TE/661009 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నాలుగు తరగతుల వారు భగవంతుని శరణునొందరు... అంటే దుష్టులు, మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు మరియు నాస్తికులు. ఈ తరగతులు కాక దేవుని వద్దకు వచ్చే నాలుగు తరగతుల వారు, ఆర్తుడు, ఆపదలోవున్నవాడు, జిజ్ఞాసి, అర్థార్థులు, ... ఆర్థర్తి అంటే పేదరికంతో బాధపడుతున్నవారు, మరియు జ్ఞాని అంటే తత్వవేత్త. ఇప్పుడు, ఈ నాలుగు తరగతులలో, ‘తేశాం జ్ఞానీ నిత్య-యుక్త ఏక-భక్తిర్ విశిష్యతే’ అని కృష్ణ భగవానుడు పలికెను: 'కృష్ణ చైతన్యంలో ఈ నాలుగు తరగతులలో, భగవంతుని స్వభావాన్ని భక్తితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి, విశిష్యతే'. విశిష్యతే అంటే అతను ప్రత్యేక అర్హత కలిగినవాడు."
661009 - ఉపన్యాసం BG 07.15-18 - న్యూయార్క్