TE/Prabhupada 0998 - ఒక సాధువు యెక్క కర్తవ్యము అన్ని జీవుల యొక్క శ్రేయస్సు



730406 - Lecture SB 02.01.01-2 - New York


ఒక సాధువు యెక్క కర్తవ్యము అన్ని జీవుల యొక్క శ్రేయస్సు 84,00,000 రకాల శరీరములు ఉన్నాయి. కృష్ణుడు చెప్తారు "వారు, వారు అందరు, జీవులు అందరు నా భాగము మరియు అంశ కానీ వారు ఇప్పుడు వివిధ దుస్తులతో మాత్రమే కప్పబడి ఉన్నారు. కానీ వారు అందరు జీవులు " ఇది కృష్ణ చైతన్యము దృష్టి.

అందువల్ల కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి, పండిత, paṇḍitāḥ sama-darśinaḥ... ( BG 5.18) పండిత, అతడు బాహ్య దుస్తులను చూడడు; ఆయన జీవిని నిర్దిష్టమైన శరీరములో ఉంచబడినట్లుగా చూస్తాడు. కాబట్టి ఆయనకు శరీరము గురించి ఎలాంటి ఆందోళన లేదు. అందువలన సాధువు ఎల్లప్పుడూ ప్రతిఒక్కరి ప్రయోజనము గురించి ఆలోచిస్తాడు. ఉదాహరణకు రూప గోస్వామి, సనాతన గోస్వామి వలె . గోస్వాములలో ఇది చెప్పబడినది, lokānāṁ hita-kāriṇau tri-bhuvane mānyau. వారు అన్ని రకాల జీవులకు లబ్ధి చేకూర్చే వారు కనుక అందువల్ల వారిని మూడు లోకాలలో త్రి-భువనే గౌరవించారు. Tri-bhuvane. Lokānāṁ hita-kāriṇau. Nānā-śāstra-vicāraṇaika-nipuṇau. ఒక సాధువు కర్తవ్యము, అన్ని జీవుల యొక్క ప్రయోజనము చూడడము. ఒక సాధువు ఒక వృక్షాన్ని కూడా కత్తిరించడానికి ఇష్టపడడు, ఎందుకంటే ఆయనకు తెలుసు, "ఇక్కడ ఒక జీవి ఉంది అని. ఆయన తన కర్మ ద్వారా అనేక సంవత్సరాలుగా ఇక్కడ నిలబడి ఉన్నాడు, ఆయన అనేక సంవత్సరాలు ఈ విధముగా కొనసాగవలసి ఉంది. అందువల్ల ఆయన దీనిని నివారించలేడు ఎందుకంటే ఇది ప్రకృతి చట్టము. " ఉదాహరణకు మిమ్మల్ని ఆరునెలల పాటు జైలులో ఉంచినట్లయితే, ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు, ఎవరూ తగ్గించ లేరు, ఒక్క రోజు కూడా ఆరు నెలలలో తగ్గించ లేరు. కాబట్టి మనము నిర్దిష్టమైన శరీరమును కలిగి ఉన్నాము, ప్రకృతి చట్టాల ద్వారా నిర్దిష్టమైన కాలం మనం ఆ శరీరంలో ఉండవలసి ఉంటుంది. కాబట్టి శరీరాన్ని నరకడము ద్వారా - జీవి చనిపోడు - చనిపోడు కానీ మనము ఆయన కాలపు కొనసాగింపును ఆపుతున్నాము కనుక, మనము పాపము చేసిన వారము అవుతున్నాము. మీరు కృష్ణుడి ప్రయోజనము కొరకు కాకపోతే ఒక చెట్టుని కూడా నరకకూడదు. కృష్ణుడి ప్రయోజనము లేకుండా మనం ఒక చీమను కూడా చంపకూడదు, మనం చెట్టుని కూడా నరకకూడదు, అప్పుడు మనము శిక్షకు బాధ్యులం. కాబట్టి ఒక సాధువు చూస్తారు "ఇక్కడ కూడా జీవి ఉంది." Paṇḍitāḥ sama...

vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
(BG 5.18)

పండితుడు ఏ వివక్షను చేయడు: "ఇక్కడ ఒక జంతువు ఉంది, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు." లేదు, ఆయన చూస్తాడు, "జంతువు కూడా కృష్ణునిలో భాగము. ఆయన వేరే శరీరాన్ని పొందినాడు, మనిషి కూడా ఆయన కృష్ణుని యొక్క భాగం, ఆయన వేరే శరీరాన్ని పొందాడు. కర్మనా, ఒకరి కర్మ ప్రకారం, ఆయన భిన్నమైన దానిలో ఉంచబడ్డాడు. " కాబట్టి loka-hitam. ( SB 2.1.1)