TE/Prabhupada 1054 - శాస్త్రవేత్త, తత్వవేత్త, పండితుడు - అందరు దేవుడిని నమ్మని వారే



750522 - Conversation B - Melbourne


శాస్త్రవేత్త, తత్వవేత్త, పండితుడు - అందరు దేవుడిని నమ్మని వారే

ప్రభుపాద: కావున ఈ ఐక్యరాజ్యసమితి ఒక వైఫల్యము, అది భగవంతుడు చైతన్యము లేనందున అది విఫలమవుతుంది.

బాబ్ బోర్న్: ఇది విఫలమయిందని నేను భావించడం లేదు.

ప్రభుపాద: అయ్యో?

బాబ్ బోర్న్: ఇది విఫలమయిందని నేను భావించడం లేదు. నేను అనుకోను... నేను విషయాలు ప్రపంచవ్యాప్తంగా, తప్పని సరిగా, మారుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇది వారు తీసుకునే మార్గము బట్టి ఉంటుంది. ప్రభుపాద: లేదు, ఏది మారుతుంది? వారు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడ మారుతుంది? కొంచెం రెచ్చగొడితే చాలు, యుద్ధం ఉండవచ్చు.

రేమండ్ లోపెజ్: అవును, కానీ ప్రజలు ఇప్పుడు మారుతున్నారు. మీరు యువకులను పొందుతున్నారు, వారు కొన్ని సంవత్సరాలలో తొలిసారిగా, వారి సొంత పట్టణం వెలుపల విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు, తెలుసుకుంటున్నారు వారి సొంత వ్యక్తిగత రాష్ట్రము గురించి లేదా వారు కలిగి ఉన్నది ఏదైనా. మీకు ప్రజలు ఉన్నారు, పేదరికం వంటి విషయాలలో ఇప్పుడు యువకులు ఆసక్తి కలిగి ఉన్నారు. వారు బంగ్లాదేశ్ మరియు చాల వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది బాగుంది. కానీ ఏది ఏమైనా ప్రజలను మీరు గొప్ప సంఖ్యలో కలిగి ఉన్నారు ఎవరైతే ఆ ఆలోచనలో ఉంటారో "నేను సరిగ్గా ఉన్నాను, నేను నా గురించి చూసుకుంటాను" మొత్తం విషయము గురించి తీసుకోకుండా. నేను అనుకుంటాను మీరు ఎంత కాలము విభిన్న భావాలను మరియు నమ్మకాలను కలిగి ఉంటారో ఇది చాలా కష్టము అవుతుంది మీరు ఏమి మాట్లాడుతున్నారు అనే దానిని అర్థం చేసుకుంటానికి

ప్రభుపాద: అవును, అది మొదట ఐక్యమవ్వాలి. ఆ... మొదటి విషయము ప్రతి ఒక్కరిని ఒప్పించాలి లేదా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రతిదీ భగవంతునికి చెందుతుంది అని. కానీ వారికి భగవంతుని గురించి ఎటువంటి అవగాహన లేదు. అంటే... ప్రస్తుత క్షణం మొత్తం మానవ సమాజం, ఎక్కువ మంది వారు భగవంతుని నమ్మరు , ముఖ్యంగా కమ్యూనిస్ట్. వారు గుర్తించరు. శాస్త్రవేత్త, తత్వవేత్త, పండితులు-అందరు భగవంతుని నమ్మని వారే. శాస్త్రవేత్తల యొక్క ప్రత్యేక కర్తవ్యము భగవంతుణ్ణి ఎలా తిరస్కరించాలి వారు "సైన్స్ ప్రతిదీ, మనము సైన్స్ ద్వారా ప్రతిదీ చేయవచ్చు, భగవంతుని అవసరం లేదు." అహ్?

వాలీ స్ట్రోబ్స్: నేను అలా అనుకోవడము లేదు. వారు మరింత జ్ఞానము కలిగి ఉన్నారు.

ప్రభుపాద: ఇంక లేదా?

వాలీ స్ట్రోబ్స్: సరే, కొన్ని వర్గాలలో, అవును, నేను అనుకుంటున్నాను.

ప్రభుపాద: ఇది ఎన్నడూ లేదు, కానీ వారు తెలుసుకుంటే, అది చాలా మంచిది.

రేమండ్ లోపెజ్: అయితే, భగవంతుడు సంకల్పమునకు వ్యతిరేకముగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు మీరు చెప్పలేరు.

ప్రభుపాద: అవును, వారు చెప్తారు. వాళ్ళు చెప్తారు. అవును. నేను అనేక శాస్త్రవేత్తలను కలుసుకున్నాను. వారు "శాస్త్రీయ పురోగతి ద్వారా మనము ప్రతిదీ పరిష్కరిస్తాము మనము ఇప్పటికే చేశాము. "వారు ఇలా అంటున్నారు

రేమండ్ లోపెజ్: కానీ వారు ఎందుకంటే...

ప్రభుపాద: ఒక గొప్ప సిద్ధాంతం, రసాయన సిద్ధాంతం ఉన్నట్లుగానే. ఒక గొప్ప శాస్త్రవేత్త... పెద్ద వాడు లేదా చిన్నవాడు, ఆయన ఏమైనా ఆవవచ్చు, ఆయనకి నోబెల్ బహుమతి లభించింది.

రేమండ్ లోపెజ్: ఆయన మధ్యస్తము. (నవ్వుతున్నారు)

ప్రభుపాద: హు్?

రేమండ్ లోపెజ్: ఆయన మధ్యస్తము రకము.

ప్రభుపాద: అవును. రసాయనల కలయిక, రసాయన పరిణామం ద్వారా రసాయనాలు నుండి జీవితం వచ్చిందని ఆయన సిద్ధాంతం చేస్తున్నాడు. డార్విన్ సిద్ధాంతం కూడా అలాగనే ఉంది. ఇది వారి... పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వారు జీవితం పదార్ధము నుండి వచ్చింది అని అంటారు ఎంతో మూర్ఖులు వారు. రుజువు ఎక్కడ ఉంది? ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో భోదిస్తున్నాడు, అక్కడ ఒక విద్యార్థి, ఆయన నా శిష్యుడు, అతన్ని సవాలు చేసాడు మీ దగ్గర రసాయనాలు ఉంటే, మీరు జీవితాన్ని తయారు చేయగలరా? ఆయన సమాధానం, "నేను చెప్పలేను." ఎందుకు? మీరు ఈ సిద్ధాంతాన్ని చెప్తున్నారు, జీవితం రసాయనం నుండి వచ్చింది అని. సైన్స్ అంటే పరిశీలన మరియు ప్రయోగం. ఇప్పుడు ప్రయోగాత్మకంగా రసాయనాలు ఒక జీవితం ఉత్పత్తి చేస్తాయని నిరూపించండి.

రేమండ్ లోపెజ్: వారు ప్రయత్నిస్తున్నారు. (నవ్వు)

ప్రభుపాద:అది మరొక మూర్ఖత్వం. మీరు ఒక న్యాయవాదిగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అంటే మీరు న్యాయవాది అని అర్థం కాదు. మీరు న్యాయశాస్త్ర విద్యార్ధి అయినప్పుడు "నేను న్యాయవాదిని" అని చెప్పకూడదు. అది మీరు చెప్పకూడదు. మీరు ప్రయత్నిస్తున్నారు, అది మరొక విషయము. కానీ వారు ప్రయత్నిస్తున్నప్పుడు, వారు నాయకుడి స్థానాన్ని తీసుకుంటారు. అది తప్పుదోవ పట్టిస్తుంది. ఇది శ్రీమద్-భాగవతములో వివరించబడింది, andhā yathāndhair upanīyamānāḥ ( SB 7.5.31) ఒక గ్రుడ్డివాడు చాలామంది ఇతర గ్రుడ్డి వాళ్ళను నడిపించటానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి నడిపించడము వలన ఉపయోగం ఏమిటి? నాయకుడు గ్రుడ్డివాడు అయితే , ఇతర అంధులకు ఆయన ఎలా మేలు చేస్తాడు?

బాబ్ బోర్న్: బీతొవెన్ చెవిటివాడు.

ప్రభుపాద: హ్?

బాబ్ బోర్న్: బీతొవెన్ చెవిటివాడు.

ప్రభుపాద: అది ఏమిటి?

మధుద్విస: బీతొవెన్, గొప్ప స్వరకర్త, ఆయన చెవిటివాడు.

బాబ్ బోర్న్: కనీసం, తన జీవితంలో కొంత భాగము.

రేమండ్ లోపెజ్: మనుషులలో కొంత మంది మంచి కొరకు మంచి పనులు చేసే వారు ఉండరా?

ప్రభుపాద: కానీ మంచి ఏమిటి అని ఆయనకు తెలియదు.

రేమండ్ లోపెజ్: కానీ కొన్ని నిర్దిష్టమైన విషయాలు ఉన్నాయి...

ప్రభుపాద:అందువలన నేను గుడ్డి వాడిని అని అంటున్నాను. ఆయనకు మంచి ఏమిటో తెలియదు. వాస్తవ సత్వ గుణము భగవంతుని అర్థం చేసుకోవడము. ఇది నిజమైన మంచితనము.

రేమండ్ లోపెజ్: కానీ మీరు చేయని కొన్ని విషయాలు ఉన్నాయి... అవి మంచివి, మీరు వాటిని మంచిగా అంగీకరించవచ్చు. ఇప్పుడు, మీరు ఒక వృద్ధ మహిళ మీదకు ఒక ఒక కారు రాబోతూ ఉంటే, మీరు వెళ్ళి ఆమెకు సహాయం చేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు వాటంతటికి అవే మంచివిగా ఉంటాయి, నేను అనుకుంటున్నాను, ప్రజలు స్పందించి మంచి పనులను చేస్తారు, వారికి భగవంతుని మీద ఎటువంటి అభిప్రాయము లేకపోయినా

ప్రభుపాద: కాదు. మీరు వాస్తవమైన వేదిక మీద ఉండకపోతే, మీరు ఎలా మంచి చేస్తారు? ఉదహరణకు మా మధుద్విశ మహారాజు మీకు రుణపడి ఉన్నట్లుగా. వారు చట్టపరమైన వ్యవహారాలు చక్కగా చూసుకున్నారు కానీ మీరు ఒక న్యాయవాది, న్యాయవాది అయితే తప్ప, అది ఎలా చేయగలరు? మీకు మంచి మనస్సు ఉంది మంచి పనులు చేయడానికి , కానీ మీరు ఒక న్యాయవాది కాకపోతే, మీరు ఎలా చేయగలరు?

వాలీ స్ట్రోబ్స్: కానీ చాలామంది న్యాయవాదులు, చేసే వారు ఉన్నారు ...

ప్రభుపాద: కాదు, అది మరొక విషయము. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మంచి ఏమిటో తెలియకపోతే, ఆయన ఎలా మంచి చేస్తాడు? మొట్టమొదటి పని మంచి ఏమిటో ఆయన తెలుసుకోవాలి. అప్పుడు ఆయన కొంత మంచి చేయగలడు. లేకపోతే, కోతి వలె ఎగరడము వలన ఉపయోగం ఏమిటి? ఆయన తెలుసుకోవాలి. మీరు ఒక న్యాయవాది కనుక మీరు చట్టముతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి; మీరు మంచి చేయవచ్చు. కానీ ఒక చదువు లేని వ్యకి, న్యాయవాది కానీ వాడు, ఆయన ఎలా మంచి చేయగలడు? అందుచేత, సమాజంలో మంచి చేయటానికి, నాయకుడిని అని తనను తాను చెప్పుకునే వ్యక్తి, ఆయన మొదట మంచి అంటే ఏమిటో మొదట తెలుసుకోవాలి.