TE/710810 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మర్యాద, ఏదైనా మాట్లాడే ముందు శిష్యుడు ముందుగా ఆధ్యాత్మిక గురువుకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఆధ్యాత్మిక గురువుకు గౌరవం ఇవ్వడమంటే ఆయన చేసే కొన్ని కార్యకలాపాలను. ఆయన చేసే కొన్ని కార్యకలాపాలను గుర్తుపెట్టుకోవడం. మీరు మీ ఆధ్యాత్మిక గురువుకు గౌరవం ఇచ్చినట్లే, నమస్ తే సరస్వతే దేవం గౌరవాణి-ప్రచారిణే ఇది మీ ఆధ్యాత్మిక గురువు యొక్క కార్యకలాపం, అతను భగవాన్ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని బోధిస్తున్నాడు మరియు అతను సరస్వతీ ఠాకుర శిష్యుడు. నమస్ తే సరస్వతే. మీరు దానిని సరస్వతి అని కాకుండా సరస్వతే అని ఉచ్చరించాలి. సరస్వతి..., నా ఆధ్యాత్మిక గురువు. కనుక అతని శిష్యుడు సరస్వతే. సరస్వతే దేవం గౌర-వాణి-ప్రచారిణే. ఇవీ కార్యకలాపాలు. మీ ఆధ్యాత్మిక గురువు యొక్క కార్యకలాపాలు ఏమిటి? అతను కేవలం చైతన్య భగవానుడి సందేశాన్ని బోధిస్తున్నాడు. అది అతని వ్యాపారం."
710810 - ఉపన్యాసం SB 01.01.02 - లండన్