TE/Prabhupada 0939 - అరవై నాలుగు సార్లు వివాహం చేసుకున్న భర్తను ఎవరూ వివాహం చేసుకోరు



730427 - Lecture SB 01.08.35 - Los Angeles


అరవై నాలుగు సార్లు వివాహం చేసుకున్న భర్తను ఎవరూ వివాహం చేసుకోరు

భక్తుడు: అనువాదం: " ఇంకా ఇతరులు మీరు పునరుజ్జీవింపజేయుటకు అవతరిస్తారు అని చెప్తారు భక్తియుక్త సేవ ద్వారా శ్రవణము, స్మరణము, అరాధించడము మొదలైనవి, అజ్ఞానము వలన బాధపడుతున్న బద్ధ జీవులు ప్రయోజనమును పొంది విముక్తి పొందవచ్చు." ( SB 1.8.35)

ప్రభుపాద: కావున, అస్మిన్ భవ. అస్మిన్ అంటే అర్థం "ఈ." క్రియేషన్ అంటే సృష్టి అని అర్థం. భవ , భవ అంటే "మీరు అవుతారు". మీరు అవుతారు అంటే మీరు అదృశ్యము అవుతారు అని అర్థం. మీరు అవుతారు అన్న ప్రశ్న ఉన్న వెంటనే, మీరు అదృశ్యము అవుతారు కూడా. జన్మించినది ఏదైనా చనిపోవాలి. ఇది ప్రకృతి యొక్క చట్టం. శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు ప్రయత్నం చేస్తున్నారు, వారు వారి శాస్త్రీయ పరిశోధన ద్వారా మరణం నిలిపివేయటానికి, కానీ వారు జన్మించినది ఏదైనా చనిపోవాలి అని వారికి తెలియదు. జన్మ-మృత్యు. ఇవి ఒక దానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నవి. జన్మించనిది ఏదైనా, చనిపోదు. ఈ పదార్థము పుట్టింది. జన్మించిన పదార్థము ఏదైనా. కానీ ఆత్మ జన్మించదు. అందువల్ల భగవద్గీతలో ఇది చెప్పబడింది, na jāyate na mriyate vā kadācin ( BG 2.20) ఆత్మ ఎన్నటికీ జన్మించదు, అందువలన ఎన్నడూ చనిపోదు.

ఇప్పుడు, భవేస్మిన్ . భవ, ఈ భవ అంటే ఈ భౌతిక ప్రపంచం, విశ్వము. Bhave 'smin kliśyamānānām. ఈ భౌతిక ప్రపంచం లోపల ఉన్న ఎవరైనా పనిచేయాలి. ఇది భౌతిక ప్రపంచం. ఉదహరణకు జైలులో ఉన్నట్లు, ఆయన కూర్చోని ఉండటానికి సాధ్యము కాదు అతను అల్లుడు వలె గౌరవించబడతాడు. కాదు మా దేశంలో అల్లుడిని చాలా ఆరాధిస్తారు. ఆరాధించడము అంటే పొగడటము. కుమార్తె విడాకులు తీసుకోకూడదు. అందువలన, ఎవరూ ఊహించ కూడదు... భారతదేశంలో అల్లుడిని గురించి ఏదైనా హాస్యాస్పదంగా మాట్లాడవచ్చు. గతంలో... ఇది ఇప్పటికీ పద్ధతి, కుమార్తెకు వివాహం చేయాలి అది తండ్రి బాధ్యత. దీన్ని కన్యా-దానం అని పిలుస్తారు. ఒక తండ్రి తన కుమారునికి వివాహం చేయకపోవచ్చు. ఇది చాలా గొప్ప బాధ్యత కాదు. కానీ ఒక కుమార్తె ఉంటే, ఆమెకు వివాహం అయ్యేటట్లు తండ్రి తప్పక చూడాలి. పూర్వం పది సంవత్సరాలు, పన్నెండు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు. దాని కంటే ఎక్కువ కాదు. ఇది పద్ధతి. ఇది వేదముల పద్ధతి. కన్యా. కన్య అంటే యుక్త వయస్సు వచ్చే ముందు. కన్య. కావున కన్యా-దానం. ఆమెను ఏవరికైనా దానముగా ఇవ్వాలి. కాబట్టి, పులినా బ్రాహ్మణులలో, బ్రాహ్మణులలో, చాలా గౌరవనీయమైన సమాజంలో, అందువల్ల సరైన పురుషుడిని కనుగోనటము చాలా కష్టమైంది. అందువలన, గతంలో ఒక వ్యక్తి కేవలము వివాహం చేసుకోవడం ద్వారా ఒక వ్యాపారవేత్త కావచ్చు. నా చిన్ననాటిలో, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక పాఠశాల విద్యార్థిగా, నేను ఒక తరగతి స్నేహితుడిని కలిగి ఉన్నాను, వాడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఒక పెద్దమనిషి ధూమపానం చేయడము నేను చూశాను, వాడు చెప్పినాడు ఈ పెద్దమనిషి నీకు తెలుసా? నేను "నేను ఎలా తెలుసుకోగలను?" అని అడిగాను ఆయన నా అత్త యొక్క భర్త, నా అత్త ఈ పెద్ద మనిషి యొక్క అరవై నాలుగవ భార్య. అరవై నాలుగవ. కాబట్టి, ఈ పులిన బ్రాహ్మణులలో, వారు, వారి వ్యాపారము అలాగా ఉంది. ఎక్కడైనా పెళ్లి చేసుకోవటము, కొన్ని రోజులు అక్కడే ఉండటము, మరల మరొక భార్య దగ్గరకు వెళ్లటము, మరల మరొక భార్య దగ్గరకు వెళ్లటము,మరల మరొక భార్య దగ్గరకు వెళ్లటము కేవలం భార్య దగ్గరకు వెళ్లడం, అది వ్యాపారము. ఇది నేను చూసిన సామాజిక పద్ధతి. ఇప్పుడు ఈ విషయాలు పోయాయి. అరవై నాలుగు సార్లు వివాహం చేసుకున్న భర్తను ఎవరూ వివాహం చేసుకోరు. (నవ్వు) కానీ అది ఉంది. కావున, అల్లుడిని, ఆ సందర్భంలో, చాలా గౌరవించేవారు. అనేక కథలు ఉన్నాయి. ఆ విధముగా మనము సమయం వృధా చేసుకోవద్దు. (నవ్వు)