TE/Prabhupada 1061 - అయిదు విభిన్న సత్యములను అర్థం చేసుకొనుట భగవద్గీతలో చర్చింపబడిన విషయము



660219-20 - Lecture BG Introduction - New York

అయిదు విభిన్న సత్యములను అర్థము చేసుకొనుట భగవద్గీతలో చర్చింపబడిన విషయము కావున శ్రీకృష్ణుడు అవతరించెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి ( BG 4.7) కేవలము జీవిత ముఖ్య ఉద్దేశ్యమును స్థాపించుటకై మానవుడు జీవిత ముఖ్య ఉద్దేశ్యమును ఆశయమును విస్మరించినప్పుడు, దానిని ధర్మస్య గ్లాని అని అంటారు. మానవుని ధర్మమునకు భంగము కలిగినప్పుడు ఆ పరిస్థితులలో, వేలాది మానవులలో తమ నిజస్థితిని అవగాహన చేసుకొనుటకై ప్రయత్నించు అతని కొరకే భగవద్గీత ఉపదేశించబడినది వాస్తవమునకు మన పరిస్థితి అజ్ఞానము అనే పులి చేత మ్రింగివేయబడుట వలె యున్నది భగవానుడు జీవులపట్ల పరమదయను కలిగినవాడు ప్రత్యేకముగా మానవులకొరకు భగవద్గీతను ఉపదేశించారు మిత్రుడైన అర్జునుని తన శిష్యునిగా చేసుకొని

శ్రీకృష్ణునికి సహచరుడు అయినందున అర్జునుడు తప్పకుండా అజ్ఞానమునకు అతీతుడే కానీ కురుకేత్ర యుద్ధమున అర్జునుడు అజ్ఞానము నందు ఉంచబడెను భగవంతున్ని జీవిత సమస్యలను గూర్చి కేవలము ప్రశ్నించుటకు తద్ద్వారా భవిష్యత్తు తరాల మానవుల ప్రయోజనము కొరకై శ్రీకృష్ణ భగవానుడు వాటిని వివరించుటకై మానవుడు తన జీవితమునకు ప్రణాళికను తయారుచేసుకొని ఆచరించుటకు మానవజీవితము యొక్క జీవితలక్ష్యము పరిపూర్ణము చేసుకొనవలెను.

అయిదు విభిన్న సత్యములను అర్థము చేసుకొనుట భగవద్గీతలో చర్చింపబడిన విషయము భగవంతుడు అంటే ఏమిటి అనునది మొదటి సత్యము భగవంతుని శాస్త్రములలో ఇది ప్రాథమిక అధ్యయన అంశము ఆ భగవంతుని శాస్త్రము ఇక్కడ వివరించబడినది పిదప జీవుని నిజరూపస్థితి వివరింపబడినది ఈశ్వర మరియు జీవుడు. దేవాదిదేవుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నియంత్రించువాడు, జీవులు నియంత్రించువారు కాదు. నియంత్రించబడేవారు కృత్రిమముగా నేను నియంత్రించబడే వాడిని కాదు. నేను స్వతంత్రుడిని అని అనుట విచక్షణ కలిగిన వాని లక్షణము కాదు జీవుడు ప్రతి విషయములోను నియంత్రించబడుచున్నాడు కనీసము తన బద్ధజీవితము నందు అయినా నియంత్రించబడుతున్నాడు కావున భగవద్గీతలో ఈశ్వరుడు గురించి వివరించబడినది పరమ నియంత మరియు నియంత్రించబడిన జీవులు మరియు భౌతిక ప్రకృతి తరువాత కాలము. సమస్త విశ్వము ప్రకటితమయ్యెడి కాలము భౌతిక ప్రకృతి వ్యక్తమయ్యే విధానము కాలపరిమాణం లేదా శాశ్వత కాలమును గురించి వివరింపబడినది మరియు కర్మ. కర్మ అనగా కార్యకలాపాలు సమస్త విశ్వము వివిధ కార్యకలాపాలతో పూర్తిగా వున్నది ప్రత్యేకముగా జీవులు, జీవులందరు వివిధ కార్యకలాపాలలో నిమగ్నమైయున్నారు అందువలన మనము భగవద్గీత నుండి భగవంతుడు (ఈశ్వరుడు) అంటే ఎవరో నేర్చుకొనవలెను జీవులు అంటే ఎవరు. భౌతిక ప్రకృతి అంటే ఏమిటి కాలము చేత ఎలా భౌతిక ప్రకృతి నియంత్రించబడుతున్నది. ఈ కార్యకలాపాలు ఏమిటి.

ఈ అయిదు పాఠ్యంశాలలో, భగవద్గీత వివరిస్తున్నది దేవాదిదేవుడు లేదా శ్రీకృష్ణుడు లేదా బ్రహ్మణ్ లేదా పరమాత్మ మీరు ఏ నామముతోనైనా పిలువవచ్చును. కానీ పరమ నియంత్రుడు వున్నాడు పరమనియంత్రుడు అందరిలోకెల్ల గొప్పవాడు జీవుల లక్షణములు పరమ నియంత్రుడి లక్షణముల వలె వున్నవి భగవంతునివలె భౌతిక ప్రకృతి లోని సమస్త కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడు భగవద్గీత చివరి అధ్యాయాలలో వివరించబడుతున్నది, భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు ప్రకృతి దేవాదిదేవుని నిర్దేశానుసారము నడుస్తున్నది మయాధ్యక్షేన ప్రకృతిః సూయతే స చరాచరమ్ ( BG 9.10) ఈ భౌతిక ప్రకృతి నా నిర్దేశానుసారము నడుస్తున్నది. మయాధ్యక్షేన. నా పర్యవేక్షణలో