TE/Prabhupada 0937 - కాకి హంస దగ్గరకు వెళ్లదు. హంస కాకి దగ్గరకి వెళ్లదు



730425 - Lecture SB 01.08.33 - Los Angeles


కాకి హంస దగ్గరకు వెళ్లదు. హంస కాకి దగ్గరకి వెళ్లదు కావున జంతువులలో కూడా ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి. హంస తరగతి మరియు కాకుల తరగతి. సహజ విభజన. కాకి హంస దగ్గరకు వెళ్లదు. హంస కాకి దగ్గరకు వెళ్ళదు. అదేవిధముగా మానవ సమాజంలో, కాకి తరగతి వ్యక్తులు ఉన్నారు మరియు హంస తరగతి వ్యక్తులు ఉన్నారు. హంస తరగతి వ్యక్తులు ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ స్పష్టంగా ఉంది, బాగుంది. మంచి తత్వము, మంచి ఆహారం, మంచి విద్య, మంచి దుస్తులు, మంచి మనస్సు, ప్రతిదీ మంచిది. కాకి తరగతి వ్యక్తులు అలాంటి మరియు అటువంటి క్లబ్కు వెళ్తారు, అటువంటి పార్టీలకు వెళ్తారు, నగ్న నృత్యములకు, చాలా విషయాలు. మీరు చూడండి?

కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యక్తులు హంస తరగతి వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. కాకి తరగతి వ్యక్తుల కోసము కాదు. కాదు కానీ మనము కాకులను హంసలగా మార్చగలము. అది మన తత్వము. ఎవరైతే కాకిలా ఉన్నారో వారు ఇప్పుడు హంస లాగా ఈదుతున్నారు అది మనము చేయగలము. ఇది కృష్ణ చైతన్యము యొక్క ప్రయోజనము కాబట్టి హంసలు కాకులుగా మారినప్పుడు, అది భౌతిక ప్రపంచం. అంటే కృష్ణుడు చెప్తున్నాడు: యదా యదా హీ ధర్మశ్య గ్లానిర్ భవతి ( BG 4.7) ఈ భౌతిక శరీరంలో జీవి బంధించబడ్డాడు మరియు ఆయన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఒక శరీరము తరువాత మరొక శరీరమును, ఒక శరీరము తరువాత మరొక శరీరమును. ఇది పరిస్థితి. ధర్మ అంటే క్రమంగా కాకులను హంసలాగా మార్చటము అని అర్థం. అది ధర్మము.

ఉదాహరణకు ఒక మనిషి అయి ఉండవచ్చు, ఉండవచ్చు, చాలా నిరక్ష్యరాసుడు అయి ఉండవచ్చు, అనాగరికుడు కావచ్చు, కానీ ఆయనను విద్యావంతునిగా, నాగరిక వ్యక్తిగా మార్చవచ్చు. విద్య ద్వారా, శిక్షణ ద్వారా. అందువల్ల ఆ అవకాశము మానవ జీవితంలో ఉన్నది. ఒక భక్తుడిగా మారడానికి నేను ఒక కుక్కకు శిక్షణ ఇవ్వలేను. అది కష్టం. కావున అది కూడా చేయవచ్చు. కానీ నేను చాలా శక్తివంతమైన వాడిని కాకపోవచ్చు. ఉదహరణకు చైతన్య మహా ప్రభు చేసినట్లుగానే. ఆయన అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు, Jharikhaṇḍa, ఝారీఖాండ లో పులులు, పాములు, జింకలు, జంతువులు అన్నీ, అవి భక్తులుగా మారాయి. అవి భక్తులుగా మారాయి. కావున నాకు సాధ్యమైనది, UH, చైతన్య మహాప్రభు... ఆయన భగవంతుడు కనుక. ఆయన ఏమైనా చేయగలడు. మనము అలా చేయలేము. కానీ మనం మానవ సమాజంలో ఆ పని చేయవచ్చు. ఒక మనిషి ఎంత పతనమైనా కూడా, ఇది పట్టింపు లేదు. ఆయన మన ఆదేశాన్ని అనుసరించినట్లయితే, ఆయనను మార్చవచ్చు.

దానిని ధర్మము అని పిలుస్తారు. ధర్మము అంటే వ్యక్తిని తన వాస్తవ స్థానానికి తీసుకురావడము అని అర్థం. అది ధర్మము. కాబట్టి డిగ్రీలు ఉండవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే మనము భగవంతునిలో భాగము మరియు అంశ, మనము భగవంతుని యొక్క భాగము మరియు అంశ అని అర్థం చేసుకున్నప్పుడు, ఇది మన జీవితపు వాస్తవమైన స్థితి. దీనిని బ్రహ్మ-భూత ( SB 4.30.20) స్థితి అని పిలుస్తారు, తన బ్రహ్మణ్ పరిపూర్ణము, గుర్తింపును అర్థం చేసుకోవడము. కాబట్టి కృష్ణుడు వస్తాడు... ఈ వివరణ...

ఉదాహరణకు కుంతీ చెప్పినట్లుగా: apare vasudevasya devakyāṁ yācito 'bhyagāt ( SB 1.8.33) వసుదేవుడు మరియు దేవకి భగవంతునికి ప్రార్థించారు: మాకు మీలాంటి కొడుకు కావాలి. అది మా కోరిక. వారికి పెళ్లి అయినప్పటికీ, వారికి, వారికి ఏ పిల్లవాడునూ పుట్టలేదు. వారు తపస్యా, తీవ్రమైన తపస్సు లో నిమగ్నమై ఉన్నప్పుడు. అందువల్ల కృష్ణుడు వారికి ముందు వచ్చారు: "నీకు ఏమి కావాలి?" ఇప్పుడు మాకు మీలాంటి ఒక పిల్ల వాడు కావాలి. అందువలన ఇక్కడ చెప్పబడింది: vasudevasya devakyāṁ yācitaḥ. Yācitaḥ. అయ్యా, మాకు మీలాంటి కొడుకు కావాలి." ఇప్పుడు మరి, మరొక భగవంతునికి అవకాశము ఎక్కడ ఉన్నది? కృష్ణుడు భగవంతుడు. భగవంతుడు ఇద్దరు ఉండరు. భగవంతుడు ఒక్కడే. కాబట్టి వసుదేవుడు మరియు దేవకి కుమారుడిగా ఉండటానికి మరొక భగవంతుడు ఎలా ఉంటాడు? అందువల్ల భగవంతుడు ఒప్పుకున్నాడు: "మరొక భగవంతుని కనుగొనడం సాధ్యం కాదు, కనుక నేను నీ కుమారుడను అవుతాను."

కావున వసుదేవుడు మరియు దేవకి వారి కుమారుడిగా కృష్ణుడిని కావాలని కోరుకున్నారు, ఆయన ఆవిర్భవించారు. Kecit. ఎవరో చెప్తారు. Vasudevasya devakyāṁ yācitaḥ. కోరడము వలన, ప్రార్థన చేయడము వలన, abhyagāt, ఆయన ఆవిర్భవించారు. Ajas tvam asya kṣemāya vadhāya ca sura-dviṣām. ఇతరులు నేను వివరిస్తున్నట్లు అదే విషయమును చెప్తారు. Paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām ( BG 4.8) వాస్తవానికి కృష్ణుడు తన భక్తుని ఆనందింప చేయటానికి వస్తాడు. ఉదాహరణకు తన భక్తుడు, వసుదేవుడు మరియు దేవకీలను సంతృప్తి పరచుటకు, ఆయన భక్తుని తృప్తి పరచటానికి అవతరిస్తాడు. కానీ ఆయన వచ్చినప్పుడు, అతడు ఇతర పనులను చేస్తాడు. అది ఏమిటి? Vadhāya ca sura-dviṣām వధాయ అంటే చంపడము. సురద్విషామ్