TE/Prabhupada 1052 - మాయ యొక్క ప్రభావం వలన మనము 'ఇది నా ఆస్తి' అని అనుకుంటున్నాము



750522 - Conversation B - Melbourne


మాయ యొక్క ప్రభావం వలన మనము 'ఇది నా ఆస్తి' అని అనుకుంటున్నాము

మధుద్విస:...మన ప్రియమైన స్నేహితులలో ఒకరు, రేమండ్ లోపెజ్. ఆయన ఒక న్యాయవాది , ఆయన మన దగ్గరకు వస్తారు మనకు ఎంతో సహాయము చేశారు, మనకు మెల్బోర్న్లో ఉన్న కొన్ని చట్టపరమైన విషయాలలో. మరియు మిస్టర్ వాలి స్ట్రోబ్స్ కూడా, ఆయన కూడా మనకు సహాయం చేశారు మరియు మనకు మంచి మార్గదర్శకత్వం ఇచ్చారు. వీరు బాబ్ బోర్న్, ఆయన ఒక ఫోటోగ్రాఫర్ మనకు... ఆయన మాయాపూర్ పండుగకు తీసుకువచ్చిన అర్చామూర్తుల యొక్క మంచి ఛాయాచిత్రాల (ఫోటో గ్రాఫ్) ను తీశారు.

ప్రభుపాద:, అవును. మధుద్విస: చాలా బాగుంది. ఆయన మన కోసము చాలా ఛాయాచిత్రాలను తీశారు. మనము ముఖ్యంగా వాలీ మరియు రేమండ్ కు రుణపడి ఉన్నాము పోలీసులతో మన వ్యవహారాలలో మంచి మార్గదర్శకత్వం ఇచ్చినందుకు. ఒకసారి మూడు సంవత్సరాల క్రితము ఒక సందర్భము ఉంది, రథయాత్ర పండుగ సందర్భముగా కొందరు అబ్బాయిలు ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు, వారు బయటకు వెళ్లి చట్టవిరుద్ధంగా కొన్ని పుష్పాలను తీసుకు వచ్చారు. కాబట్టి వారు పట్టుబడ్డారు.

ప్రభుపాద: అక్రమంగా? ఎక్కడ? పార్క్ లో?

మధుద్విస: కాదు. ఒక పువ్వులు పెంచుతున్న నర్సరిలో.

ప్రభుపాద: ఓ

మధుద్విస: కాబట్టి వారిని చూసి పట్టుకున్నారు. కానీ కృష్ణుడి యొక్క కరుణ కారణంగా రేమండ్ వారిని విడుదల చేయించాడు కానీ అది మనకు మంచి పాఠం నేర్పింది.

రేమండ్ లోపెజ్: వాస్తవమునకు, నేను వారు తప్పుడు ప్రజలు కలిగి ఉన్నారు అనుకుంటున్నాను.

ప్రభుపాద: దక్షిణ భారతదేశంలో గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక ఖజానా(ట్రెజరీ) ఆఫీసర్. ఆయన ఖజానా నుండి డబ్బు తీసుకుని మంచి ఆలయం నిర్మించారు. (నవ్వు) అవును. తరువాత, ఆయన పట్టుబడ్డాడు, ఆయనను నవాబ్ జైలులో ఉంచారు. ఆ సమయంలో ముహమ్మదీయుల రాజు, నవాబ్ ఉన్నారు, ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, చాలా అందమైనవారు నవాబ్ కలలోకి వచ్చారు: అయ్యా, ఆయన తీసుకున్న డబ్బు, మీరు మా నుండి తీసుకొని ఆయనని విడుదల చేయండి. కాబట్టి నవాబ్ అన్నాడు, "నా డబ్బు నాకు లభిస్తే నేను ఆయనని విడుదల చేస్తాను." అప్పుడు, తన కల చెదిరినప్పుడు, ఆయన నేలపై డబ్బును చూసినాడు, అక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఆయన గొప్ప భక్తుడు అని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతన్ని పిలిపించాడు, "మిమ్మల్ని విడుదల చేస్తున్నాను, మీరు ఈ డబ్బును కూడా తీసుకోవచ్చు. మీరు ఇప్పటికే తీసుకున్నది ఏమైనప్పటికీ, అది సరియైనది. ఇప్పుడు ఈ డబ్బు కూడా మీరు తీసుకోవచ్చు. మీరు ఇష్టపడే విధముగా ఖర్చు చేసుకోవచ్చు. " కాబట్టి భక్తులు కొన్నిసార్లు అలా చేస్తారు. వాస్తవమునకు, ఏదీ ప్రైవేట్ ఆస్తి కాదు. అది మన తత్వము. Īśāvāsyam idaṁ sarvam ( ISO 1) "అంతా భగవంతునికి చెందుతుంది." అది సత్యము. మాయ ప్రభావంలో మనం ఆలోచిస్తున్నాం, "ఇది నా ఆస్తి." అని ఉదాహరణకు ఈ మంచమును తీసుకుందాం. చెక్క ఎక్కడ నుండి వచ్చినది? ఎవరైనా చెక్కను ఉత్పత్తి చేశారా? ఎవరు ఉత్పత్తి చేసారు? ఇది భగవంతుని ఆస్తి. బదులుగా, మనము భగవంతుని ఆస్తిని దొంగిలించి, "నా ఆస్తి" అని చెప్పుకుంటున్నాము. తరువాత ఆస్ట్రేలియా. ఆంగ్లేయులు ఇక్కడకు వచ్చారు, కానీ ఇది ఆంగ్లేయుల ఆస్తా? ఇది అక్కడ ఉంది. అమెరికా, ఇది అక్కడ ఉంది. ప్రతిదీ పూర్తి అయినప్పుడు, అది ఉంటుంది. మధ్యలో మనము వచ్చి, "ఇది నా ఆస్తి", అని పోరాడతాము. అవునా కాదా? మీరు ఒక న్యాయవాది, మీరు చక్కగా ఆలోచించ వచ్చు.

వాలి స్ట్రోబ్స్: ఆయన వాదించిన వాదన అది.

రేమండ్ లోపెజ్: లేదు, ఇది (అస్పష్టమైనది). (నవ్వు)

ప్రభుపాద: మొదట, ప్రతిదీ భగవంతునికి చెందుతుంది. ఎందుకు మనము "ఇది నా ఆస్తి" అని ఎందుకు చెప్తున్నాము? ఉదాహరణకు మీరు ఇక్కడకు వచ్చారని అనుకుందాం. మీరు ఒక గంట, రెండు గంటల పాటు కూర్చుని, "ఇది నా ఆస్తి" అని మీరు చెప్తే, అది చాలా మంచి తీర్పునా. మీరు వెలుపలి నుండి వచ్చారు, రెండు గంటలు ఇక్కడ కూర్చోవటానికి మీకు అనుమతించారు, మీరు చెప్పుకుంటే, "ఇది నా ఆస్తి..." అదేవిధముగా , మనము ఇక్కడకు వస్తాము. అమెరికాలో లేదా ఆస్ట్రేలియాలో లేదా భారతదేశంలో మనము జన్మించాము, యాభై, అరవై లేదా వంద సంవత్సరాలు ఉంటాము, నేను ఎందుకు చెప్పాలి, "ఇది నా ఆస్తి"? అని