TE/Prabhupada 0958 - మీరు ఆవులను ప్రేమించరు



750624 - Conversation - Los Angeles


మీరు ఆవులను ప్రేమించరు; మీరు వారిని కబేళాకు పంపుతారు

డాక్టర్ ఓర్ర్: పరిపూర్ణ౦గా తెలుసుకోవడానికి కీర్తన, జపము అవసరమా...

ప్రభుపాద: ఇది భగవంతునితో నేరుగా సంబంధంలో ఉండటానికి సులభమయిన మార్గం. భగవంతుడు మరియు భగవంతుని పేరు, అవి సంపూర్ణము, కాబట్టి మీరు భగవంతుని నామమును కీర్తన చేయుట అంటే భగవంతునితో నేరుగా సంబంధము ఏర్పర్చుకోనటము.

డాక్టర్ క్రాస్లీ: సాంప్రదాయ భక్తి-మర్గములో మీ తోటి మనిషిని ప్రేమించడం కన్నా ఎందుకు అది మెరుగైనది?

ప్రభుపాద: మీరు మీ తోటి మనిషిని ప్రేమిస్తారు, కానీ మీ తోటి జంతువును మీరు ప్రేమించరు. మీరు మనిషిని ప్రేమిస్తారు, కానీ మీరు జంతువులను కబేళాకు పంపిస్తారు. ఇది మీ ప్రేమ.

డాక్టర్ వోల్ఫ్: యుద్ధంలోకి సైనికులను...

ప్రభుపాద: హు?

డాక్టర్ వోల్ఫ్: యుద్ధంలో సైనికులను పంపుతాము వారు చంపబడతారు.

ప్రభుపాద: లేదు, మొదట ఈ మనిషిని అధ్యయనం చేసిన తరువాత మీరు సైనికుల దగ్గరకు వెళ్ళండి. మన ప్రేమ పరిమితం. కానీ మీరు ప్రేమించినట్లయితే... ఉదాహరణకు ఈ చెట్టు వలె అనేక వేల ఆకులు మరియు పువ్వులు ఉన్నాయి. నీవు వాటిలో ప్రతి ఒక్క దానికి నీరు పోస్తూ ఉంటే, అప్పుడు అది నీ జీవితమంతా తీసుకుంటుంది. నీవు తెలివిగలవాడివి అయితే, నీవు వేరు మీద నీళ్ళు పోస్తే చాలు; అది ప్రతి చోటికి వెళ్తుంది. మీరు తెలివైన వారు కాకపోతే, కాబట్టి ప్రతి ఆకు మీద, నీటిని పోస్తూ ఉండండి... మీ మొత్తం శరీరానికి ఆహారం అవసరం. అంటే మీరు చెవులకు కళ్ళకు, గోళ్లకు, పురీషనాళానికి ఆహారాన్ని సరఫరా చేయాల్సిన అవసరం లేదు... లేదు. మీరు కడుపుకు ఆహారం ఇస్తారు, అది పంపిణీ చేయబడుతుంది. కాబట్టి కృష్ణుడు చెప్తాడు, mayā tatam idaṁ sarvam. మనము ఇప్పటికే అధ్యయనం చేశాము. మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, మీ ప్రేమ పంపిణీ చేయబడుతుంది. మీరు కృష్ణుడిని ప్రేమించకపోతే మీరు మరొకరిని ప్రేమిస్తే, అప్పుడు ఎవరో ఒకరు "మీరు నన్ను ప్రేమించడము లేదు" అని ఏడుస్తారు.

డాక్టర్ వోల్ఫ్: శ్రీల ప్రభుపాద నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? ప్రభుపాద: మొదటగా, దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృష్ణుడు చెప్పినట్లు, mayā tatam idaṁ sarvam: నేను ప్రతిచోట నా శక్తి ద్వారా విస్తరించబడ్డాను. కాబట్టి ప్రతిచోటుకు, మీరు ఎలా వెళ్తారు? మీరు కృష్ణుడిని ప్రేమించండి మరియు మీ ప్రేమ ప్రతిచోటుకు వెళ్ళుతుంది మీరు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు,అ పన్ను చాలా విభాగాలలో పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ప్రతి విభాగానికి వెళ్లి పన్ను చెల్లించడము మీ కర్తవ్యము కాదు. ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తారు; అది పంపిణీ చేయబడుతుంది. ఇది బుద్ధి. మీరు "నేను ఖజానాకు ఎందుకు చెల్లించాలి? అని అంటే నేను ఈ శాఖకు, ఆ శాఖకు, ఆ విభాగమునకు చెల్లిస్తాను " మీరు వెళ్ళవచ్చు, కానీ అది ఎప్పటికీ సరిపోదు, పూర్తికాదు. కాబట్టి మీరు మానవాళిని ప్రేమించవచ్చు, కానీ మీరు కృష్ణుడిని ప్రేమించరు కాబట్టి, కాబట్టి మీరు ఆవులను ప్రేమించరు; మీరు వాటిని కబేళాకు పంపుతారు. మీ ప్రేమ లోపభూయిష్టంగా ఉంటుంది. ఇది ఎప్పటికీ సంపూర్ణము కాదు. మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, అప్పుడు చిన్న చీమలని కూడా మీరు ప్రేమిస్తారు. మీరు ఒక చీమను చంపడానికి కూడా ఆసక్తి కలిగి ఉండరు. అది నిజమైన ప్రేమ.

డాక్టర్ ఓర్ర్: మనం చాలా చెడ్డగా ప్రేమిస్తున్నామని నేను అంగీకరిస్తున్నాను, మనము జంతువులను చంపుతాము.

ప్రభుపాద: అవును. కాబట్టి చెడ్డగా ప్రేమించడము ప్రేమ కాదు.

డాక్టర్ ఓర్ర్: కానీ దీనికి వ్యతిరేకమైనది నిజమా. మనం చక్కగా కీర్తన చేస్తాము మనము మన తోటి ప్రజలను ప్రేమించలేము కానీ కృష్ణుడిని ప్రేమించగలమా?

ప్రభుపాద: మనము చేయడము లేదు... కీర్తన, జపము చేయడము... మనము కూడా పని చేస్తున్నాము. మేము కేవలం కూర్చోవడం మరియు కీర్తన చేయడము కాదు. ఎందుకంటే మనం కీర్తన చేస్తున్నాము కనుక, మనం అందరినీ ప్రేమిస్తున్నాము. అది సత్యము. ఈ హరే కృష్ణ కీర్తన చేసే వారు, వారు ఎటువంటి జంతువును చంపడానికి ఒప్పుకోరు, ఒక మొక్కను కూడా, ఎందుకంటె అన్ని భగవంతుని భాగము మరియు అంశ అని తెలుసు. అనవసరంగా ఎందుకు చంపాలి? అది ప్రేమ.

డాక్టర్ ఓర్ర్: ప్రేమ అంటే చంపడమా?

ప్రభుపాద: చాలా విషయాలు ఉన్నాయి. ఇది అంశాలలో ఒకటి. అవును, అది వాటిలో ఒకటి... మీరు మీ స్వంత కుమారుని చంపుతారా? ఎందుకు? నీవు ఆయనని ప్రేమిస్తున్నావు కనుక.

డాక్టర్ జుడా: మీరు ఇతర వైపు వివరిస్తారా, వాస్తవానికి, అయితే భగవద్గీత ఒక యుద్ధభూమిలో దాని అమరిక ఉంది ఇందులో అర్జునుడిని తన బంధువులతో పోరాడటానికి కృష్ణుడు ఆదేశిస్తాడు ఎందుకంటె అది ఒక క్షత్రియుని పని?

ప్రభుపాద: అవును. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో, సమాజము యొక్క సమతుల్యత యొక్క నిర్వహణ కోసం, కొన్నిసార్లు చంపడం అవసరం. ఉదాహరణకు యుద్ధం వలె. శత్రువు మీ దేశంలోకి వచ్చినప్పుడు, మీరు నిస్సందేహంగా కూర్చుని ఉండలేరు; మీరు పోరాడాలి. కానీ మీకు నచ్చిన ప్రతి ఒక్కరినీ చంపడానికి మీరు అనుమతించబడతారని కాదు. అది ప్రత్యేక పరిస్థితి పోరాటము తప్పనిసరిగా ఉండాలి. కావున క్షత్రియులకు రక్షణ కల్పించాలి