TE/Prabhupada 0940 - ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏ పని లేదు. కేవలము ఆనందము: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0939 - Personne ne va se marier au mari qui a épousé Soixante-quatre fois|0939|FR/Prabhupada 0941 - Certains de nos étudiants, ils pensent que - Pourquoi devrais-je travailler dans cette mission?|0941}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0939 - అరవై నాలుగు సార్లు వివాహం చేసుకున్న భర్తను ఎవరూ వివాహం చేసుకోరు|0939|TE/Prabhupada 0941 - మా విద్యార్థుల్లో కొందరు, 'నేను ఈ సంస్థలో ఎందుకు పనిచేయాలి' అని ఆలోచిస్తారు|0941}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|j_tYz32siSc|ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏ పని లేదు. కేవలము ఆనందము  <br/>- Prabhupāda 0940}}
{{youtube_right|GM0fUXtACjE|ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏ పని లేదు. కేవలము ఆనందము  <br/>- Prabhupāda 0940}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



730427 - Lecture SB 01.08.35 - Los Angeles


ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏ పని లేదు. కేవలము ఆనందము ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో, జన్మించినవారు, ఆయన తన గురించి తనకు తాను భావించ కూడదు, నన్ను అతిథిగా లేదా అల్లుడిగా గౌరవించ వలెను. కాదు అందరూ పని చేయాలి. మీరు చూస్తారు, మొత్తం ప్రపంచం. మీ దేశంలో ప్రెసిడెంట్ ఉన్నాడు - ప్రతి చోట, ఆయన కూడా కష్టపడి పగలు మరియు రాత్రి పని చేస్తుంటాడు. లేకపోతే అతడు తన అధ్యక్ష పదవిని కాపాడుకోలేడు. ఇది సాధ్యం కాదు. మొత్తం మనస్సు రాజకీయ వ్యవహారాల్లో నిండి ఉంది. చాలా సమస్యలు, పరిష్కారాలు. ఆయన పని చేయాలి. అదేవిధముగా, వీధిలో ఉన్న వ్యక్తి, ఆయన కూడా పని చేయాలి. ఇది ప్రకృతి, భౌతిక ప్రకృతి. మీరు పని చేయాలి. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం కాదు. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే పని లేదు. కేవలము ఆనందము ఉంటుంది. మీరు కృష్ణుడి పుస్తకము చదవడము ద్వారా చూస్తారు. వారు పని చేయడము లేదు. కృష్ణుడు దూడలతోను, ఆవులతో వెళ్ళుతున్నాడు. అది పని చేయడము కాదు . అది వినోదము. అది వినోదము. వారు నృత్యం చేస్తున్నారు, వారు అడవికి వెళ్తున్నారు, వారు గంగా నది ఒడ్డున కూర్చుని ఉన్నారు. కొన్నిసార్లు రాక్షసులు దాడి చేస్తున్నారు, కృష్ణుడు చంపుతున్నాడు. ఇది అంతా ఆనందం, వినోదము. Ānanda-mayo 'bhyāsāt. అది ఆధ్యాత్మిక ప్రపంచం. కేవలం, ఆధ్యాత్మిక కార్యక్రమము యొక్క నమూనా తీసుకోండి. మనము... మనకు చాలా శాఖలు ఉన్నాయి, చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ మనము పని చేయడములేదు. సాధారణ, ఆధ్యాత్మిక జీవితం యొక్క నమూనా. మా పొరుగువారు అసూయపడతారు: "ఈ ప్రజలు ఎలా నృత్యం కీర్తన, జపము చేస్తూ తింటున్నారు ?" (నవ్వు) ఎందుకంటే వారు పిల్లులు కుక్కల వలె కష్టపడి పనిచేస్తున్నారు, మనకు అలాంటి బాధ్యత లేదు. మనము ఆఫీసు లేదా కర్మాగారానికి వెళ్ళవలసిన అవసరము లేదు. చూడండి, ఆచరణాత్మక ఉదాహరణ. ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితం యొక్క నమూన మాత్రమే. కేవలం మీరు ఆధ్యాత్మిక జీవితానికి రావాలని ప్రయత్నిస్తున్నారు, ఒక నమూనా. నమూనా లో చాలా ఆనందం ఉంది, నమూనాలో, వాస్తవములో ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఎవరైనా గ్రహించగలరు. ఇది ఆచరణాత్మకమైనది. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోండి, మనము ఆహ్వానిస్తున్నాము! దయచేసి రండి, మాతో చేరండి. కీర్తన చేయండి, మాతో నృత్యం చేయండి. సంతోషంగా ఉండండి. ప్రసాదము తీసుకోండి " లేదు, లేదు, మేము పని చేస్తాము. "(నవ్వు) చూడండి. మన పని ఏమిటి? మనము కేవలం ప్రచారము చేస్తున్నాము , "దయచేసి రండి ." "లేదు" ఎందుకు? "నేను పిల్లులు మరియు కుక్కలు లాగా పనిచేస్తాను" అంతే. కాబట్టి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం మధ్య తేడా. భౌతిక జీవితము అంటే మీరు పని చేయాలి. మీరు బలవంతము చేయబడతారు. Avidyā-karma-saṁjñānyā tṛtīyā śaktir iṣyate ( CC Adi 7.119) కృష్ణుడి శక్తిని విష్ణువు పురాణములో విశ్లేషించేటప్పుడు ఇది, viṣṇu-śaktiḥ parā proktā. అని చెప్పబడినది విష్ణువు ,విష్ణువు యొక్క శక్తి పరా, ఉన్నతమైన శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి. పరా. పరా మరియు అపరా, మీరు భగవద్గీతలో చదివారు. Apareyam itas tu vidhi me prakṛtiṁ parā ( BG 7.5) కృష్ణుడు విశ్లేషించేటప్పుడు, రెండు రకాల ప్రకృతి ఉన్నాయి, పరా మరియు అపరా, న్యూన మరియు ఉన్నతమైనది. ఇది కూడా ప్రకృతి, bhūmih, āpaḥ, analo, vāyuḥ, భూమి, నీరు, అగ్ని, గాలి. ఇది కూడా కృష్ణుడి ప్రకృతి . కృష్ణుడు vidhi me prakṛtiḥ aṣṭadhā అని అన్నాడు. ఈ ఎనిమిది రకాల భౌతిక ప్రకృతి, అవి నా ప్రకృతి, అవి నా శక్తి. కానీ అవి అపరేయమ్. కానీ ఇది న్యూన శక్తి. మరొకటి, ఉన్నత ప్రకృతి ఉంది." అది ఏమిటి, అయ్యా? " జీవ-భూత, ఈ జీవ శక్తి. ఈ మూర్ఖులు, వారికి రెండు ప్రకృతులు పని చేస్తున్నాయని తెలియదు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి భౌతిక ప్రకృతి లోపల ఉంది; ఇది పని చేస్తుంది. లేకపోతే భౌతిక ప్రకృతి స్వతంత్రంగా పనిచేయటానికి శక్తి లేదు. శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు ఈ సాధారణ విషయమును అర్థం చేసుకోలేరు