TE/Prabhupada 0629 - మనము వేర్వేరు దుస్తులలో ఉన్న భగవంతుని యొక్క వివిధ రకముల కుమారులము

Revision as of 16:48, 24 January 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0629 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972


కాబట్టి కృష్ణ చైతన్యము కావాలంటే, మనము మూడు విషయాలు మాత్రమే అర్థం చేసుకోవాలి:

భోక్తారాం యజ్ఞ - తపసాం
సర్వ - లోక - మహేశ్వరం
సుహృదం సర్వ - భూతానాం
జ్ఞాత్వామామ్ శాంతిముచ్యతిః
( BG. 5.29)

మనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అది జీవితం కోసం పోరాటం. కానీ మనము ఈ మూడు సూత్రాలను అర్థం చేసుకుంటే, భగవంతుడు సర్వోన్నత తండ్రి, భగవంతుడు సర్వోన్నత యజమాని, భగవంతుడు సర్వోన్నత స్నేహితుడు, ఈ మూడు విషయాలు మీరు అర్థం చేసుకుంటే, వెంటనే మీరు శాంతిగా ఉంటారు. తక్షణమే. మీరు సహాయం పొందటానికి స్నేహితులను కోరుకుంటున్నారు, చాలా మందిని. కానీ మనము కేవలము భగవంతుణ్ణి అంగీకరించినట్లయితే, కృష్ణుడు, నా స్నేహితుడు, మహోన్నతమైన స్నేహితుడు, అప్పుడు మన సమస్య పరిష్కరించబడుతుంది. అదేవిధంగా, మనము భగవంతుణ్ణి అత్యుత్తమ యజమానిగా అంగీకరిస్తే, మన ఇతర సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకనగా మనము దేవుడికి చెందిన వస్తువులకు యాజమాని అని తప్పుగా చెప్పుకుంటున్నాము. ఈ భూమి, అమెరికా యొక్క ఈ భూమి అమెరికన్లకు చెందుతుంది; అని తప్పుగా చెప్పుకుంటున్నాము. ఆఫ్రికా భూభాగం ఆఫ్రికన్లకు చెందుతుంది. లేదు. ప్రతి భూమి భగవంతుడికి చెందుతుంది. ఆఫ్రికా భూమి అఫ్రికన్లకు చెందుతుంది. కాదు. భూమి అంతా భగవంతునికి చెందుతుంది మనము వేర్వేరు దుస్తులలో ఉన్న భగవంతుని యొక్క వివిధ రకముల కుమారులము ఇతరుల హక్కును ఉల్లంఘించకుండా, తండ్రి, భగవంతుని ఆస్తిని ఆస్వాదించడానికి మనకు హక్కు ఉంది. కుటుంబంలో లాగానే, మనము జీవిస్తున్నాము, చాలా మంది సోదరులు. కాబట్టి తల్లితండ్రులు, మనం తినటానికి ఏది ఇస్తారో అది తింటాము. ఇతరుల పళ్ళెము పై మనము ఆక్రమించము. ఇది నాగరిక కుటుంబం కాదు. అదే విధంగా, మనము భగవంతుని అవగాహన కలిగి ఉన్నట్లైతే, కృష్ణ చైతన్యము, అప్పుడు ప్రపంచంలోని మొత్తం సమస్యలు- సామాజికపరమైన , ధర్మ పరమైన , ఆర్థిక పరమైన అభివృద్ధి పరమైన, రాజకీయ పరమైన - అన్నింటినీ పరిష్కరించవచ్చు. అది సత్యము.

అందువల్ల మానవ సమాజం యొక్క సంపూర్ణ ప్రయోజనం కోసం ఈ కృష్ణచైతన్య ఉద్యమమును వ్యాప్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మేము వివేకవంతులను అర్థిస్తున్నాము, ముఖ్యంగా విద్యార్ధులను, ఈ ఉద్యమంలో చేరమని, ఈ ఉద్యమం ఏమిటని శాస్త్రీయంగా అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. మా వద్ద చాలా పుస్తకాలు ఉన్నాయి, కనీసం రెండు డజన్ల పుస్తకాలు, గొప్ప గొప్పవి, ఘనమైనవి. కాబట్టి మీరు వాటిని చదువుకోవచ్చు, మీరు ఈ ఉద్యమమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, మాతో కలిసి ఉండండి. చాలా ధన్యవాదములు. హరే కృష్ణ.

(ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు).