TE/Prabhupada 0974 - మన గొప్పతనం చాలా, చాలా చిన్నది, అతి సూక్ష్మమైనది. భగవంతుడు గొప్పవాడు



730408 - Lecture BG 04.13 - New York


మన గొప్పతనం చాలా, చాలా చిన్నది, అతి సూక్ష్మమైనది. భగవంతుడు గొప్పవాడు ప్రభుపాద:

catur varṇyaṁ mayā sṛṣṭaṁ
guṇa-karma-vibhāgaśaḥ
tasya kartāram api māṁ
vidhy akartāram avyayam
(BG 4.13)

ఇది భగవద్గీతలోని ఒక శ్లోకము. మీలో ఎక్కువమందికి ఈ పుస్తకం, భగవద్గీత తెలుసు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన జ్ఞాన గ్రంథం. అది మనము భగవద్గీతని యథాతథంగా ప్రచారం చేస్తున్నాం. ఈ కృష్ణ చైతన్యము ఉద్యమము అంటే భగవద్గీతని యథాతథంగా ప్రచారం చేస్తున్నది ఏ విధమైన కల్తీ లేకుండా అని అర్ధం.

కాబట్టి కృష్ణుడు చెప్పారు నాలుగు తరగతుల వ్యక్తులు, చాతుర్వర్ణం... చాతుర్- అంటే "నాలుగు", వర్ణ అంటే "సమాజం యొక్క విభజన". ఉదాహరణకు వర్ణ అంటే రంగు. అక్కడ రంగుల యొక్క విభజన వలె, ఎరుపు, నీలం పసుపు, అదేవిధముగా మానవుడు, మానవ సమాజం లక్షణము ప్రకారం విభజించబడాలి. లక్షణము కూడా రంగు అని పిలువబడును. Catur varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మూడు లక్షణాలు ఉన్నాయి. మూడు లక్షణాలు లేదా మూడు రంగులు. ఎరుపు, నీలం పసుపు. మీరు కలపాలి. అప్పుడు మీరు ఎనభై-ఒక్క రంగులవుతారు. మూడు రంగులు, మూడుని మూడుతో గుణించితే, అది తొమ్మిది అవుతుంది. తొమ్మిదిని తొమ్మిది పెట్టి, గుణించితే, ఎనభై ఒకటి అవుతుంది. ఎనిమిది మిలియన్ల నాలుగు వేల వేర్వేరు జీవన రూపాలు ఉన్నాయి. వివిధ లక్షణాల యొక్క ఈ మిశ్రమం కారణంగా. ప్రకృతి వివిధ రకాల శరీరాలను తయారు చేస్తుంది జీవి యొక్క సాంగత్యం ప్రకారం నిర్దిష్ట రకమైన లక్షణము ఉంటుంది.

జీవులు భగవంతుని యొక్క భాగం అంశలు. భగవంతుడు గొప్ప అగ్ని అనుకుందాం జీవాత్మలు కేవలం కణములు వలె ఉన్నారు. కణములు, అవి కూడా అగ్ని. కణములు కూడా, ఒక కణము మీ శరీరం మీద పడినట్లయితే, మీ వస్త్రంపై, అది కాలుతుంది. కానీ గొప్ప అగ్ని వలె శక్తివంతమైనది కాదు. అదేవిధముగా, భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడు గొప్పవాడు. మనము భగవంతుని యొక్క భాగం అంశలు. అందువలన, మన గొప్పతనం చాలా, చాలా చిన్నది, అతి సూక్ష్మమైనది. భగవంతుడు గొప్పవాడు. అందువలన, ఆయన చాలా విశ్వాలు సృష్టించెను. మనము ఒక విశ్వం కూడా సృష్టించలేము. మనము చూసే ఈ ఒక విశ్వం, ఆకాశం, గోపురం, ఆ ఆకాశంలో, బాహ్య ఆకాశం, లక్షలాది కోట్లాది, నక్షత్రాలు, లోకములు ఉన్నాయి. అవి తేలుతూ ఉన్నాయి. గాలిలో తేలుతూ ఉన్నాయి. అందరికీ తెలుసు