TE/Prabhupada 0206 - వేదకాలము లోని సమాజములో ధనము అనే ప్రశ్నే లేదు

Revision as of 12:10, 14 July 2017 by Jogeswara (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0206 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- October 16, 1975, Johannesburg

ప్రభుపాద: "ప్రతి ఒక్కడూ మూర్ఖుడే," వారికి శిక్షణ ఇవ్వండి. అదే కావలసింది. అందరినీ మూర్ఖులుగానే పరిగణించండి. ఇక్కడ మేధావి అని గాని, మూర్ఖుడు అని గాని ప్రశ్నే లేదు. మొట్ట మొదట ఈ మూర్ఖులందరికి తర్ఫీదు ఇవ్వండి. అదే కావలసింది. ఇప్పుడు అదే కావలసి వుంది'. ప్రస్తుతం ఈప్రపంచం మొత్తం మూర్ఖులతోనే నిండివుంది. ఇప్పుడు, వారు కృష్ణ చైతన్యములో చేరటానికి ఇష్టపడితే, వారిలో నుండి ఎన్నుకోండి. అంటే నేను శిక్షణ ఇస్తున్నట్లుగా. మీరు శిక్షణ ద్వారా బ్రాహ్మణులు అయినారు. కనుక, ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకోనటానికి సిద్ధమవుతారో వారిని బ్రాహ్మలుగా పరిగణించండి. ఎవరైతే క్షత్రియునిగా శిక్షణ పొందుతారో వారిని క్షత్రియునిగా పరిగణించండి. ఈ విధంగా, cātur-varṇyaṁ māyā sṛṣ...

హరికేశ: మరియు ఆ క్షత్రియుడు అందరిని సూద్రులుగా పరిగణించి వారిలో నుంచి కొంతమందిని ఎంచుకుంటారు.

ప్రభుపాద: కాదు

హరికేశ:ఆ క్షత్రియుడు మొదట ఎంచుకుంటాడు ...

ప్రభుపాద: లేదు, లేదు, లేదు. మీరు ఎంచుకోండి. మీరు ఆ ప్రజలందరినీ సూద్రులుగా పరిగణించండి. అప్పుడు

హరికేశ: ఎంచుకోవలసి వుంది.

ప్రభుపాద: ఎంచుకోండి. ఇక ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్య కారో వారు ఇక శూద్రులు అవుతారు. అంతే. అది చాలా సులభం. ఎవరైతే ఇంజినీరుగా శిక్షణ పొంద లేక పోతారో, వారు సామాన్య ప్రజలుగా మిగిలిపోతారు. దీనిలో ఒత్తిడి అనేది లేదు. సమాజాన్ని నిర్వహించడానికి ఇదే మార్గం. ఒత్తిడి అనేది లేదు. శూద్రులు కూడా అవసరం.

పుష్ట కృష్ణ: ఇప్పుడు ఆధునిక సమాజంలో విద్యావంతులవటానికి లేదా ఇంజనీర్ అవటానికి ధనమే ప్రోత్సాహం వేద సంస్కృతిలో ప్రోత్సాహకం ఏమిటి?

ప్రభుపాద: డబ్బు అవసరం లేదు. బ్రాహ్మణులు అన్ని ఉచితముగా బోధిస్తారు. డబ్బు ప్రశ్న లేదు. ఎవరైనా, బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్య ఉచితముగా విద్యను గ్రహించవచ్చు. అక్కర్లేదు.... వైశ్యునికి చదువు అవసరము లేదు. క్త్రత్రియలకు తక్కువ అవసరం. బ్రాహ్మనుకి అవసరము. కానీ అది ఉచితం. కేవలం ఒక బ్రాహ్మణ గురువుని కనుగొన్నట్లయితే, ఆయన మీకు ఉచిత విద్యను భోదిస్తాడు. అంతే. ఇదే సమాజం. ఇప్పుడు, ప్రస్తుత కాలములో ఎవరైనా చదువు నేర్చుకోవాలంటే డబ్బు అవసరం. కానీ వేదకాల సమాజంలో చదువు కొనటానికి ధనము అవసరము లేదు. విద్య ఉచితం.

హరికేశ: కనుక సమాజ సుఖము అనేదే దీనికి ప్రోత్సాహం.

ప్రభుపాద: అవును, అదే ... ప్రతిఒక్కరూ "ఆనందం ఎక్కడ ఉంది?" అని ఆకాన్షతో వున్నారు. ఇదే ఆనందం. ప్రజలు శాంతిగా వుంటే, వారి జీవనము సంతోషముగా వుంటుంది. , అది ఆనందము చేకూరుస్తుంది. నాకు గనుక ఆకాశహర్మ్యం (ఎత్తైన భవనం) వుంటే, నేను సంతోషంగా ఉంటాను అని ఊహిన్చటం మంచిది కాదు. అది అక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకోనటానికి మాత్రమే. అదే జరుగుతోంది. అతను ఇలా ఆలోచిస్తున్నాడు "నాకు గనుక ఒక ఆకాశహర్మ్యం (ఎత్తైన భవనం) ఉంటే, నేను సంతోషంగా ఉంటాను". అతను భంగ పడినప్పుడు అక్కడ నుండి దూకుతాడు. అది జరుగుతోంది. ఇదీ ఆనందం. అనగా అందరూ మూర్ఖులే. వారికి ఆనందం అంటే ఏమిటో తెలియదు. అందువలన ప్రతి ఒక్కరికీ కృష్ణుని నుండి మార్గదర్శకత్వం కావాలి. అదే కృష్ణ చైతన్యమంటే. ఇక్కడ ఆత్మహత్య అనేది అధిక రేటులో ఉందని మీరు అంటున్నారు కదా?

పుష్ట కృష్ణ: అవును.

ప్రభుపాద: ఎందుకు? ఈ దేశానికి బంగారు గని కలిగి వుంది. అయితే ఎందుకు వారు అలా వున్నారు ? మరియూ ఇక్కడ పేదవానిగా అవ్వాలన్న అంత తేలిక కాదు, అని మీరు అంటున్నారు.

పుష్ట కృష్ణ: అవును. ఇక్కడ పేదవాడవటానికి కృషి చేయవలసి వుంటుంది..

ప్రభుపాద: అవును. ఇంకా ఆత్మహత్య అనేది ఉంది. ఎందుకు? ప్రతి వాడూ ధనవంతుడే, అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? Hm? మీరు ప్రత్యుత్తరం ఇవ్వగలరా?

భక్తుడు: వారికి ప్రధానంగా సంతోషం లేదు. ప్రభుపాద: అవును. ఆనందం లేదు.