TE/Prabhupada 1051 - నాకు సామర్థ్యం లేదు నేను నా గురువు యొక్క ఆదేశాలను నా ప్రాణము మరియు ఆత్మగా తీసుకున్నాను



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


నాకు సామర్థ్యం లేదు, కానీ నేను నా గురువు యొక్క ఆదేశాలను, నా ప్రాణము మరియు ఆత్మగా తీసుకున్నాను

ప్రభుపాద: మీరు రోజు పాడటము లేదా? కానీ మీరు భావమును అర్థం చేసుకున్నారా? లేదా మీరు కేవలము పాటను మాత్రమే పాడుతున్నారా? అర్థం ఏమిటి? ఎవరు వివరించగలరు? అహ్? ఎవరికీ తెలియదా? సరే చెప్పండి, అర్థమేమిటి?

భక్తుడు: "నా యొక్క కోరిక ఒక్కటే, నా ఆధ్యాత్మిక గురువు యొక్క నోటి నుండి వచ్చే ఉపదేశాలు నా మనసును పవిత్రము చేయాలి. నాకు వేరే వాటి కొరకు ఏవిధమైనా కోరిక లేదు. "

ప్రభుపాద: అవును. ఇది ఆజ్ఞ Guru-mukha-padma-vākya, cittete koriyā aikya. ఇప్పుడు, చిత్త అంటే అర్థం చైతన్యము, లేదా హృదయము. నేను ఇది మాత్రమే చేస్తాను, నా గురు మహారాజు నాకు చెప్పారు; నేను దీనిని చేస్తాను." Cittete koriyā aikya, ār nā koriho mane āśā. ఇది నా గర్వం కాదు, కానీ నేను చెప్పగలను, మీ ఉపదేశము వలన, నేను చేసాను. అందువల్ల నా గురు సోదరుల కంటే మీరు చూస్తున్న నా కొద్దిపాటి విజయమునకు కారణము దీని వలన. నాకు ఎటువంటి సామర్ధ్యం లేదు, కానీ నేను దీనిని తీసుకున్నాను. నా గురువు యొక్క ఉపదేశాలు, నా ప్రాణము మరియు ఆత్మగా తీసుకున్నాను. ఇది సత్యము. Guru-mukha-padma-vākya, cittete koriyā aikya. అందరూ అలా చేయాలి. ఆయన ఏమైనా అదనంగా చేస్తే, మార్పు చేస్తే, అప్పుడు ఆయన పతనము అవుతాడు. అదనంగా ఏమీ చేయవద్దు, మార్పులు చేయ వద్దు. మీరు గురువు దగ్గరకు వెళ్ళాలి. గురువు అంటే భగవంతుని యొక్క నమ్మకమైన సేవకుడు, కృష్ణ- ఆయనను ఎలా సేవించాలి అనే తన మాటను తీసుకోవాలి. అప్పుడు మీరు విజయవంతమవుతారు. మీరు మీ సొంతముగా ఆలోచిస్తే, "నేను నా గురువు కంటే చాలా తెలివైనవాడిని, నేను అదనంగా చేయగలను లేదా మార్పు చేయగలను, " అంటే అప్పుడు మీరు పతనము అవుతారు. కాబట్టి అది మాత్రమే. ఇప్పుడు, మరింత పాడండి.

భక్తుడు: Śrī-guru-caraṇe rati, ei se uttama-gati.

ప్రభుపాద: Śrī-guru-caraṇe rati, ei se, uttama-gati. మీరు వాస్తవమైన పురోగతిని చెందాలనుకుంటే, మీరు గురువు యొక్క కమల పాదముల వద్ద దృఢంగా విశ్వాసముగా ఉండాలి. అప్పుడు?

భక్తుడు:Je prasāde pūre sarva āśā. Prabhupāda: Je prasāde pūre sarva āśā. Yasya prasādāt... ఇది మొత్తం వైష్ణవ తత్వములో ఉపదేశము. కాబట్టి మనం అలా చేయకపోతే, మనము మూర్ఖులుగా ఉంటాము, ఇది Ajāmila upākhyānaలో వివరించబడినది. ఈరోజు మనము ఈ శ్లోకమును చదువుతున్నాము, sa evaṁ vartamānaḥ ajñaḥ. మళ్ళీ ఆయన చెప్పాడు. మళ్ళీ వ్యాసదేవుడు చెప్తున్నాడు ఈ మూర్ఖుడు దానిలో నిమగ్నమై ఉన్నాడు..., ఆయన కుమారుడైన, నారాయణుడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఆయనకు తెలియదు, "ఈ అర్థంలేని నారాయణ అంటే ఏమిటి?", ఆయనకు తన కుమారుడు తెలుసు. కానీ నారాయణుడు చాలా కరుణ కలిగి ఉన్నాడు, ఆయన నిరంతరం తన కుమారుడిని పిలుస్తున్నాడు కనుక, నారాయణ, దయచేసి ఇక్కడకు రా. నారాయణ, దయ చేసి దీన్ని తీసుకో, కానీ కృష్ణుడు "ఆయన నారాయణ నామమును జపిస్తున్నాడు." అని తీసుకుంటున్నాడు కృష్ణుడు చాలా కరుణామయుడు. ఆయన ఎప్పుడు అనుకోలేదు "నేను నారాయణ దగ్గరకుకు వెళ్తున్నాను." అని ఆయన తన కుమారుని కోరుకున్నాడు ఎందుకంటే ఆయన వాడి మీద చాలా అభిమానము కలిగి ఉన్నాడు. కానీ ఆయనకు నారాయణుని పవిత్ర నామాన్ని జపించే అవకాశం వచ్చింది. ఇది ఆయన అదృష్టం. అందువలన, దీని ప్రకారం, మనము పేరును మారుస్తాము. ఎందుకు? ఎందుకంటే ప్రతి పేరు కృష్ణుడి సేవకునిగా ఉండటానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఉపేంద్ర వలె. ఉపేంద్ర అంటే వామనదేవుడు కాబట్టి మీరు "ఉపేంద్ర, ఉపేంద్ర" లేదా అదే రకమైన పేరుతో పిలిస్తే, ఆ నామమును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి తరువాత అది వివరించబడుతుంది.

ఇక్కడ కూడా చెప్పబడింది... మొట్టమొదటి శ్లోకములో మూర్ఖుడు అని చెప్పబడింది, రెండవ శ్లోకములో కూడా చెప్పబడింది, sa evaṁ vartamānaḥ ajñaḥ.. Ajña అనగా మూర్ఖుడు. Mūḍha అంటే మూర్ఖుడు. అజ్ఞాః అంటే అజ్ఞానం, అమాయకుడు, జ్ఞానం లేనివాడు. Jña అంటే అర్థం జ్ఞానం కలిగినవాడు అని అర్థం. అజ్ఞాని అంటే జ్ఞానం లేని వాడు అని అర్థం. Mṛtyu-kāla upasthite. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోని ప్రతిఒక్కరు, ఆయన మూర్ఖుడు, అజ్ఞాని. ఆయన పట్టించుకోడు "నేను మరణించ వలసి ఉంటుంది ప్రతిదీ నాశనము అయినప్పుడు, నా ప్రణాళికలు, అన్నీ నా ఆస్తులు, ప్రతిదీ, నాశనము అవుతుంది. " అది ఆయనకు తెలియదు. ఆయనకు తెలుసు, కానీ ఆయన ఈ విషయాలను గమనించుటకు శ్రద్ధ వహించడు. అందువల్ల ప్రతి ఒక్కరూ మూర్ఖుడు మరియు అజ్ఞాని. అప్పుడు, మరణం వచ్చినప్పటికీ,matiṁ cakāra tanaye bāle nārāyaṇāhvaye. ఆయన అనుభూతి చెందుతున్నాడు "నేను ఇప్పుడు చనిపోతున్నాను, మృత్యువు దగ్గరకు వచ్చింది." ఇప్పటికీ, ఆయన తన పిల్లవాడు గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి yaṁ yaṁ vāpi vāpi vāpi vāpi smaran loke tyajaty ante ( BG 8.6) ఆయనకి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆయన నామము నారాయణ.

ఇప్పుడు, ఆయన పరిస్థితి విభిన్నంగా ఉన్నది. కానీ నేను అదేవిధముగా ప్రభావితం అయితే, అదేవిధముగా నా కుక్క మీద ప్రేమను కలిగి ఉంటే,అప్పుడు నా పరిస్థితి ఏమిటి? లేదా ఏదైనా. సహజముగా, నేను నా కుక్క గురించి ఆలోచిస్తాను, వెంటనే నేను ఒక కుక్క వలె మరొక శరీరమును పొందుతాను, లేదా కుక్క అవుతాను. ఇది ప్రకృతి చట్టం. Ya Ya ya vāpi vanni smaran loke tyajaty ante kalevaram. ఆ సమయంలో... పరీక్ష మరణము సమయంలో ఉంటుంది, మీరు ఏ విధమైన శరీరం పొందుతారో. కాబట్టి yaṁ yaṁ vāpi smaran bhāvam. ... ఆయన తన కొడుకు పట్ల ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఆయన తన కుమారుని గురించి ఆలోచిస్తున్నాడు. అదేవిధముగా, మీరు మీ కుక్కకు లేదా ఇంకొకరి మీద ఎంతో ప్రేమగా ఉంటే, ఆ సమయంలో మీరు ఆలోచిస్తుంటారు. కాబట్టి హరే కృష్ణను అభ్యాసం చేయండి, కావున మరణం సమయంలో మీరు కృష్ణుడి గురించి ఆలోచించవచ్చు మరియు మీ జీవితం విజయవంతమవుతుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద