TE/660831 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"వ్యాధిగ్రస్త స్థితిలో మనం తీసుకునే ఆహార పదార్థాలను మనం ఆస్వాదించలేము. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆహారం రుచిని ఆస్వాదించగలం. కాబట్టి మనం నయం కావాలి. మనం నయం కావాలి. ఎలా నయం అవ్వాలి? దివ్యమైన కృష్ణ భావనామృత స్థితిలో ఉండాలి. అది నివారణ. కాబట్టి ఇంద్రియ భోగము యొక్క కోరికను తట్టుకోగలిగిన ఎవరికైనా కృష్ణ ఇక్కడ సలహా ఇస్తున్నారు. శరీరం ఉన్నంత కాలం, ఇంద్రియ భోగము యొక్క కోరికలు ఉంటాయి, కాని మన జీవితాన్ని అలాంటి కోరికలను సహించగలిగే విధంగా మలచుకోవాలి. సహించాలి. అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని ఇస్తుంది, మరియు మనం ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడినప్పుడు, ఆ ఆనందం అంతం లేనిది, అపరిమితమైనది. అంతం లేదు."
660831 - ఉపన్యాసం BG 05.22-29 - న్యూయార్క్