TE/Prabhupada 0986 - ఎవరూ భగవంతుని కంటే తెలివి గలవారు కాలేరు



720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA


ఎవరూ భగవంతుని కంటే తెలివి గలవారు కాలేరు ఉదాహరణకు మీ పాశ్చాత్య దేశాలలో వలె, ఏసు ప్రభు భగవంతుని కోసము తన జీవితాన్ని త్యాగము చేసినాడు. ఆయన దూషణ చేసే ఏదో ఉపదేశములను ప్రచారము చేస్తున్నాడు అని ఆరోపణ చేశారు. కానీ ఆయన భగవంతుని భక్తుడు. ఆయన, ఆయన ప్రజలకు ప్రచారము చేశాడు, భగవంతుని రాజ్యం ఉంది, మీరు భగవంతుని ప్రేమించండి, భగవంతుని రాజ్యమునకు వెళ్ళండి. సాధారణ సత్యం. మానవ జీవితం యొక్క వాస్తవమైన కర్తవ్యము. ఈ మానవ జీవితం భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది ఎందుకంటే మనము భగవంతునిలో భాగం మరియు (అంశం) మనము మరిచిపోయాము. ఉదాహరణకు ఇదే విషయము, నేను అనేక సార్లు ఉదాహరణ ఇచ్చాను, ఒక వ్యక్తి, ఆయన ధనవంతుడైన తండ్రికి చెందినవాడు, కానీ ఏదో ఒక కారణము వలన ఆయన ఇంటిని విడిచిపెట్టాడు ఆయన దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు. మీ దేశంలో ఈ ఉదాహరణ చాలా వర్తిస్తుంది. చాలా మంది బాలురు, వారు తమ ధనవంతుడైన తండ్రిని, గొప్ప కుటుంబమును వదలివేస్తారు, వీధిలో పడుకుంటారు. నేను చూశాను. ఎందుకు? బహుశా ఏదో కారణం, కానీ ఆయన వీధిలో పడుకోవలసిన అవసరము లేదు ఎందుకంటే ఆయన ధనవంతుడైన తండ్రిని, కనీసం ధనవంతమైన దేశమును, మీ అమెరికన్ దేశం కలిగి ఉన్నాడు . అదేవిధముగా మనము తికమక పడి మరియు గందరగోళంగా మారితే, భగవంతుడి నుండి స్వతంత్రంగా జీవించాలనుకుంటే, ధనవంతుడైన తండ్రి- భగవంతుని కంటే ధనవంతుడు ఎవరు? భగవంతుడు అంటే అత్యంత ధనవంతుడని అర్థం. ఎవరూ ఆయన కంటే ధనికుడు కాలేడు. ఇది భగవంతుని యొక్క మరొక నిర్వచనం.

aiśvaryasya samagrasya
vīryasya yaśasaḥ śriyaḥ
jñāna-vairāgyayoś caiva
ṣaṇṇāṁ bhaga itīṅganā
(Viṣṇu Purāṇa 6.5.47)

భగ, భగ అంటే అదృష్టం. ఆరు రకాల అదృష్టాలు కలిగిన సంపన్నుడు. మనము బాగా అర్థం చేసుకోగలము. ఉదాహరణకు మన భౌతిక ప్రపంచంలో, ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అయితే, అతడు ఆకర్షణీయంగా ఉంటాడు. అందరూ ఆయన గురించి మాట్లాడుతారు. ఆయన అధముడు అయినా, ఆయన డబ్బు సంపాదించినట్లయితే, ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడతారు. కనీసం ఈ యుగములో ఇది జరుగుతోంది. ఎవరూ ఏమీ పరిగణలోకి తీసుకోరు, కానీ ఎట్లగైతేనే ఎవరైనా చాలా ధనవంతుడు అయితే, ఆయన ఒక ప్రముఖ వ్యక్తి అవుతాడు. కాబట్టి భగవంతుడు ధనవంతుడై ఉండాలి. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచం లోపల మనము "నేను ఆయన కన్నా ఎక్కువ ధనము గలవాడిని" అని చెప్పుకోవచ్చు, కానీ కొంత మంది నా కంటే ధనవంతులు ఉంటారు. నేను "నా కంటే ఎవరూ ధనికులు లేరు." అని ప్రకటించ లేను. అది సాధ్యం కాదు. మన కంటే తక్కువ ధనవంతుని. మన కంటే ఎక్కువ ధనవంతుని మనము కనుగొంటాము. రెండు విషయాలు మనము చెయ్యవచ్చు. కానీ మీరు భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు, మీరు ఎవ్వరూ ఆయన కంటే ధనవంతుడిని కనుగొనలేరు.

అందువలన భగవంతుడు గొప్ప వాడు అని పిలుస్తారు, భగవంతుడు గొప్పవాడు. అదేవిధముగా , ధనములోనే కాదు, aiśvarya, sa samagrasya, vīryasya, శక్తి లో కూడా. Aiśvaryasya samagrasya vīryasya yaśasaḥ, కీర్తిలో, కీర్తిలో కూడా. ఉదాహరణకు అందరిలాగానే, మీరు ఏదైనా మతమునకు చెందుతారు, నేను చెందుతాను, కానీ అందరికి తెలుసు భగవంతుడు గొప్పవాడు అని. అది కీర్తి. Aiśvaryasya samagrasya vīryasya yaśasaḥ, śrī, మరియు శ్రీ అంటే అందం అని అర్థం. భగవంతుడు చాలా అందమైనవాడు. ఉదాహరణకు ఇక్కడ, కృష్ణుని ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కృష్ణుని యొక్క చిత్రం కలిగి ఉన్నారు ఆయన ఎంత అందంగా ఉన్నాడు. భగవంతుడు ఉండాలి, ఆయన ఎల్లప్పుడూ, యువకునిగా. ఒక వృద్ధుడు అందముగా ఉండలేడు. ఇది బ్రహ్మ సంహితలో చెప్పబడింది, advaitam acyutam anādim ananta-rūpam ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanaṁ ca (BS 5.33). అది ఆద్యం పురాణము వర్ణన, ఆయన మొదటి వ్యక్తి, అందరిలోకి పురాతనమైన వాడు కానీ ఆయన నవ-యువకుడు, ఒక అందమైన పుత్రుడు వలె, పదహారు లేదా ఇరవై సంవత్సరాల వయస్సులో. కాబట్టి అది అందము, అత్యంత అందమైన. చాలా తెలివైన వారు, జ్ఞానం. ఎవరూ భగవంతుని కంటే తెలివైన వ్యక్తిగా ఉండరు. ఇవి వ్యాసుని తండ్రి అయిన పరాశర ముని ఇచ్చిన వర్ణన. Aiśvaryasya samagrasya vīryasya yaśasaḥ śriyaḥ (Viṣṇu Purāṇa 6.5.47), jñāna-vairāgya అదే సమయంలో పరిత్యజించడము