TE/Prabhupada 0949 - మనము విద్యలో ఉన్నతి సాధిస్తున్నాము, కానీ మనము మన దంతాలను కూడా అధ్యయనం చేయలేము



720831 - Lecture - New Vrindaban, USA


మనము విద్యలో ఉన్నతి సాధిస్తున్నాము, కానీ మనము మన దంతాలను కూడా అధ్యయనం చేయలేము కాబట్టి నరోత్తమ దాస ఠాకురా పాడిన పాటను నేను వివరిస్తాను. నరోత్తమ దాస ఠాకురా మన పూర్వ ఆచార్యులు, గురువు, ఆయన పాటలు మన వైష్ణవ సమాజంలో వేదముల సత్యంగా అంగీకరించబడ్డాయి. ఆయన సాధారణ భాషలో వ్రాశారు, కానీ అది వేదముల వాస్తవమును కలిగి ఉంది. అందుకే ఆయన అనేక పాటలను కలిగి ఉన్నాడు. ఆ పాటల్లో ఒకటి: hari hari biphale janama goṅāinu. ఆయన చెప్పాడు, "నా ప్రియమైన ప్రభు, కేవలం నేను నా జీవితంలో విలువైన సమయమును వృధా చేస్తున్నాను." Biphale janama goṅāinu. ప్రతి ఒక్కరూ మానవునిగా జన్మ తీసుకుంటారు, కానీ అది ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలియదు. ఆయన దానిని జంతువు వలె ఉపయోగిస్తాడు. జంతువు తింటుంది; మనము కేవలం అసహజంగా తినడము కోసము అమరిక చేస్తాము. అది మన పురోగతి. జంతు సామ్రాజ్యంలో, ప్రతి నిర్దిష్టమైన జంతువు నిర్దిష్టమైన ఆహారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు పులి. పులి మాంసం తింటుంది మరియు రక్తాన్ని, కానీ మీరు పులికి చక్కని నారింజ లేదా ద్రాక్ష ఇవ్వాలని అనుకుంటే, అది వాటిని తాకదు, అది తన ఆహారము కాదు. అదే విధముగా, ఒక పంది. ఒక పంది మలమును తింటుంది. మీరు పందికి చక్కని హల్వ ఇస్తే, అది తాకదు. (నవ్వు) మీరు చూడండి? కాబట్టి ప్రతి నిర్దిష్టమైన జంతువు నిర్దిష్టమైన ఆహారాన్ని కలిగి ఉంది. అదేవిధముగా, మనం మానవులము ,మనము నిర్దిష్టమైన ఆహారాన్ని కూడా పొందాము. అది ఏమిటి? పండ్లు, పాలు, గింజలు. ఉదాహరణకు మన దంతాలు తయారవుతున్నట్లుగా-మీరు ఒక పండును తీసుకోండి, మీ దంతాల ద్వారా మీరు సులభంగా ముక్కలు చెయ్యవచ్చు. కానీ మీరు మాంసం ముక్క తీసుకుంటే, ఈ పళ్ళతో కట్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ పులి నిర్దిష్టమైన దంతాలను కలిగి ఉంది, ఆయన వెంటనే మాంసమును ముక్కలుగా కట్ చేయగలడు. కాబట్టి మనము విద్యలో పురోభివృద్ధి చెందుతున్నాము, కానీ మనము మన దంతాల గురించి కూడా అధ్యయనం చేయము. మనము కేవలం దంత వైద్యుడి దగ్గరకు వెళ్తాము. అంతే. ఇది మన నాగరికత పురోగతి. పులి దంత వైద్యుడి దగ్గరకు ఎప్పుడూ వెళ్లదు. (నవ్వు) దాని దంతాలు బలంగా ఉన్నప్పటికీ వెంటనే అది ముక్కలుగా చేయగలదు, కానీ దానికి దంత వైద్యుడి అవసరం లేదు, ఎందుకంటే అది తనకు అసహజమైనది ఏదీ తినదు . కానీ మనము ఏ చెత్తను అయినా తింటాము. అందువలన మనకు దంత వైద్యుడి సహాయం అవసరం.

కాబట్టి మన మానవునికి ఒక ప్రత్యేకమైన కర్తవ్యము ఉంది. భాగవత జీవితంపై అధ్యయనం చేయడం లేదా చర్చించడం. అది మన సహజమైనది. భాగవత-ధర్మం. మనము భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భాగవత-ధర్మము, నేను ఇప్పటికే వివరించాను. భగవన్ మరియు భక్తా లేదా భాగవత, వారి సంబంధం, దానిని భాగవత-ధర్మము అని పిలుస్తారు. కావున ఇది చాలా సులభం. ఎలా? ఇప్పుడు మీరు కేవలం కృష్ణుని గురించి వినవలసి ఉంది.