TE/Prabhupada 1019 - మీరు కృష్ణునికిఏదైనా సేవ చేస్తే, కృష్ణుడు మీకు ఒక వంద రెట్లు బహుమతి ఇస్తాడు



730408 - Lecture SB 01.14.44 - New York


మీరు కృష్ణునికి ఏదైనా సేవ చేస్తే, కృష్ణుడు మీకు ఒక వంద రెట్లు బహుమతి ఇస్తాడు అందువలన యుధిష్టర మహారాజు ఈ లోకములో కృష్ణుడు లేరని అర్థం చేసుకోగలిగాడు; అందువలన ఆయన చాలా అశుభకరమైన లక్షణాలను చూశాడు. ఇప్పుడు, అర్జునుడు తిరిగి వచ్చినప్పుడు, అతను అడుగుతున్నాడు నీవు ఎందుకు దిగులుగా ఉన్నావు? నీవు దీన్ని చేసారా? నీవు దానిని చేసారా? ప్రతిదీ. ఇప్పుడు ఆయన సారంశముగా చెప్తున్నాడు, "నేను నీ దిగులుకు కారణము, కృష్ణుడి నుండి వేరు అవ్వటము" అని నేను భావిస్తున్నట్లుగా. Kaccit preṣṭhatamenātha. Preṣṭhatamenātha, ఇది అత్యుత్తమమైనది. ఉదాహరణకు ఆంగ్ల భాషలో సానుకూల, తులనాత్మక మరియు అతిశయోక్తి .అని ఉన్నాయి అదేవిధముగా , సంస్కృతములో ఉంది. ప్రేష్ఠ అంటే సానుకూలమైనది, ప్రేష్ఠ పర తులనాత్మకమైనది, ప్రేష్ఠతమ అత్యున్నత స్థాయి కృష్ణుడు ప్రేష్ఠతమ , ప్రియమైన, ఉన్నత స్థాయిలో ఉన్నారు. Kaccit preṣṭhatamena atha. Preṣṭhatamenātha hṛdayenātma-bandhunā. Atma-bandhu, suhṛt. సంస్కృతంలో వేర్వేరు పదాలు ఉన్నాయి, atma-bandhu, suhṛt, bandhu, mitra - అవి అన్నీ స్నేహితుడు అని అర్థం, కానీ వివిధ స్థాయిలలో. మిత్ర అంటే సాధారణ స్నేహితుడు. మీరు కలిగి ఉన్నట్లుగా "ఆయన నా స్నేహితుడు," అంటే ఆయన నా సన్నిహిత స్నేహితుడు అని కాదు. అందువల్ల ఉత్తమ స్నేహితుడు సుహృత్. సుహృత్ అంటే "ఏమి ఆశించకుండా" అని అర్థం. మీరు ఎవరి గురించి అయినా ఆలోచించినట్లయితే, ఆయన ఎలా సంతోషంగా ఉంటాడని, అది సుహృత్ అని పిలవబడుతుంది.

కాబట్టి hṛdayenātma-bandhunā. కృష్ణుడు ఎప్పుడూ అర్జునుడి గురించి ఆలోచిస్తున్నాడు, అది సంబంధం. కృష్ణుడు చెప్తాడు, sādhavo hṛdayaṁ mahyaṁ ( SB 9.4.68) భక్తుడు ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు, అదేవిధముగా కృష్ణుడు కూడా భక్తుని గురించి ఆలోచిస్తాడు. ఆయన మరింత ఆలోచిస్తాడు. దీనిని ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చు కొనుట అని అంటారు.

Ye yathā māṁ prapadyante
tāṁs tathaiva bhajāmy aham
( BG 4.11)

మీరు కృష్ణుని గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే, కృష్ణుడు మీ గురించి ఇరవై ఆరు గంటలు ఆలోచిస్తాడు. (నవ్వు) కృష్ణుడు చాలా దయతో ఉన్నాడు. మీరు కృష్ణునికి కొంత సేవ చేస్తే, కృష్ణుడు మీకు వంద రెట్లు ప్రతిఫలమిస్తాడు. కానీ ప్రజలు, వారు కోరుకోవడము లేదు. వారు "కృష్ణుడిని సేవించడం ద్వారా మనం ఎలా ప్రయోజనమును పొందుతాము? మనము నా కుక్కకు సేవ చేద్దాము". ఇది అపార్ధం చేసుకోవడము. కృష్ణుని మీద ఉన్న నిద్రాణ ప్రేమను మేల్కొల్పడం మన ప్రయత్నం. అందరికి ప్రేమ ఉంది- ప్రేమ స్టాక్ ఉంది - కానీ అది దుర్వినియోగం చేయబడుతుంది. ఆ ప్రేమను ఎక్కడ ఉంచాలో వారికి తెలియదు... వారికి తెలియదు కనుక; అందువల్ల వారు నిరాశ చెందుతారు, అందువల్ల వారు నిరాశ చెందుతారు.

కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం కేవలం ప్రజలకు బోధన చేయడానికి "మీరు ప్రేమిస్తున్నారు. మీరు మిమ్మల్ని కూడా ప్రేమించే ఒక సరైన ప్రేమికుని కొరకు మీరు పిచ్చిగా వెతుకుతున్నారు. కానీ మీరు ఈ భౌతిక ప్రపంచం లోపల కనుగొనలేరు. దానిని మీరు కృష్ణుడిని ప్రేమించినప్పుడు మీరు తెలుసుకుంటారు." ఇది మన కృష్ణ చైతన్యము. ఇది చాలా నిరుపయోగము లేదా కల్పితమైనది కాదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు "నేను ఎవరినైనా ప్రేమించాలని కోరుకుంటున్నాను". ఆరాటపడటము కానీ ఆయన కృష్ణుని ప్రేమించడం లేదు కాబట్టి నిరాశకు గురవుతున్నాడు. ఇది (స్పష్టమైనది కాదు). మీరు మీ ప్రేమ భావనను కృష్ణుని మీదకు మార్చినట్లయితే, అప్పుడు మీరు పూర్తిగా, మీరు పూర్తిగా సంతృప్తి చెందుతారు, yayātmā samprasī..., suprasīdati ( SB 1.2.6) మనము మనశ్శాంతిని, మనశ్శాoతిని, పూర్తి సంతృప్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ పూర్తి సంతృప్తిని సాధించవచ్చు మీరు కృష్ణుని ఎలా ప్రేమించాలో తెలుసుకుంటే . ఈ రహస్యము ఉంది. లేకపోతే మీరు చేయలేరు. ఎందుకంటే... ఎందుకంటే మీరు ప్రేమించి సంతృప్తి పొందాలను కుంటున్నారు- మీరు కృష్ణుని ప్రేమించే స్థితికి వచ్చినప్పుడు అది పూర్తవుతుంది