TE/Prabhupada 0971 - ఎంత కాలము మీరు శరీర భావనలో ఉంటారో, మీరు జంతువు కంటే మెరుగైనవారు కాదు



730400 - Lecture BG 02.13 - New York


ఎంత కాలము మీరు శరీర భావనలో ఉంటారో, మీరు జంతువు కంటే మెరుగైనవారు కాదు యోగులు, వారు కూడా శరీర వ్యాయామం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జ్ఞాని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు, "నేను ఈ శరీరము కాదు" అని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కర్మిలు, వారు అర్థం చేసుకోలేరు. వారు జంతువుల వలె ఉన్నారు. అది తాను శరీరం కాదు అని జంతువులు అర్థము చేసుకోలేవు.

వాస్తవానికి కర్మిలు, జ్ఞానులు, యోగులు, వారు కొంచము, బహుశా జంతువులు కంటే ఉన్నతముగా ఉండి ఉండవచ్చు అంతే. వారు జంతువుల స్థాయిలో ఉన్నారు, కానీ అది కొద్దిగా ఉన్నతమైనది. నేను ఈ ఉదాహరణను ఇస్తాను- బహుశా మీరు దాన్ని విని ఉండవచ్చు- మలము యొక్క పొడి వైపు. భారతదేశములో, వారు ఖాళీ మైదానంలో మలము విసర్జన చేస్తారు. రోజు పూర్తి అయిన వెంటనే, సూర్యరశ్మి ఉంటుంది కనుక, మలం యొక్క ఎగువ భాగము ఎండిపోతుంది. క్రింద, ఇప్పటికీ తేమగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెప్పవచ్చు, "ఈ వైపు చాలా మంచిది." (నవ్వు) ఆయనకి తెలియదు. ఏది ఏమైనప్పటికీ అది మలము. (నవ్వు) ఈ వైపు, లేదా ఆ వైపు. కాబట్టి ఈ మూర్ఖులు, వారు శరీర భావనలో ఉన్నారు, వారు ఆలోచిస్తున్నారు "నేను జాతీయవాది," "నేను యోగిని," నేను ఈ విధముగా ఉన్నాను, నేను ఆ విధముగా ఉంటాను... మీరు చూస్తారు. ఇది తత్వము. ఎంత కాలము మీరు శరీర భావనలో ఉంటారో, మీరు జంతువు కంటే మెరుగైన వారు కాదు. ఇది భాగవత తత్వము. మీరు జంతువు.

yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
(SB 10.84.13)


కాబట్టి గో ఖర అంటే అర్థం, ఆవు, ఖరః అంటే గాడిద. జంతువులు. కాబట్టి ఎవరు వారు? ఇప్పుడు yasyātma-buddhiḥ kuṇape tri-dhātu. ఈ త్రిధాతు- కఫ పిత్త వాయు ఎవరైనా ఆలోచిస్తే ఈ సంచి - "నేను ఈ శరీరాన్ని, నేను ఈ శరీరమును, శరీర సంబంధములో,... " శారీరక సంబంధంలో నేను నా కుటుంబం, సమాజం, పిల్లలు, భార్య, దేశాన్ని కలిగి వున్నాను, అందువల్ల వారు నా వారు, నేను వారి వాడను. కావున yasyātma-buddhiḥ kuṇape tri-dhā..., sva-dhīḥ. స్వ-ధిః అంటే ఆలోచించడము : "వారు నా వారు, నేను వారి వాడిని." స్వ-ధిః కలత్రాదిషు. కలత్రా అంటే భార్య. భార్య ద్వారా, మనము పిల్లలను పొందుతాము, మనము విస్తరిస్తాము.

సంస్కృత పదం స్త్రీ. స్త్రీ అంటే విస్తరణ. నేను ఒకడినే ఉంటాను. నేను భార్యను పొందిన వెంటనే, నేను ఇద్దరు అవుతాను. తరువాత మూడు, నాలుగు, తరువాత ఐదు. ఆ విధముగా దీనిని స్త్రీ. అని పిలుస్తారు. కాబట్టి,మన విస్తరణ, ఈ విస్తరణలు, ఈ భౌతిక విస్తరణ, శరీర విస్తరణ, అంటే భ్రాంతి. Janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8) ఈ భ్రమ పెరుగుతుంది, "నేను ఈ శరీరం, శరీర సంబంధంలో, ప్రతిదీ నాది." అహం మమ. అహం అంటే "నేను", మమ అంటే "నా."