TE/Prabhupada 0989 - గురువు యొక్క కృప వలన ఒకరికి కృష్ణుడు లభిస్తాడు. ఇది భగవద్-భక్తి-యోగా



740724 - Lecture SB 01.02.20 - New York


గురువు యొక్క కృప వలన ఒకరికి కృష్ణుడు లభిస్తాడు. ఇది భగవద్-భక్తి-యోగా ప్రభుపాద: కృష్ణుని అర్థం చేసుకోవడము సాధారణ విషయము కాదు.

కృష్ణుడు చెప్తాడు,

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin vetti māṁ tattvataḥ
( BG 7.3)

ఈ సత్యము అర్థం అయ్యేది వారి ద్వార... కృష్ణుని ద్వారా లేదా కృష్ణుని ప్రతినిధి ద్వారా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు,

mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ ( BG 7.1)

Mad-āśrayaḥ. మదాశ్రయః అంటే "నా కింద... నా కింద." వాస్తవమునకు దాని అర్థం... మదాశ్రయః అంటే అర్థం, కృష్ణుని ఆశ్రయం తీసుకున్న వ్యక్తి, లేదా ఏమి కోరకుండా కృష్ణునికి శరణాగతి పొందిన వ్యక్తి. అతనిని మదాశ్రయః అని పిలుస్తారు, లేదా ఎవరైతే కృష్ణుని ఆశ్రయం సంపూర్ణంగా తీసుకుంటారో. కాబట్టి ఈ యోగ, ఈ భక్తి-యోగ, ఇక్కడ చెప్పినట్లు, భగవద్-భక్తి-యోగతః... భగవద్-భక్తి- భగవద్ యోగను భగవద్-భక్తుని యొక్క కమల పాదముల దగ్గర ఒకరు పూర్తిగా ఆశ్రయం పొందినప్పుడు నేర్చుకోవచ్చు. దానిని భగవత్ భక్తుడు అని పిలుస్తారు. ఆయన భగవద్-భక్తుడు స్వతంత్రముగా కాలేడు, మీ ఆధ్యాత్మిక గురువుని పట్టించుకోకుండా. అది అర్థంలేనిది. అది మూర్ఖత్వము. ఆయన ఎప్పటికీ చేయలేడు.

మనము రోజు పాటలు పాడుతున్నాము, yasya prasādād bhagavat-prasādo. కానీ మీకు అర్థం తెలియదు, దురదృష్టవశాత్తు. yasya prasādād: ఆధ్యాత్మిక గురువును సంతృప్తి పరిస్తే, అప్పుడు భగవంతుడు సంతోషంగా ఉంటాడు. అంతే కాని స్వతంత్రంగా కాదు... Yasya, yasya prasādād. పది రకాల అపరాధాలలో, మొదటి అపరాధము guror avajñā, గురువు యొక్క ఆదేశాలకు అవిధేయునిగా ఉండటము. ప్రత్యేకించి గురువు యొక్క కర్తవ్యము కృష్ణ చైతన్యమును ప్రచారము చేయుట. ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని బోధిస్తున్న వ్యక్తిని గురించి ఎవరైనా దూషణ చేస్తే, ఇది గొప్ప అపరాధము. కానీ మనము పది రకాల అపరాధాలను చదువుతున్నాము, గురుఅష్టకా, మరియు గురువుల యొక్క... నీకు అర్థమేమిటో తెలుసా, అది ఏమిటి, śrī-guru-carana-padma? ఆ పాట ఏమిటి? దాన్ని చదవండి.

భక్తుడు: Śrī-guru-carana-padma, kevala bhakati-sadma, bando mui sāvadhāna...

ప్రభుపాద: ఆహ్, సావధాన మాతే, "గొప్ప శ్రద్ధతో." మీరు ఈ పాట పాడతారు-అర్థము మీకు తెలుసా? లేదు ఎవరైనా అర్థం వివరించగలరా? అవును, మీరు వివరించండి.

భక్తుడు: Śrī-guru-carana-padma" గురువు యొక్క కమల పాదములు" అని అర్థం. Kevala bhakati-sadma, ఆయన మొత్తం భక్తి, లేదా భక్తి అంతటి యొక్క జలాశయం. Bando mui sāvadhān అంటే మనం అతన్ని గొప్ప భక్తితో పూజిస్తాము.

ప్రభుపాద: చదవండి. ఇతర పంక్తులను చదవండి.

భక్తుడు: Jāhāra prasāde bhāi...

ప్రభుపాద: ఆహ్, Jāhāra prasāde bhāi. తరువాత?

భక్తుడు: E bha va toriyā jāi.

ప్రభుపాద: E bha va toriyā jāi. ఒకవేళ నేను చెప్పేది ఏమిటంటే, గురువు యొక్క అనుగ్రహమును పొందితే, అప్పుడు అవిద్యను దాటే మార్గము స్పష్టంగా ఉంటుంది. Jāhāra prasāde bhāi, e bha va toriyā jā. అప్పుడు, తదుపరి పంక్తి?

ప్రభుపాద: krṣṇa-prāpti hoy jāhā hate గురువు యొక్క కృప వలన ఒకరు కృష్ణుని పొందుతారు ఇది Yasya prasādād bhagavat. అన్నిచోట్లా. ఇది భగవద్-భక్తి-యోగా. కాబట్టి ఈ దశను చేరుకోని వారు, ఈ భగవద్-భక్తి ఏమిటి? ఇది మూర్ఖత్వము. ఇది భగవద్ కాదు... Yasya prasādād bhagavat

evaṁ prasanna-manaso
bhagavad-bhakti-yogataḥ
( SB 1.2.20)