TE/Prabhupada 0864 - మొత్తం మానవ సమాజాన్ని సంతోషంగా చేయాలంటే, ఈ భగవంతుని చైతన్య ఉద్యమం విస్తరించాలి: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0863 - Vous pouvez manger de la viande, mais vous ne pouvez mangez de la viande en tuant vos père et mère|0863|FR/Prabhupada 0865 - Vous prenez du Pays, mais le Sastra prend des planètes, pas du Pays|0865}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0863 - మీరు మాంసం తినవచ్చు, కానీ నీ తండ్రి మరియు తల్లిని చంపి మాంసం తినకూడదు|0863|TE/Prabhupada 0865 - మీరు దేశముగా తీసుకుంటున్నారు, కానీ శాస్త్రం దేశముగా కాదు, లోకములగా తీసుకొంటున్నది|0865}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|m23sG620XVs|మొత్తం మానవ సమాజాన్ని సంతోషంగా చేయాలంటే, ఈ భగవంతుని చైతన్య ఉద్యమం విస్తరించాలి  <br />- Prabhupāda 0864}}
{{youtube_right|VXKYSlzYcsQ|మొత్తం మానవ సమాజాన్ని సంతోషంగా చేయాలంటే, ఈ భగవంతుని చైతన్య ఉద్యమం విస్తరించాలి  <br />- Prabhupāda 0864}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 20:39, 8 October 2018



750521 - Conversation - Melbourne


మొత్తం మానవ సమాజాన్ని సంతోషంగా చేయాలంటే, ఈ భగవంతుని చైతన్య ఉద్యమం విస్తరించాలి

దర్శకుడు: మన మంత్రి తనను తాను ప్రజల సేవకుడిగా భావిస్తాడు, వారిని తన్ని వేయవచ్చు ...

ప్రభుపాద: అది లోపము. ప్రజలు మూర్ఖులు, వారు మరొక మూర్ఖుని ఎన్నుకున్నారు. (నవ్వు) అది లోపము.

దర్శకుడు: కానీ అది ఎలా.

ప్రభుపాద: కాబట్టి ఏమి చేయవచ్చు? అప్పుడు నిస్సహాయులం.

దర్శకుడు: బాగా, మీరు పని చేయవచ్చు ...

ప్రభుపాద: కానీ మనము ఈ మూర్ఖుల మీద ఆధారపడకుండా వెళ్తున్నాము. మనము వెళ్తున్నాము. మనము మన పుస్తకాలను ప్రచురిస్తున్నాము, మనము మన ఉద్యమమును తయారు చేస్తున్నాము, నిజాయితీగా ప్రయత్నిస్తాము. అంతే. అది మనము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాము.

దర్శకుడు: మేము చేయగలిగేది ఏమిటంటే మిమల్ని అనుమతించటము. మీరు జనాలను అందరినీ భిన్నమైన విధానములలో ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రభుపాద: అవును, మేము చేస్తున్నాం.

దర్శకుడు: మీరు అలా చేసినప్పుడు, అప్పుడు సామాజిక సంక్షేమ శాఖకు కొన్ని నియమాలు ఉన్నాయి...

ప్రభుపాద: ఉదాహరణకు మనం ఒక వ్యక్తికి బోధిస్తే, "దయచేసి అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉండరాదు" అని మీకు అభ్యంతరం ఉందా? దర్శకుడు: క్షమించండి?

ప్రభుపాద: నేను అక్రమంగా లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని ఎవరికైనా సలహా ఇస్తే, మీకు ఏమైనా అభ్యంతరమైనా ఉన్నదా?

దర్శకుడు: అవును, నేను కలిగి ఉన్నాను ...

ప్రభుపాద: నీకు అక్రమ సంబందము ఉందా... నేను చెప్పినట్లే...

దర్శకుడు: నాకు మైథునం ఇష్టం, నా భార్యకు మైథునం ఇష్టము. మేము కేవలం ఆనందిస్తాము. మేము ఇది లేకుండా జీవించలేము. మా వివాహం సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మైథునం కలిగి వున్నాము

ప్రభుపాద: చూడండి. (చక్లింగ్) ఇది పరిస్థితి.

దర్శకుడు: అది పరిస్థితి. మేము ఇద్దరం కొట్టుకొనిపోతున్నాము...

ప్రభుపాద: ఎలా వారు అంగీకరించారు? (భక్తులను సూచిస్తూ)

డైరెక్టర్: నాకు తెలియదు. నాకు తెలియదు. కానీ నేను చేయలేకపోయాను. జీవితం ఉన్నది లైంగిక సుఖం కోసం, మా వివాహం లైంగిక జీవితంతో సంతోషంగా ఉంది.

ప్రభుపాద: లేదు, మేము లైంగిక జీవితం నిషేధించము. కానీ మేము నిషేధించాము...

దర్శకుడు: ... కానీ ఇద్దరు పిల్లలు లేరు...

ప్రభుపాద: ... అక్రమ లైంగిక జీవితం.

దర్శకుడు: మేము మాత్ర వాడతాము లేదా అన్ని రకాలైన గర్భ నిరోధకాలను వాడతాము. ఎందుకంటే ఇది మాకు...

ప్రభుపాద: ఎందుకు మీరు గర్భ నిరోధకాలను ఉపయోగించాలి?

దర్శకుడు: మేము ఇంకా ఎక్కువ మంది పిల్లలు వద్దు అనుకున్నాము.

ప్రభుపాద: అప్పుడు ఎందుకు లైంగిక జీవితమును ఆపలేవు?

దర్శకుడు: ఎందుకంటే మాకు లైంగిక జీవితం ఇష్టం.

ప్రభుపాద: చూడండి.

దర్శకుడు: ఎందుకంటే మేము దానిని ఆనందిస్తాము.

ప్రభుపాద: దాని అర్థం మీరు వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారు, "నేను నచ్చిన ప్రతిదాన్ని చేయాలనుకుంటున్నాను, ఇంకా నేను చికిత్స కావాలనుకుంటున్నాను." ఇది పరిస్థితి. మీకు కావాలి ...

డైరెక్టర్: నేను చికిత్స కోసం రాలేదు. (నవ్వు) మీరు నా గురించి అడిగారు నా యొక్క...

ప్రభుపాద: లేదు, లేదు, నీవు... లేదు, లేదు, మీరు ఇక్కడికి చికిత్స కోసం వచ్చారు, ఎందుకంటే, సమాజమును నియంత్రించడంలో మీరు విఫలమయ్యారు; మీ కార్యక్రమాలు. కాబట్టి మీరు చికిత్సకై ఇక్కడకు వచ్చారు. కానీ నేను ఔషధం ఇచ్చినప్పుడు, మీరు అంగీకరించరు.

దర్శకుడు: నేను చికిత్స కోసం రాలేదు.

ప్రభుపాద: లేదు... అవును. లేకపోతే ఎందుకు మీరు వస్తారు?

దర్శకుడు: నేను ఆహ్వానించబడ్డాను.

ప్రభుపాద: మీ సామాజిక కార్యక్రమాలలో, సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో మీకు సహాయం చేయటానికి. మా నుండి కొంత సూచన తీసుకోవాటానికి. కానీ మేము సలహా ఇచ్చినప్పుడు, దానిని తిరస్కరిస్తున్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మీ కార్యక్రమాలు చాలా బాగా చేయగలగడానికి కొన్ని సూచనలు తీసుకోవడానికి మీరు ఇక్కడకు వచ్చారు, కానీ మేము సూచించినప్పుడు, దానిని తిరస్కరిస్తున్నారు.

దర్శకుడు: నేను ఇద్దరు వ్యక్తులను -నా అంతట నేను, మరియు నేను ప్రజా సేవకునిగా ఉన్నాను.

ప్రభుపాద: ఏదైనా, ఎవరైనా. అది పరిస్థితి. చికిత్స కోసం మనము ఒక వైద్యుడు దగ్గరకు వెళ్లుతాము, వైద్యుడు ఔషధం సూచిస్తారు, మీరు ఇది తిరస్కరించుతారు. కాబట్టి ఎలా మీకు నయమవుతుంది? అది పరిస్థితి. ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడినప్పుడు, మీరు ఇతర రోగుల అంగీకారంలో ఉంచాలని కోరుకుంటారా. రోగికి ప్రిస్క్రిప్షన్ గురించి ఏమి తెలుస్తుంది? వారు రోగులు. అక్కడ ఏ ప్రశ్న లేదు...

దర్శకుడు: నేను ఇక్కడకు వచ్చి మీ ఉద్యమంలో చేరాలనుకుంటే, నేను దానిని అంగీకరించాలి.

ప్రభుపాద: లేదు, మీరు చేరండి లేదా చేరకపొండి, మీరు ఇక్కడకు వచ్చారు మమ్మల్ని సంప్రదించడానికి మేము మీ కార్యక్రమాలకు సహాయపడగలమేమో అని. కానీ మేము సలహా ఇచ్చినప్పుడు, మీరు దానిని ఆమోదించరు. ఇది మీ పరిస్థితి.

భక్తుడు (1): ఆయన ఇప్పుడు వెళ్ళాలి, శ్రీల ప్రభుపాద.

ప్రభుపాద: ఆయనకి ప్రసాదం ఇవ్వండి. వేచి ఉండండి. కాబట్టి ... వాస్తవంగా మొత్తం మానవ సమాజంలో సంతోషంగా ఉండటానికి, ఈ భగవంతుని చైతన్యము ఉద్యమం తప్పక వ్యాప్తి చేయాలి.

దర్శకుడు: సరే, నేను తప్పని సరిగా రిపోర్ట్ చేస్తాను. నన్ను చూసినందుకు చాలా ధన్యవాదాలు.

ప్రభుపాద: కొద్దిసేపు వేచి ఉండండి. భక్తుడు : మా దగ్గర కొన్ని మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి మేము సిద్ధం చేస్తున్నాము (అస్పష్టముగా ఉంది).

భక్తుడు (3): ఆయన మీకు ఏదో తీసుకు వస్తున్నాడు, ఒక్క నిమిషం.

దర్శకుడు: ఇందులో భాగం ...

భక్తుడు (3): అవును, అవును.

ఇది ఒక ఆచారం మర్యాద.

భక్తుడు (1): అందరికి ప్రసాదం ఇవ్వాలని శ్రీల ప్రభుపాద చెప్పారు.

ప్రభుపాద: ఇది మా ఆచారం మర్యాద అది ఎవరైనా వచ్చినారంటే, ఆయనకు ఒక చక్కని ఆసనము ఇచ్చి కొన్ని తినదగినవి ఇవ్వడము. అవును