TE/Prabhupada 0917 - మొత్తం ప్రపంచం ఇంద్రియాలకు సేవ చేస్తుంది. ఇంద్రియాల సేవకులు

Revision as of 14:50, 30 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0917 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730421 - Lecture SB 01.08.29 - Los Angeles


మొత్తం ప్రపంచం ఇంద్రియాలకు సేవ చేస్తుంది. ఇంద్రియాల సేవకులు కాబట్టి మీరు కృష్ణుడిని అలంకరించినట్లయితే, మీరు అలంకరించబడతారు. మీరు కృష్ణుడిని సంతృప్తి పరిస్తే, మీరు సంతృప్తి చెందుతారు. మీరు మంచి ఆహారాన్ని కృష్ణుడిని అందిస్తే, అప్పుడు మీరు వాటిని తినవచ్చు. బహుశా ఆలయము వెలుపల ఉన్నవారు అలాంటి మంచి ఆహార పదార్థాలను ఎప్పుడు ఊహించుకోలేరు. కానీ ఇది కృష్ణుడికి ఇవ్వబడుతున్నందున, అది తీసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. ఇది తత్వము. కాబట్టి మీరు అన్ని విషయాల్లో కృష్ణుడిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంతృప్తి చెందుతారు. ఇది... కృష్ణునికి మీ సేవ అవసరం లేదు. కానీ ఆయన దయతో అంగీకరిస్తాడు. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కృష్ణుడు మిమ్మల్ని అడుగుతున్నాడు: "నీవు నాకు శరణాగతి పొందు." అంటే ఇది కృష్ణుడికి ఒక సేవకుడు తక్కువ అయ్యాడు అని అర్థం కాదు, మీరు శరణాగతి పొందినట్లైతే మీరు లాభదాయకంగా ఉంటారు. (నవ్వు) కృష్ణుడు తన కోరికల ద్వారా లక్షలాది మంది సేవకులను సృష్టించగలడు. కాబట్టి అది విషయము కాదు. మీరు కృష్ణుడికి శరణాగతి పొందితే, మీరు రక్షింపబడుతారు. మీరు రక్షింపబడుతారు. అది మీ కర్తవ్యము.

కృష్ణుడు చెప్తున్నాడు: ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi ( BG 18.66) మీరు ఇక్కడ బాధపడుతున్నారు. ఉదాహరణకు ఏ ఆశ్రయం లేకుండా. వీధిలో ఎంతో మంది లక్ష్యము లేకుండా, ప్రాణము లేకుండా కాలము వృధా చేయడము చూస్తాము మనము బీచ్ దగ్గరకు వెళ్లుతాము. మనము చాలా మంది అబ్బాయిలు మరియు అమ్మాయిలును చూస్తున్నాము ఒక లక్ష్యం లేకుండా, కాలము వృధా చేస్తూ, ఏమి చేయాలో తెలియదు, అంతా గందరగోళం. కాబట్టి... కానీ మీరు కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు మీకు తెలుస్తుంది: ఓ, నేను ఇప్పుడు ఆశ్రయం కలిగి వున్నాను. "ఎప్పుడూ ఇంక గందరగోళం లేదు. ఇక నిరాశ లేదు. మీరు బాగా అర్థం చేసుకుంటారు. నేను ప్రతిరోజూ చాలా ఉత్తరాలను అందుకుంటాను, అవి ఎలా వారు కృష్ణ చైతన్యములో ఆశాజనకంగా ఉన్నారు.

కాబట్టి, కృష్ణుడు ఇక్కడకు వచ్చాడు, ఎవరో సేవకులను సేకరించడానికి వచ్చాడు, అది సత్యము కాదు. మనము అంగీకరిస్తే... కృష్ణుడి సేవకుడిగా మారడానికి బదులుగా, మనకు చాలా విషయాలు ఉన్నాయి. మనము మన ఇంద్రియాలకు, ఇంద్రియాల కార్యక్రమాలకు సేవకులము. కామ, క్రోధ, లోభ, మోహ. వాస్తవమునకు ప్రపంచం మొత్తం ఇంద్రియాలకు సేవ చేస్తుంది, ఇంద్రియాలకు సేవకులు . గోదాస. కానీ కృష్ణుడి సేవలో ఇంద్రియాలను నిమగ్నం చేస్తే, అప్పుడు మనము ఇక ఇంద్రియాలకు సేవకునిగా ఉండము. మనము ఇంద్రియాల యొక్క యజమానిగా ఉంటాము. ఎందుకంటే మనము, మనము, మనము మన ఇంద్రియాలను వేరే విషయములపై నిమగ్నము చేయడానికి అనుమతించము. ఆ బలం మనకు లభిస్తుంది అప్పుడు మనము సురక్షితంగా ఉంటాము.

ఇక్కడ కుంతీ దేవి వివరిస్తున్నది: ఈ భౌతిక ప్రపంచంలో మీ ఆవిర్భావము... తప్పుదారి పట్టించడము లేదు, అందరినీ తికమక పెడుతుంది మనము ఆలోచిస్తున్నాం: "కృష్ణుడికి కొంత లక్ష్యం ఉంది, కొంత ప్రయోజనము అందువలన ఆయన ఆవిర్భవించారు. "లేదు. ఇది ఆయన లీల. ఇది లీల. ఉదాహరణకు కొన్నిసార్లు గవర్నర్ జైలుకు తనిఖీ చేయడానికి వెళ్తాడు. ఆయన జైలుకు వెళ్ళవలసిన అవసరము లేదు. ఆయన సూపరింటెండెంట్ నుండి నివేదిక పొందుతాడు. ఆయనకు అవసరము లేదు ... అయినప్పటికీ కొన్నిసార్లు ఆయన వస్తాడు "వారు ఎలా ఉన్నారో చూద్దాం అని." దీనిని లీల అని పిలుస్తారు. అది ఆయన స్వేచ్ఛా సంకల్పం. ఆయన జైలు చట్టాలను పాటించవలిసి వచ్చినది అందువలన ఆయన జైలుకు రావలెను అని కాదు . కాదు, అలాంటిది కాదు. అయితే ఖైదీలు ఇలా అనుకుంటారు: "ఓ, ఇక్కడ గవర్నర్ కూడా జైలులోనే ఉన్నాడు. కాబట్టి మనము సమానం. మనము సమానం. నేను కూడా గవర్నర్ ను. "(నవ్వు) ఆ మూర్ఖుడు అలా భావిస్తాడు. "ఎందుకంటే కృష్ణుడు వచ్చినాడు కనుక, అవతారించాడు, నేను కూడా అవతారము." ఈ దుష్టత్వము జరుగుతోంది.