TE/Prabhupada 0934 - ఆత్మ యొక్క అవసరాలను పట్టించుకోవలసిన అవసరము లేదు, అది మూర్ఖపు నాగరికత



Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972


ఆత్మ యొక్క అవసరాలను పట్టించుకోవలసిన అవసరము లేదు, అది మూర్ఖపు నాగరికత భక్తుడు: అనువాదం: "ఇతరులు వసుదేవుడు మరియు దేవకీ మీ కోసం ప్రార్ధించినందువలన, మీరు వారి కొడుకుగా జన్మ తీసుకున్నారు. నిస్సందేహంగా మీరు జన్మించ లేదు, అయినా మీరు వారి శ్రేయస్సు కోసం మీరు జన్మ తీసుకున్నారు మరియు దేవతల పట్ల అసూయ కలిగిన వారిని చంపేయడానికి. " ప్రభుపాద: అందువల్ల అవతారము తీసుకోవడానికి రెండు ప్రయోజనములు ఉన్నాయి. ఇది భగవద్గీతలో చెప్పబడింది.

Yadā yadā hi dharmasya
glānir bhavati bhārata
abhyutthānam adharmasya
tadātmānaṁ sṛjāmy aham
( BG 4.7)

భగవంతుడు చెప్పారు అవకతవకలు ఉన్నప్పుడు, dharmasya, ధర్మము పాటించడములో అవకతవకలు ఉన్నప్పుడు... Glāniḥ. గ్లాని అంటే అవకతవకలు అని అర్థం. ఉదాహరణకు మీరు కొన్ని సేవలను అమలు చేస్తున్నట్లుగానే. కొన్ని అవకతవకలు ఉండవచ్చు. అప్పుడు అది కలుషితమవుతుంది. కావున yadā yadā hi dharmasya glānir bhavati... Dharmasya glānir Bhawati అర్థం అధర్మము పెరిగినప్పుడు అని అర్థం. అనగా, మీ సంపద క్షీణించినట్లయితే, అప్పుడు మీ పేదరికం పెరుగుతుంది, సమతుల్యం అవుతుంది. మీరు ఈ పక్కను పెంచితే, రెండో వైపు పెరుగుతుంది, మీరు ఈ ప్రక్క పెంచితే, మరో వైపు... కానీ మీరు బ్యాలన్స్ గా ఉంచాలి. అది అవసరం.

కాబట్టి మానవ సమాజంలో, వారు బ్యాలన్స్ గా ఉండడానికి ఉద్దేశించబడ్డారు. ఆ బ్యాలన్స్ అంటే ఏమిటి? వారికి తెలియదు అది... ఇది బ్యాలన్స్ వలె ఉంది. ఒక వైపు ఆత్మ, మరొక వైపు విషయము. మనము ఇప్పుడు, నిజానికి, మనం ఆత్మలము. ఎట్లాగైతేనే మనము ఈ శరీరం, భౌతికము శరీరం లోపల ఉంచబడ్డాము. ఆ ఉద్దేశ్యంతో, ఎంత కాలము మనకు ఈ శరీరం ఉందో, మనము శరీరం యొక్క అవసరాలు కలిగి ఉంటాము, తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము, రక్షించుకోవటము. ఇవి శరీరం యొక్క అవసరాలు. ఆత్మకు ఈ విషయాలు అవసరం లేదు. ఆత్మకు తినడానికి ఏమీ లేదు. అది మనకు తెలియదు. మనం తినేది ఏమైనా, అంటే అది, ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడము. కావున శరీర అవసరాలు ఉన్నాయి, కానీ మీరు కేవలం శరీర అవసరాలు కొరకు మాత్రమే చూస్తే ఆత్మ యొక్క అవసరాలను చూసుకోవటానికి పట్టించుకోకపోతే, అది మూఢ నాగరికత. బ్యాలెన్సు లేదు. వారికి తెలియదు.

ఉదాహరణకు ఒక మూర్ఖని వలె ... ఆయన కేవలం కోటును శుభ్రము చేయుచున్నాడు, కానీ శరీరం యొక్క శ్రద్ధ వహించడు. లేదా ఒక పక్షి పంజరములో ఉంది మీరు పంజరము యొక్క శ్రద్ధ వహించక పోతే పంజరం లోపల పక్షి మీద శ్రద్ధ వహించక పోతే... పక్షి ఏడుస్తున్నది: "కా కా, నాకు ఆహారం ఇవ్వండి, నాకు ఆహారం ఇవ్వండి." కానీ మీరు పంజరము యొక్క జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇది మూర్ఖత్వం. ఎందుకు మనము సంతోషంగా లేము? ఎందుకు, ముఖ్యంగా మీ దేశంలో... మీరు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా భావిస్తున్నారు. మీకు కొరత లేదు. ఆహార కొరత లేదు, మోటార్ కారు కొరత లేదు, బ్యాంకు సంతులనం కొరత లేదు, సెక్స్ కొరత ఉండదు. అంతా పూర్తిగా, సమృద్ధిగా ఉంది. ఇప్పటికీ ఎందుకు ఒక విభాగం ప్రజలు హిప్పీలు వలె విసుగు మరియు గందరగోళముగా ఉన్నారు? వారు సంతృప్తి చెందలేదు. ఎందుకు? అది లోపము. ఎందుకంటే బ్యాలన్స్ లేనందున. మీరు జీవితంలో శరీర అవసరాలకు శ్రద్ధ వహిస్తున్నారు, కానీ మీకు ఆత్మ యొక్క ఏ సమాచారం లేదు. ఆత్మ యొక్క అవసరము కూడా ఉంది. ఎందుకంటే ఆత్మ వాస్తవమైన విషయము. శరీరము కప్పబడి ఉంది. అంతే