TE/Prabhupada 1072 - భౌతిక జగత్తును విడిచి శాశ్వత ధామములో మన శాశ్వత జీవితమును పొందుటకు



660219-20 - Lecture BG Introduction - New York

భౌతిక జగమును విడిచి పెట్టుట మరియు శాశ్వత జీవితమును శాశ్వత ధామములో పొందుట. అతని అపారమైన కరుణ వలన తనకు తాను శ్యామసుందరునిగా ప్రదర్శించుకొనును. దురదృష్టవశాత్తు అల్పజ్ఞులైన కొందరు ఆ దేవదేవుని అపహాస్యము చేయుదురు. అవజానంతి మాం మూఢా ( BG 9.11) ఎందుకంటే అతడు మనలో ఒకడిగా వచ్చి సామాన్య మానవునిగా క్రీడించును, కావున దీనిని బట్టి ఆ దేవదేవుని మనలో ఒకరిగా భావించరాదు. సర్వ శక్తిమత్వము చేతనే అతడు తన నిజరూపముతో మన ఎదుట ప్రత్యక్షమై తన ధామము నందలి లీలలకు ప్రతిరూపమైన లీలలను ప్రదర్శించును. భగవంతుని ధామమున బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకములైన లోకములు నిలిచియున్నవి. అసంఖ్యాక లోకములు సూర్య కిరణములందు నిలిచియున్నవి, దివ్యధామమైన కృష్ణ లోకము, గోలోకము నుండియే ఆ బ్రహ్మజ్యోతి వెలువడుచున్నది, ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః(బ్రహ్మ సంహిత 5-37) ఆ గ్రహాలు అన్నియు ఆధ్యాత్మిక గ్రహములు. అవి ఆనంద చిన్మయ; అవి భౌతిక లోకములు కావు. కావున శ్రీకృష్ణ భగవానుడు పలికెను,

న తద్భాసయతే సూర్యో
న శశాంకో న పావకః
యద్గాత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ
( BG 15.6)

ఎవరైనా అట్టి ఆధ్యాత్మిక ఆకాశమును చేరిన యడల భౌతిక ఆకాశమునకు తిరిగి చేరవలసిన అవసరం లేదు. భౌతిక ఆకాశమున ఉన్నంత వరకు చంద్రలోకమును చేరుటను గూర్చి పలికేదేమున్నది..... చంద్ర లోకము, చాలా దగ్గర లోకము, కానీ అత్యున్నత లోకమును చేరినప్పటికీ, బ్రహ్మలోకమని అంటారు, అక్కడ కూడా భౌతిక జీవనములో ఉన్న కష్టాలే ఉంటాయి, జన్మము, మృత్యువు, వ్యాధి మరియు ముసలితనము అనెడి కష్టాలు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ లోకము ఈ భౌతిక ఉనికి యొక్క నాలుగు సూత్రాలు నుండి స్వేచ్ఛ కలిగిలేవు. కావున భగవంతుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను, ఆబ్రహ్మ భువనార్లోక పునరావృత్తినోర్జున ( BG 8.16) జీవులు ఒక గ్రహము నుండి వేరొక గ్రహమునకు పయనించుచున్నారు. కానీ ఇది కేవలం స్పుత్నిక్ యాంత్రిక అమరిక ద్వారా ఇతర గ్రహాలకు మనం చేరటం కాదు. ఎవరైనా ఇతర గ్రహములను చేరవలెను అని కోరినచో, ఓకే ప్రక్రియ కలదు. యాంతి దేవ వ్రతాన్ దేవాన్ పిత్రూన్న్యాంతి పితృవ్రతా ( BG 9.25) ఎవరైనా ఇతర గ్రహమును చేరవలెనని కోరినచో, చంద్రగ్రహం అనుకున్నచో, స్పుత్నిక్ ద్వారా వెళ్ళవలెనని ప్రయత్నించనవసరం లేదు. భగవద్గీత మనకు ఆదేశించుచున్నది, యాంతి దేవ వ్రతాన్ దేవాన్. చంద్రుడు, సూర్యుడు, ఉన్నత లోకములు అన్నియును స్వర్గ లోకములుగా పిలవబడును. స్వర్గలోకము. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. గ్రహములలో వివిధ స్థాయిలు ఉన్నవి. కావున దేవలోక, అవి అలా పిలవబడుచున్నవి. భగవద్గీత చాలా సరళ సూత్రము ద్వారా ఉన్నత లోకములకు, దేవలోకం, ఏవిధముగా పయనించవచ్చునో తెలుపుచ్చున్నది. యాంతి దేవ వ్రతాన్ దేవాన్. యాంతి దేవ వ్రతాన్ దేవాన్. దేవ వ్రతా, ఆ నిర్దిష్ట దేవతను పూజించుట అనే ప్రక్రియ సాధన చేసినచో, అప్పుడు ఆ నిర్దిష్ట గ్రహమునకు చేరగలము కూడా. మనము సూర్య గ్రహము కూడా చేరవచ్చును, మనము చంద్రగ్రహము చేరవచ్చును, మనము స్వర్గలోకమును చేరవచ్చును, కానీ భగవద్గీత మనకు ఏ విధమైన భౌతిక గ్రహములను చేరవలెనని సలహా ఇచ్చుటలేదు, ఎందువలనంటే బ్రహ్మలోకమునకు వెళ్ళినచో, అత్యున్నత లోకము, ఆధునిక శాస్త్రవేత్తలచే లెక్కించిన విధముగా మనము నలభై వేల సంవత్సరములు స్పుత్నిక్ ల ద్వారా ప్రయాణించినచో అత్యున్నత లోకమును చేరగలము. ప్రస్తుత్రం నలభై వేల సంవత్సరములు జీవించి భౌతిక జగత్తులోని అత్యున్నత లోకమును చేరుట సాధ్యము కాదు. కానీ ఎవరైనా తమ జీవితమును ఆ నిర్దిష్ట దేవతను పూజించుటకు కేటాయించినచో ఆ నిర్దిష్ట గ్రహమును చేరగలరు, భగవద్గీత యందు పేర్కొన్న విధముగా: యాంతి దేవ వ్రతాన్ దేవాన్ పిత్రూన్న్యాంతి పితృవ్రతా ( BG 9.25) అదేవిధంగా, పిత్రులోకం ఉన్నది. అదేవిధంగా, ఎవరైనా సర్వోన్నత లోకము చేరగోరినచో, సర్వోన్నత లోకము... సర్వోన్నత లోకము అనగా కృష్ణలోకము. ఆధ్యాత్మిక ఆకాశములో అసంఖ్యాక గ్రహాలు ఉన్నవి, సనాతన గ్రహాలు, శాశ్వత గ్రహాలు, ఏవైతే ఎప్పటికీ ధ్వంసము కానివి, నాశనము లేనివి. కానీ ఈ ఆధ్యాత్మిక గ్రహాలలో ఒక గ్రహము ఉన్నది, అసలైన లోకము, గోలోక వృందావనము అందురు. కావున ఈ సమాచారములు భగవద్గీత యందు ఉన్నవి, మరియు మనకు అవకాశము ఇవ్వబడినది ఈ భౌతిక జగత్తును విడిచి శాశ్వత ధామములో మన శాశ్వత జీవితమును పొందుటకు