొక్క ప్రయోజనము ఏమిటో తెలియదు Tava īhamānasya nṛṇāṁ viḍambanam. మీరు సాధారణ మానవునిలాగా ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇది ఆశ్చర్యము కలుగ చేస్తుంది. "కాబట్టి సాధారణ మనిషి విశ్వసించడు. భగవంతుడు ఎలా సాధారణ వ్యక్తిగా మారతాడు...? కృష్ణుడు ఆడుతున్నారు. ఆయన సాధారణ వ్యక్తిగా వ్యవహరించడము లేదు. ఆయన భగవంతునిగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడైతే అవసరము ఉందో...

ఉదాహరణకు ఆయన 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకున్నప్పుడు ఆయన ఒకడు, 16,000 మంది అమ్మాయిలు కృష్ణుడికి శరణాగతి పొందుతాము అని అన్నప్పుడు: ఇప్పుడు మేము అపహరించబడ్డాము. మేము ఇంటికి వెళ్లినట్లయితే, ఎవరూ మమ్మల్ని వివాహం చేసుకోరు. అది కఠినమైన వేదముల పద్ధతి. ఒక పెళ్లి కానీ అమ్మాయి ఒక్క రాత్రి అయినా ఇంటి నుండి వెళ్లిపోతే, ఎవరూ ఆమెను వివాహం చేసుకోరు. ఇప్పటికీ అది జరగబోతోంది. ఎవరూ వివాహం చేసుకోరు. కాబట్టి ఇది పాత పద్ధతి. భౌమాసురునిచే 16,000 మంది బాలికలు అందరూ అపహరించ బడ్డారు ... అందువల్ల వారు కృష్ణుడిని ప్రార్థించారు కృష్ణుడి వచ్చి, భౌమాసురుడిని చంపి, బాలికలందరికీ విముక్తి చేశాడు. అందువల్ల కృష్ణుడు వారిని అడిగినప్పుడు: "మీరు ఇప్పుడు మీ తండ్రి ఇంటికి సురక్షితంగా వెళ్ళవచ్చు." వారు ఇలా జవాబిచ్చారు: "అయ్యా, మేము తిరిగి మా తండ్రి ఇంటికి వెళ్లినట్లయితే, మా గతి ఏమిటి? ఎవరూ మమ్మల్ని పెళ్లి చేసుకోరు. ఎందుకంటే ఈ మనిషి, ఈ రాక్షసుడు, వాడు మమ్మల్ని అపహరించాడు. " అప్పుడు మీకు ఏమి కావాలి? "మీరు మా భర్త కావాలని మేము కోరుకుంటున్నాము." కాబట్టి కృష్ణుడు చాలా దయ కలిగి ఉన్నాడు. "అవును." తక్షణమే ఆమోదించినాడు. అది కృష్ణుడు అంటే.

ఇప్పుడు, వారిని 16,000 మంది భార్యలను ఇంటికి తీసుకువచ్చినప్పుడు కృష్ణుడిని కలవడానికి 16,000 రాత్రులు వేచి ఉండవలసి ఉంటుందా. (నవ్వు) కృష్ణుడు 16,000 రూపాల్లో తనను తాను విస్తరించాడు, 16,000 రాజప్రాసాదాలను, స్థాపించాడు...ప్రతి ఒక్క అంతఃపురంలో ఆ వివరణ ఉంది... ఇది భగవంతుడు అంటే. కాబట్టి ఆ మూర్ఖులకు, వారు అర్థం చేసుకోలేరు. వారు కృష్ణుడిని విమర్శిస్తారు, ఆయన చాలా కామము కలిగిన వాడు అని. ఆయన 16,000 భార్యలను వివాహం చేసుకున్నాడు. (నవ్వు) ఆయనకు కామము ఉన్నప్పటికీ, ఆయన అపరిమితమైన కామము కలిగిన వాడు. (నవ్వు) ఎందుకంటే ఆయన అపరిమితమైన వాడు. ఎందుకు 16,000? ఆయన 16 కోట్ల భార్యలను వివాహం చేసుకున్నప్పటికీ, అది అసంపూర్ణము. అది కృష్ణుడు అంటే