TE/Prabhupada 0619 - లక్ష్యం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగమెరుగు పర్చుకోవడము.అది గృహస్త-ఆశ్రమం

Revision as of 09:45, 27 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0619 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.7.24 -- Vrndavana, September 21, 1976


Matir na kṛṣṇe parataḥ svato vā mitho 'bhipadyeta gṛha-vratānām ( SB 7.5.30) Gṛha-vratānāṁ matir na kṛṣṇe. ఎవరైతే ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారో, వారు, "నేను ఈ కుటుంబ జీవితంలోనే ఉంటాను, నా పరిస్థితి మెరుగుపరుచుకుంటూ, "గృహ -వ్రతానాం... గృహ -వ్రత. గృహస్త మరియు గృహ-వ్రత భిన్నమైనవి. గృహస్త అంటే గృహస్త-ఆశ్రమం. ఒక వ్యక్తి, భర్త, భార్య లేదా పిల్లలతో నివసిస్తున్నాడు, కానీ అతని లక్ష్యం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగ మెరుగు పర్చుకోవడము. అది గృహస్త-ఆశ్రమం. అలాంటి లక్ష్యాలు లేని వ్యక్తి, ఆయన కేవలం ఇంద్రియాలను అనుభవించాలని కోరుకుంటాడు, ఆ ఉద్దేశ్యంతో ఆయన గృహాన్ని అలంకరించడం, భార్య, పిల్లలను అలంకరించడం - దీనిని గృహ వ్రత లేదా గృహమేధీ అని పిలుస్తారు. సంస్కృతంలో విభిన్న అర్థాల కోసం వివిధ పదాలు ఉన్నాయి. కాబట్టి గృహ -వ్రతంలో ఉన్నవారు, వారు కృష్ణ చైతన్యంలో ఉండలేరు. Matir na kṛṣṇe parataḥ svato vā. పరతః అంటే గురు ఉపదేశము లేదా ప్రామాణికుని యొక్క ఉపదేశము ద్వారా పరతః, స్వతాః సహజముగా అని అర్థం. సహజముగా అయినా, సూచనల ద్వారా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే తన ప్రతిజ్ఞ అది "నేను ఈ విధముగా ఉంటాను." గృహ -వ్రతానాం Matir na kṛṣṇe parataḥ svato vā mitho 'bhipadyeta. మిథాః సమావేశం ద్వారా కాదు, సంభాషణ ద్వారా కాదు, తీర్మానం చేయటము ద్వారా కాదు, మనకు కృష్ణ చైతన్యము కావాలంటే, అది సాధ్యం కాదు. ఇది అంతా వ్యక్తిగతం. నేను వ్యక్తిగతంగా కృష్ణుడికి శరణాగతి పొందాలి. ఉదాహరణకు మీరు విమానంలో ఆకాశంలోకి వెళ్లినప్పుడు, అది అంతా వ్యక్తిగతం. ఒక విమానం ప్రమాదంలో ఉంటే, ఇతర విమానం దాన్ని కాపాడలేదు. అది సాధ్యం కాదు. అదేవిధముగా, ఇది అంతా వ్యక్తిగతం. ఇది అంతా పరతః స్వతాః ఉంది. ప్రతి ఒక్కరు తీవ్రముగా తీసుకోవాలి వ్యక్తిగతంగా , "కృష్ణుడు కోరుకుంటున్నాడు, నేను శరణాగతి పొందుతాను. కృష్ణుడు చెప్పెను, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కాబట్టి నేను చేస్తాను. అంతే కాని "నా తండ్రి చేసినప్పుడు, నేను చేస్తాను," లేదా "నా భర్త చేసినప్పుడు, అప్పుడు నేను చేస్తాను" లేదా "నా భార్య చేసినప్పుడు." లేదు ఇది అంతా వ్యక్తిగతం. ఇది అంతా వ్యక్తిగతం. అందులో ఎలాంటి నిర్బంధం లేదు. అందులో ఎటువంటి నిర్బంధం లేదు. అహైతుకీ అప్రతిహతా. మీరు కృష్ణుడికి శరణాగతి పొందాలనుకుంటే, ఎవరూ మిమ్మల్ని నిరోధించలేరు. Ahaituky apratihatā yayā ātmā suprasīdati. మీరు వ్యక్తిగతంగా అలా చేసినప్పుడు... మీరు ఉంటే... అది సమిష్టిగా చేస్తే, అది మంచిది, కాని అది వ్యక్తిగతంగా చేయవలసి ఉంటుంది.