TE/Prabhupada 1004 - పిల్లులు కుక్కల వలె పని చేయడము మరియు చనిపోవడము ఇది తెలివి కాదు



750713 - Conversation B - Philadelphia


పిల్లులు కుక్కల వలె పని చేయడము మరియు చనిపోవడము ఇది తెలివి కాదు

శాండీ నిక్సన్: కృష్ణ చైతన్యమును పొందటానికి ఉపయోగించే పద్ధతులు ఏమిటి? ఎలా ఒకరు పొందవచ్చు...

ప్రభుపాద: అవును, కృష్ణ చైతన్యముతో మీరు జీవిత లక్ష్యాన్ని సాధించగలరు. ప్రస్తుత స్థితిలో మనము ఒక శరీరాన్ని అంగీకరిస్తున్నాము, మనము కొన్ని రోజుల తరువాత మరణిస్తున్నాము, అప్పుడు మరొక శరీరం అంగీకరిస్తాము. ఆ శరీరం మీరు చేసే పనుల బట్టి ఉంటుంది. 84,00,000 వివిధ రకములైన శరీరములు ఉన్నాయి. మీరు వాటిలో దేనినైనా పొందవచ్చు. మీరు ఒక శరీరాన్ని అంగీకరించాలి. దానిని ఆత్మ పరిణామ ప్రక్రియ అని అంటారు. కాబట్టి ఈ జ్ఞానం కింద ఎవరైనా ఉంటే "నేను శాశ్వతముగా ఉన్నాను. ఎందుకు నేను శరీరాన్ని మారుస్తున్నాను? ఇది ఎలా పరిష్కరించుకోవాలి? "ఇది బుద్ధి. పిల్లులు కుక్కలు వలె పని చేసి మరణించడము కాదు. అది తెలివి కాదు. ఈ సమస్యకు పరిష్కారం చేసుకున్న వ్యక్తి, ఆయన తెలివైనవాడు. కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమము జీవితం యొక్క అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం.

శాండీ నిక్సన్: కృష్ణ చైతన్యము యొక్క మార్గంలో వ్యక్తిలో ఏ మార్పులు జరుగుతాయి?

ప్రభుపాద: మార్పులు ఉండవు. చైతన్యము ఉంది. ఇది ఇప్పుడు అన్ని చెత్త వస్తువులతో నిండి ఉంది. మీరు దీన్ని శుభ్రపర్చవలసి ఉంటుంది, అప్పుడు కృష్ణ చైతన్యము... ఉదాహరణకు నీరు లాగానే. నీరు ప్రకృతి పరముగా, చాలా శుభ్రముగా, స్వచ్ఛముగా ఉంటుంది. కానీ అది చెత్త వస్తువులతో నిండినప్పుడు, అది బురదగా ఉంటుంది; మీరు చాలా స్పష్టంగా చూడలేరు. కానీ మీరు దానిని ఫిల్టర్ చేస్తే, అన్ని బురద విషయాలు, మురికి విషయాలు తీసి వేస్తే, మళ్ళీ వాస్తవ పరిస్థితికి-స్పష్టమైన, స్వచ్ఛమైన నీరుగా వస్తుంది.

శాండీ నిక్సన్: కృష్ణ చైతన్యంలో ఉండటము వలన సమాజంలో ఒక వ్యక్తి పనితీరు అయినా మెరుగుగా ఉంటుందా?

ప్రభుపాద: అయ్యో?

గురుదాస: కృష్ణ చైతన్యము ఉండటము వలన ఒక వ్యక్తి సమాజములో తన కర్తవ్యమును బాగా చేస్తారా?

ప్రభుపాద: అర్థం ఏమిటి?

రవీంద్ర-స్వరూప: ఆయన ఒక మెరుగైన పౌరుడా?

శాండీ నిక్సన్: సాంఘికముగా లేదా సాంస్కృతికముగా... ఆయన సమాజములో మెరుగుగా పని చేయగలరా?

ప్రభుపాద: అది మీరు ఆచరణాత్మకంగా చూడవచ్చు. వారు తాగుబోతులు కాదు, వారు మాంసం తినేవారు కాదు. శరీరధర్మ దృక్కోణం నుండి, వారు చాలా శుభ్రంగా ఉన్నారు వారు ఎన్నో వ్యాధులచే దాడి చేయబడరు. తరువాత వారు మాంసం తినరు, అనగా చాలా పాపం, నాలుక సంతృప్తి కోసం ఇతరులను చంపడము. భగవంతుడు మానవ సమాజానికి చాలా వాటిని తినడానికి ఇచ్చాడు: మంచి పండ్లు, మంచి పువ్వులు, చక్కని ధాన్యాలు, ఫస్ట్ తరగతి చక్కటి పాలు. పాల నుండి మీరు మంచి పోషక ఆహారాలు వంటలు సిద్ధం చేసుకోవచ్చు. కానీ వారికి ఆ కళ తెలియదు. వారు గొప్ప, గొప్ప కబేళాలు నిర్వహిస్తున్నారు మాంసం తింటున్నారు. వివక్ష లేదు. అంటే వారికి నాగరికత కూడా లేదు. మనిషికి నాగరికత లేనప్పుడు, ఆయన ఒక జంతువును చంపుతాడు మరియు తింటాడు, ఎందుకంటే ఆయనకు ఆహారాన్ని ఎలా పండించాలో తెలియదు. ఉదాహరణకు మేము న్యూ వృందావనములో ఒక వ్యవసాయ భూమిని కలిగి ఉన్నాము. కాబట్టి మనము పాల నుండి మొదటి-తరగతి వాటిని తయారు చేస్తున్నాము, కావున చుట్టు ప్రక్కల వారు వస్తున్నారు వారు పాల నుండి ఇటువంటి మంచి పదార్ధములను, వందలు తయారు చేయవచ్చా అని ఆశ్చర్య పోతున్నారు.

అందువల్ల వారు నాగరికత కూడా లేనివారు, పాల నుండి పోషక ఆహారాన్ని ఎలా సిద్ధం చేయాలి. పాలు... ఆవు మాంసం రక్తం చాలా పోషకమైనది అని అంగీకరించినా... మనం కూడా ఒప్పుకుంటున్నాము, కానీ ఒక నాగరిక మనిషి రక్తం మరియు మాంసమును వేరే విధముగా ఉపయోగించుకుంటాడు. పాలు వేరేది ఏమి కాదు అది రక్తం మాత్రమే. కానీ రక్తము పాలుగా రూపాంతరం చెందింది. మళ్ళీ, పాలు నుండి మీరు చాలా విషయాలు తయారు చేస్తారు. మీరు యోగర్ట్, మీరు పెరుగు, మీరు నెయ్యి, చాలా విషయాలు చేయవచ్చు. కూరగాయలను, పండ్లను, గింజలను ఈ పాల ఉత్పత్తుల కలయికతో మీరు వందలాది పదార్ధములను తయారు చేయవచ్చు. కాబట్టి ఇది నాగరిక జీవితం, నేరుగా ఒక జంతువును చంపి, తినడము కాదు. అది అనాగరిక జీవితం. మీరు ఆవు మాంసం రక్తం చాలా పోషకమైనది అని అంగీకరించి-మీరు దానిని నాగరిక మార్గంలో తీసుకోండి. ఎందుకు చంపాలి? ఇది అమాయక జంతువు. అది భగవంతుడిచ్చిన గడ్డిని తింటుంది మరియు పాలను సరఫరా చేస్తుంది. పాలు నుండి మీరు నివసించవచ్చు. మీ కృతజ్ఞత దాని గొంతును నరకటమా? అది నాగరికత? ఏమంటావు?

జయతీర్థ: అది నాగరికత?

శాండీ నిక్సన్: లేదు, నేను మీతో వంద శాతం అంగీకరిస్తున్నాను. విషయాలను నేను చెప్పే బదులు మీరు చెప్పాలని నేను కోరుకున్నాను. నేను ఆ ప్రశ్నలను అడుగుతున్నాను ఆశతో, నేను వివరించే బదులు, కేవలం చిన్న ప్రశ్నలు...

ప్రభుపాద: ఈ విషయాలు అనాగరికమైన జీవన విధానం, వారు భగవంతుణ్ణి ఏమి అర్థం చేసుకోగలరు? అది సాధ్యం కాదు.

శాండీ నిక్సన్: నేను ఇతరుల కోసము ఈ ప్రశ్నలను అడుగుతున్నాను, వాస్తవానికి, కృష్ణ చైతన్యమును అర్థం చేసుకోని వారి కోసము.

ప్రభుపాద: భగవంతుణ్ణి అర్థం చేసుకోవటము అంటే మొదటి -తరగతి నాగరిక మనిషి అయి ఉండాలి. ఉదాహరణకు విశ్వవిద్యాలయం మొదటి-తరగతి ఉన్నతమైన విద్యార్థుల కోసము ఉంది, అదేవిధముగా, భగవంతుని చైతన్యము అంటే మొదటి -తరగతి మానవులకు అని అర్థం